S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/09/2018 - 23:16

విజయవాడ, సెప్టెంబర్ 9: నానాటికీ పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీపై సాలీనా దాదాపు రూ. 300 కోట్లకు పైగా అదనపు భారం పడుతున్న నేపథ్యంలో కార్మికులు ఎంతగా శ్రమిస్తున్నా నష్టాలు తగ్గకపోతుండడంతో గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రంలోని 128 డిపోలు, వర్క్‌షాప్‌ల వద్ద భారీగా ధర్నాలు చేయబోతున్నారు.

09/09/2018 - 23:15

విజయవాడ, సెప్టెంబర్ 9: పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగులకు, వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం జరిగే భారత్ బంద్‌ను రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు వామపక్షాలు, జనసేన పార్టీ సమాయత్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

09/09/2018 - 23:15

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9: రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణులు పోటీ చేయాలని, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అండగా ఉంటుందని రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన ప్రతినిధులు పలు అంశాలపై కీలక తీర్మానాలు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది.

09/09/2018 - 04:12

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే బీజేపీ, వైసీపీ నాయకులకు నిద్రపట్టడంలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని మోదీ నుంచి రక్షించటంమే చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.

09/09/2018 - 04:10

విజయవాడ, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కుటిల రాజకీయం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ధ్వజమెత్తారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును సాధించాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రజలను కేంద్రం ఇబ్బందులపాలు చేస్తోందన్నారు.

09/09/2018 - 04:10

అమరావతి, సెప్టెంబర్ 8: వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఆ నీటిలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కొట్టుకుపోవటం ఖాయమని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలతో వైసీపీ కనుమరుగవటం ఖాయమని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

09/09/2018 - 04:04

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో జ్వరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా కదులుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజూ రాష్ట్రంలో జ్వరాల పరిస్థితి ఎలా ఉందనే అంశం మీద ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తున్నారు. సోమవారానికల్లా పరిస్థితులు అదుపులోకి రావాలని అధికారులను ఆదేశించారు.

09/09/2018 - 04:03

అమరాతి, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ రాసారు. ‘సన్‌రైజ్ స్టేట్’గా ఏపీని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కలల సాకారానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు.

09/09/2018 - 04:03

అమరావతి, సెప్టెంబర్ 8: అమెరికాలోని సిన్సినాటిలో జరిగిన కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్ మృతిచెందటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల కాలంలో తెలుగుప్రజలు ఎక్కువగా ఇలాంటి సంఘటనలకు బలికావటం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. పృథ్వీరాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

09/09/2018 - 04:02

విజయవాడ, సెప్టెంబర్ 8: విశాఖ జిల్లాలో 186 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసిన కుంభకోణంలో దోషులను శిక్షించి భూములు స్వాధీనం చేసుకోవాలని సీపీఎం (ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే భారీ అవినీతికి పాల్పడి భూములను కాజేయడం సిగ్గుచేటన్నారు.

Pages