S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/04/2018 - 03:51

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఒకటి రెండు సందర్భాలు మినహా అధికారం రెండు సామాజిక వర్గాలకే పరిమితమైందని జనజాగృతి పార్టీ అధినేత, అరకు ఎంపీ కొత్తపల్లి గీత పేర్కొన్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అధికారమే పరవాధిగా టీడీపీ, వైసీపీలు విమర్శించుకుంటూ ప్రజావసరాలను విస్మరిస్తున్నాయన్నారు.

09/04/2018 - 03:49

అమరావతి, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో కరవు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రజలకు నీరందించాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంచేశారు. ఉల్లి కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని నియంత్రించాలన్నారు. నాణ్యమైన ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

09/04/2018 - 03:49

ఒంగోలు, సెప్టెంబర్ 3: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ ఆర్‌పి ఠాకూర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో డీజీపీ పాల్గొన్నారు.

09/04/2018 - 03:48

విజయవాడ, సెప్టెంబర్ 3: తెలుగుదనం ప్రతిబించించే వంటకాలను మరింతగా జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రా ఫుడ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు... రాష్ట్ర ప్రజలకు ప్రీతిపాత్రమైన వంటకాలు ఎన్నో ఉన్నాయి.

09/04/2018 - 03:47

విజయవాడ, సెప్టెంబర్ 3: భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా సీబీఐ న్యాయస్థానంలో 11 ఛార్జీషీట్లు, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఐదు ఛార్జీషీట్లు ఎదుర్కొంటూ ప్రతి శుక్రవారం సీబీఐ న్యాయస్థానం వద్ద ముద్దాయిగా హాజరయ్యే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కోర్టులో విచారణ జాప్యం జరగడం వెనుక పెద్దకుట్ర ఉందని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

09/04/2018 - 03:46

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు నేషనల్ ర్యాంకింగ్ టీటీ టోర్నీ నిర్వహిస్తున్నట్లు టీటీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్ తెలిపారు.

09/04/2018 - 04:04

విజయనగరం, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు పరిపక్వత లేదని, ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని విద్యుత్ శాఖ మంత్రి, టీడీప రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

09/04/2018 - 01:06

విజయవాడ, సెప్టెంబర్ 3: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా 69 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 5న మంగళగిరిలో జరుగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. జిల్లాల వారీగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాల్సిన వేదిక, అందుకు బాధ్యులను కూడా ఖరారు చేస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

09/04/2018 - 01:05

తిరుపతి, సెప్టెంబర్ 3: టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్‌లో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముంబయ్ పేరుతో రూ.1,11,11,111 లక్షలను విరాళంగా ఇచ్చారు. డీడీ రూపంలో ఉన్న ఈ మొత్తాన్ని ఆ కంపెనీ ప్రతినిధి శివశంకర్ సోమవారం తిరుమలలోని డోనార్ సెల్‌కు అందించారు.

09/04/2018 - 01:05

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 3: రాష్ట్రంలో అతి కొద్ది ప్రాంతాల్లో సాగయ్యే ఉల్లి నేడు రైతుకు కంట తడిపెట్టిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు.

Pages