S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/25/2018 - 21:49

అమరావతి, ఆగస్టు 24: వచ్చే డిసెంబర్ నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ- ప్రగతి, రియల్‌టైం గవర్నెన్స్‌పై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ-ప్రగతితో 34 ప్రభుత్వశాఖలు, 87 విభాగాధిపతులు అనుసంధానం అవుతున్నారని అధికారులు వివరించారు.

08/25/2018 - 21:47

అమరావతి, ఆగస్టు 24: ముస్లిం మైనారిటీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసి వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

08/25/2018 - 21:46

రాజమహేంద్రవరం, ఆగస్టు 24: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం తగ్గుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఈ దశలో బ్యారేజి వద్ద 11.40 అడుగుల నీటి మట్టం నమోదైంది. సముద్రంలోకి 9.55 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది.

08/25/2018 - 04:29

మలికిపురం, ఆగస్టు 24: తూర్పు గోదావరి జిల్లా కేశనపల్లి వెస్ట్ స్ట్రక్చర్ పరిధిలోని గొల్లపాలెంలో 11వ నెంబరు బావి నుండి శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్ మరియు క్రూడాయిల్ లీకేజీకి గురయ్యింది. బావికి సమీపంలోనే పైపులైన్‌కు లీకేజీ సంభవించడంతో ఓఎన్‌జీసీ అధికార్లు వెంటనే అప్రమత్తమై లీకేజీని అదుపులోనికి తెచ్చారు.

08/25/2018 - 04:28

ఒంగోలు, ఆగస్టు 24: రొయ్యరైతులను రానున్న సీజన్‌లో నట్టేట ముంచేందుకు వ్యాపారులు సిండికేట్‌గా మారి భారీగా రొయ్యల ధరలను పెంచారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో 30కౌంట్ వెనామీ రొయ్య 330రూపాయలనుండి 350రూపాయల వరకు ధర పలకగా ప్రస్తుతం అదే కౌంట్ వెనామీ రొయ్యను కేజి 450రూపాయలకు వ్యాపారులు పెంచివేశారు.

08/25/2018 - 04:27

కొత్తగూడెం, ఆగస్టు 24: సింగరేణి కాలరీస్ సంస్థ 2017-18 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన 1212కోట్ల రూపాయల లాభాల నుండి కార్మికులకు 27శాతం వాటాను ఈనెల 29వ తేదీన చెల్లించనున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1212కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన సింగరేణి కార్మికులకు 27శాతం చొప్పున సుమారు 327కోట్ల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు.

08/25/2018 - 04:26

కాకినాడ, ఆగస్టు 24: కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని బియ్యం ఎగుమతిదార్ల సంఘం ముందుకొచ్చింది. సుమారు రూ.55 లక్షల విలువ గల బియ్యం, దుప్పట్లు, దుస్తులు కేరళ వరద బాధితులకు పంపించారు. శుక్రవారం కాకినాడలోని సంఘం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు లారీలకు జెండా ఊపి సాగనంపారు.

08/25/2018 - 04:12

అమరావతి, ఆగస్టు 24: చిన్నతనంలోనే సేవా దృక్పథంతో పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన మంచినీటిపై అవగాహన కల్పిస్తున్న ప్రవాసాంధ్రుడు సౌరిష్ సేవలు అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. తాను రూపొందించిన చిన్న నీటిశుద్ధి పరికరం పనితీరును ఉండవల్లి ప్రజాదర్బార్ వద్ద శుక్రవారం ముఖ్యమంత్రికి సౌరిష్ వివరించాడు. దీంతో సీఎం ముగ్ధులయ్యారు.

08/25/2018 - 04:10

విజయవాడ, ఆగస్టు 24: బీజేపీతో వైసీపీ నేత జగన్‌కు ఉన్న సంబంధం పవిత్రమా... అపవిత్రమా తెలిపిన తర్వాత కేరాఫ్ అడ్రస్ లేని జీవీఎల్ నరసింహారావులాంటి వారు మాట్లాడాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనంద్‌బాబు హితవు పలికారు.

08/25/2018 - 04:09

గుంటూరు, ఆగస్టు 24: భారతీయ జనతా పార్టీ నేతలు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును పావుగా వాడుకుంటున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎల్‌కు పీడీ ఖాతాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

Pages