S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/11/2018 - 02:50

అమరావతి, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతాంగం సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినటంతో పాటు అనారోగ్యానికి హేతువుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.

09/11/2018 - 02:50

అమరావతి, సెప్టెంబర్ 10: ఏషియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ రజత పతకం విజేత డాక్టర్ కలిదిండి మహేశ్‌వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింప చేసినందుకు అభినందించారు.

09/11/2018 - 03:58

అమరావతి: పోలవరం పనుల్లో జాప్యం సహించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై సోమవారం సచివాలయం నుంచి వర్చ్యువల్ తనిఖీ నిర్వహించారు. ఇప్పటి వరకు పోలవరం పనులు 58.15 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 14వేల 600 కోట్లు ఖర్చుచేశాం.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక చేసిన ఖర్చు 9వేల 464 కోట్లు.

09/11/2018 - 02:46

విజయవాడ, సెప్టెంబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఐటీఐల ఏర్పాటుకు వివిధ వర్గాల నుంచి 41 ప్రతిపాదనలు రాగా ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచాల్సి వచ్చిందని అందులో కృష్ణాజిల్లా పామర్రు కూడా ఒకటని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.

09/11/2018 - 02:45

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్రోల్, డీజిల్ వల్ల వచ్చిన అదనపు ఆదాయంపై శే్వతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులను నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ముసుగు వీరుల ఆటలు సాగవని హెచ్చరించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

09/11/2018 - 02:44

విజయవాడ, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ లారీ యజమానుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో సీఎంను సోమవారం కలిసి దేశంలోనే మొట్టమొదటగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, లారీ ఫీల్డ్‌ను ఆదుకుంటున్న సీఎంగా నిలిచిపోతాయని తెలిపారు.

09/11/2018 - 02:44

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 10: దేశంలోనే నవ్యాంధ్రను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యలో సంస్కరణలు తీసుకువస్తున్నామని, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసే క్రమంలో రాష్ట్రంలో మొదటి సారిగా పాలిటెక్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

09/11/2018 - 02:43

విజయవాడ, సెప్టెంబర్ 10: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం 2006లో అమల్లోకి తీసుకురాగా 2014 వరకు ఒక్క కి.మీ రోడ్డు కూడా వేయలేదని, గత నాలుగేళ్లలో రూ. 683 కోట్లు ఖర్చుతో 16,685 కి.మీ మేర మట్టిరోడ్ల నిర్మాణం చేపట్టామని, ఈ సంవత్సరం మరో వెయ్యి కి.మీ మేర రోడ్లు వేసేందుకు రూ. 70 కోట్లు మంజూరు చేసామని రాష్ట్ర పంచాయతీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.

09/10/2018 - 04:21

విజయవాడ, సెప్టెంబర్ 9: ఏ దేశానికైనా, కుటుంబానికైనా యువతే వెనె్నముక. విద్యావంతులైన యువతరానికి ఉపాధి అవకాశాలు అందించగలిగితే సమాజ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. ఇదే విషయాన్ని నమ్మి దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను ఉద్యోగార్దులుగా మార్చేందుకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని రూపొందించారు.

09/10/2018 - 04:21

మచిలీపట్నం, సెప్టెంబర్ 9: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుండి యువనేస్తం పథకం కింద రాష్ట్రంలోని 12లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Pages