S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/31/2018 - 06:27

విజయవాడ (క్రైం), ఆగస్టు 30: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను గుర్తించి ఆరికట్టేందుకు టెక్నాలజీనీ పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాల్సిన అవసరముందన్నారు. తద్వారా నేరగాళ్ళను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

08/31/2018 - 06:26

విజయవాడ, ఆగస్టు 30: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న రహదార్ల నిర్మాణంలో అధికారులు, గుత్తేదారులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఏడీసీ సీఎండీ డీ లక్ష్మీపార్థసారథి సూచించారు. రాజధానిలోని ప్యాకేజీ 5, 6, 7లో జరుగుతున్న రహదార్ల నిర్మాణాలను గురువారం ఆమె పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నాయని పనుల్లో జాప్యం చేయరాదని హెచ్చరించారు.

08/31/2018 - 06:25

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ఊపందుకుంది. భూసేకరణకు సంబంధించి బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరవుతుండటంతో భూసేకరణ చురుకుగా సాగుతోంది. నిర్వాసితుల వ్యక్తిగత అకౌంట్లకు చెక్కులు జమ అయిన తర్వాత ఆయా వివరాలు సమర్పిస్తేనే, తదుపరి భూసేకరణ బిల్లులు మంజూరవుతున్నాయి. కాగా ప్రాజెక్టుకు అవసరమైన భూమి పెరగడంతోపాటు, భూసేకరణ ఖర్చు కూడా పెరిగింది.

08/31/2018 - 06:24

కర్నూలు, ఆగస్టు 30 : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను గురువారం జలాశయం అధికారులు మూసివేశారు. 3 రోజుల క్రితం 4 గేట్లను తెరిచి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం అన్ని గేట్లను మూసివేసి కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది నుంచి మాత్రమే 1,24,969 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

08/31/2018 - 06:22

గుంటూరు, ఆగస్టు 30: నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు భూములకు ఈ సారి సాగునీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం, ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయడంతో ఆయా జిల్లాల రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. మెట్ట ప్రాంతాల్లో సాగుచేసే ఆరుతడి పంటలతో పాటు వరిసాగుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది.

08/30/2018 - 06:17

నరసరావుపేట, ఆగస్టు 29: సినీ నటుడు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పట్ల శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హరికృష్ణ ప్రముఖ శైవక్షేత్రమైన గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న సంఘటనలు గుర్తు చేసుకున్నారు.

08/30/2018 - 06:16

ప్రత్తిపాడు, ఆగస్టు 29: కాంట్రాక్టరు చేసిన పనులకు బిల్లులు చేయడానికి రూ.40 వేలు లంచం తీసుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ ఇంజనీరింగ్ అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు.

08/30/2018 - 06:15

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 28: విద్యుత్ కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు పెంచాలని, సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్‌తో బుధవారం చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని గుణదలలోని విద్యుత్ సౌధ ముట్టడికి బుధవారం తరలివచ్చిన వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాగ్వాదాలు, తోపులాటలు, ఘర్షణలతో అట్టుడికింది.

08/30/2018 - 06:14

అమరావతి, ఆగస్టు 29: తెలుగుభాష ప్రాచుర్యాన్ని ఖండాంతరాలకు చాటిచెప్పిన దివంగత నేత ఎన్టీ రామారావుకు తగ్గ తనయుడిగా హరికృష్ణ భాషాభిమానాన్ని అనేక సందర్భాల్లో చాటుకున్నారు. చివరకు రాజ్యసభలో సైతం ఆసాంతం తెలుగులోనే ప్రసంగాన్ని కొనసాగించి రాజకీయ ఉద్ధండులను సైతం ఔరా అనిపించారు. రాష్ట్ర విభజనపై రాజ్య సభలో చర్చకు వచ్చిన సందర్భంలో తెలుగులోనే ప్రసంగిస్తానని తేల్చి చెప్పారు.

08/30/2018 - 06:13

విజయపురిసౌత్, ఆగస్టు 29: నాగార్జునసాగర్ క్రస్ట్‌గేట్ల నుంచి నీరు లీకవుతోంది. గతంలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమవటంతో లీకేజిని అరికట్టేందుకు ప్రాజెక్టు అధికారులు గేట్లకు రబ్బర్‌సీల్‌ను అమర్చారు. ప్రస్తుతం జలాయశ నీటిమట్టం పెరగటంతో గేట్లకు అమర్చిన రబ్బర్‌సీల్ ప్రాంత నుంచి నీరు కారుతోంది. లీకేజిని అరికట్టకపోతే గేట్ల అలైన్‌మెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pages