S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/11/2018 - 17:25

హైదరాబాద్‌: తమ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు పోటీ చేసే తొలి అభ్యర్థిని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి పితాని బాలకృష్ణ అని పవన్‌ వెల్లడించారు.

09/11/2018 - 17:22

విజయవాడ: ఈ ఏడాది లక్షా అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. ఉపాధి కల్పనలో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని, రాయలసీమను ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

09/11/2018 - 12:53

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వరద నీరు ముంచెత్తకుండా కాపాడేందుకు గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద నిర్మిస్తున్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని రమణ పరిశీలించారు. ఈ పథకాన్ని ఈనెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శిశధర్, అర్భన్ ఎస్పీ విజయరావు పాల్గొన్నారు.

09/11/2018 - 12:48

విజయనగరం : పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. జివొ 279 ను రద్దు కోరుతూ మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, బి.సూరిబాబు, సిపిఎం నాయకులు ఆర్‌.శ్రీరామ్మూర్తి, పారిశుధ్య కార్మికులను పోలీసులు ఈడ్చుకుంటూ బలవంతంగా తీసుకెళ్లి పోలీస్‌ వ్యానుల్లో పడేశారు.

09/11/2018 - 12:47

హైదరాబాద్‌ : మనుష్యుల అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత-మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంగళవారం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఉత్తర మండల డిసిపి కార్యాలయానికి తరలించారు. అక్కడ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష్య సాధింపుతోనే కెసిఆర్‌, హరీశ్‌రావులు కుట్ర చేసి అరెస్టు చేశారని ఆరోపించారు.

09/11/2018 - 12:46

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా చేనేతల సమస్యలపై ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ సభలో మాట్లాడుతూ ప్రత్యేక బ్యాంకు సదుపాయం కల్పించి, రూ.లక్ష చొప్పున రుణం అందజేయాలని కోరారు.

09/11/2018 - 12:45

జగిత్యాల : కొండగట్టు ఘాట్‌రోడ్డుపై మంగళవారం జగిత్యాలకు చెందిన ఆర్‌టిసి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, భక్తులు సహాయ చర్యలు చేపడుతున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

09/11/2018 - 03:10

విజయవాడ, సెప్టెంబర్ 10: ప్రపంచంలోనే అద్భుత రాజధాని నిర్మాణానికి సహకరిస్తానంటూ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దానిని పూర్తిగా విస్మరించారని, రూ. 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యపడుతుందంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ ప్రశ్నించారు.

09/11/2018 - 03:10

అమరావతి, సెప్టెంబర్ 10: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్యసేవలు క్రమం తప్పకుండా అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. క్రమం తప్పకుండా డయాలసిస్ నిర్వహిస్తున్నారని, అన్నిరకాల చర్యలతో రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు.

09/11/2018 - 04:00

నరసరావుపేట: గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, దాచేపల్లి ప్రాంతాల్లో 600 కోట్ల రూపాయల విలువైన కోటి టన్నుల అక్రమ మైనింగ్ జరిగిందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేశారు.

Pages