S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/13/2018 - 04:02

గుంటూరు, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న గల్లీలో కూడా తిరిగే ధైర్యం లేని రాష్ట్ర బీజేపీ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు విమర్శించారు. లేఖలు రాస్తూ, ప్రెస్‌మీట్‌లు పెడుతూ ప్రభుత్వంపై అసత్యారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పిల్లుల్లా, ఢిల్లీల్లో పేపర్ టైగర్‌లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

09/13/2018 - 01:31

అమరావతి, సెప్టెంబర్ 12: రైతులు తమ పొలం నుంచే నేరుగా పంట దిగుబడులకు ప్రపంచంలో ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందుకోసం ఈ- రైతు ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో బుధవారం మాస్టర్ కార్డ్ సంస్థ రూపొందించిన ఈ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

09/13/2018 - 01:28

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 12: రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు భద్రత కల్పించే బాధ్యత ఏపీ పోలీసు శాఖ భుజానికెత్తుకుంది.

09/13/2018 - 01:25

అమరావతి, సెప్టెంబర్ 12: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి బీ రామాంజనేయులు ఆకాంక్షించారు. బుధవారం సచివాలయం ఒకటో బ్లాక్‌లో సమాచార శాఖ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అవి హక్కుపరంగా ప్రజలకు అందించాల్సి ఉందన్నారు.

09/13/2018 - 01:25

అమరావతి, సెప్టెంబర్ 12: కొత్త రాజధాని అమరావతిలో సుమారు పదెకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మాణాన్ని వక్ఫ్‌బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కొత్త నగరంలో ఒకవైపు వెంకటేశ్వరుని ఆలయం, మరోవైపు మసీదు నిర్మించడం ద్వారా ప్రజా రాజధాని అన్ని మతాలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా మార్చాలనేదే తమ సంకల్పమని చెప్పారు.

09/13/2018 - 06:33

అమరావతి: నిరాశా నిస్పృహల్లో ఉన్న నిరుద్యోగుల కలల సాకారానికి ముహూర్తం కుదిరింది. ఉపాధి శిక్షణతో పాటు ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం యువనేస్తం వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులకు అక్టోబర్ నుంచి ప్రతినెలా ఆన్‌లైన్‌లో భృతి జమ అవుతుంది.

09/13/2018 - 01:23

గుంటూరు/ విజయవాడ, సెప్టెంబర్ 12: అధికారం కోసం ఎవ్వరితోనైనా నిస్సిగ్గుగా ఎన్నికల పొత్తులు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పిదమని గతంలో ఒకసారి ప్రకటించి మోదీ చరిష్మాను గుర్తించి అధికారం కోసం తిరిగి చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

09/13/2018 - 01:22

అమరావతి, సెప్టెంబర్ 12: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి విఘ్నాలులేకుండా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉన్న ఆటంకాలు తొలగిపోవాలన్నారు. విఘ్నేశ్వరుని చల్లని చూపు తెలుగు ప్రజలందరిపై ఉండాలన్నారు.

09/13/2018 - 06:05

అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ రెండు రూపాయలకు తగ్గించటం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఘనంగా సత్కరించారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి గోపాలనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని రాష్ట్ర కార్యవర్గసభ్యులు కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

09/13/2018 - 01:21

విజయవాడ, సెప్టెంబర్ 12: కార్డుదారులే తమకు దేవుళ్లని, దాదాపు 10వేల కోట్ల రూపాయల మేర సంస్థ అప్పుల్లో ఉన్నా, అప్పు చేసి పేదలకు పప్పుకూడు పెడుతున్నామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. త్వరలో రాష్టవ్య్రాప్తంగా చిరుధాన్యాలను చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Pages