S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/11/2018 - 02:55

అమరావతి, సెప్టెంబర్ 10: విశాఖపట్నంలో సబ్‌మెరైన్ హెరిటేజ్ మ్యూజియం స్థాపన అవకాశాలపై ఆధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో తూర్పు నావికాదళ అధికారులు సీఎంతో భేటీ అయ్యారు. పర్యాటక అభివృద్ధిపై వీరితో ముఖ్యమంత్రి చర్చించారు. వీటిపై నివేదిక సమర్పించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు.

09/11/2018 - 02:55

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్టుబడి నిధి, పసుపుకుంకుమ కింద రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు రూ.8,604.20 కోట్ల నిధులను మంజూరు చేశామని, తొలి మూడు విడతల్లో రూ.6,883.44 కోట్లు నిధులు వారి ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సెర్ప్ శాఖామంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

09/11/2018 - 02:54

విజయవాడ, సెప్టెంబర్ 10: మల్టీప్లెక్స్‌లో కన్నా విమానాశ్రయంలోకి వెళ్లడం సులువు అని, మల్లీప్లెక్స్‌ల్లో దోపిడీ ఎక్కువగా ఉందని పలువులు ఎమ్మెల్సీలు ఆరోపించారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మల్టీపెక్స్‌ల్లో ఎమ్పార్పీ ధరలు అమలుపై ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, వివివి చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇచ్చారు.

09/11/2018 - 02:54

విజయవాడ, సెప్టెంబర్ 10: రాయలసీమలో ప్రజలకు మంచినీటితోపాటు సాగునీరు కూడా అందించాలని ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వై కేశవరావు, ప్రధాన కార్యదర్శి పీ పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షులు పీ నరసింహారావు సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెలలో ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయన్నారు. గత ఏడాది కన్నా 190 టీఎంసీల నీరు అదనంగా ఉన్నదన్నారు.

09/11/2018 - 02:54

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 10: కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఏవైనా లోపాలుంటే సమీక్షించుకుని సరిదిద్దుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు. లోపాలుంటే మాత్రం క్షేమించే ప్రసక్తే లేదన్నారు. అలాంటివాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

09/11/2018 - 02:53

గుంటూరు, సెప్టెంబర్ 10: బ్రాహ్మణుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అని, అనువణువునా బ్రాహ్మణ ద్వేషం నిండిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీయేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ వేమూరి ఆనందసూర్య విమర్శించారు. విశాఖపట్నంలో వైసీపీ ఆధ్వర్యాన జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఒక ఫ్లాప్‌షో అని అభివర్ణించారు.

09/11/2018 - 02:52

అమరావతి, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హంతకముఠాగా మారుతోందని అధికార పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం శాసనసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోలేక కడప నుంచి మనుషుల్ని తెప్పించి మిమ్మల్ని హతమారుస్తామని బాహాటంగా బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

09/11/2018 - 02:52

అమరావతి, సెప్టెంబర్ 10: ప్రభుత్వం రైతులకు అన్నివేళలా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. నీరు- ప్రగతి, వ్యవసాయంపై సోమవారం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది దిగుబడులు పెంచే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తెగుళ్ల నియంత్రణ పట్ల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి..రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.

09/11/2018 - 02:52

అమరావతి, సెప్టెంబర్ 10: మెరుగైన ప్యాకేజీతో తమ భవిష్యత్తుకు బంగారుబాట వేశారని గన్నవరం రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతులు ముఖ్యమంత్రిని కలుసుకుని గన్నవరం విమానాశ్రయ రన్‌వే విస్తరణకు భూములిచ్చి తాము కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావటం సంతోషంగా ఉందన్నారు.

09/11/2018 - 02:51

అమరావతి, సెప్టెంబర్ 10: ఈ ఏడాది నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నం నోవాటెల్ హోటల్‌లో టెక్-2018 నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ తెలిపారు. ఈ విషయమై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Pages