S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/27/2018 - 20:48

కర్నూలు సిటీ : కాంగ్రెస్ పార్టీతో పొత్తు తెలుగుదేశం పార్టీకి ఓకే కానీ ఏపీలో మాత్రం మినహాయింపు ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం డిప్యూటీ సీఎం కేఈ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

08/26/2018 - 04:50

విశాఖపట్నం, ఆగస్టు 25: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విశ్రాంత డీజీపీ నండూరి సాంబశివరావు స్వయంగా కలుసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం అచ్యుతాపురం మండల ధారభోగాపురం వద్ద జగన్ విడిది చేయగా, సాంబశివరావు కలుసుకున్నారు. జగన్‌ను కలిసిన సాంబశివరావు దాదాపు 15 నిముషాల పాటు ఏకాంతంగా చర్చించారు.

08/26/2018 - 04:43

యలమంచిలి, ఆగస్టు 25: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం విశాఖజిల్లా యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలంలో ప్రవేశించింది. నియోజకవర్గంలో మూడో రోజు సాగిన పాదయాత్రకు వర్షం కొంత ఆటంకం కలిగించింది. అయితే, చిరుజల్లులు పడుతుండగా పాదయాత్ర 245వ రోజు కొనసాగింది.

08/26/2018 - 04:41

విజయవాడ, ఆగస్టు 25: ఆదరణ-2 లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సైనికుల్లా పనిచేద్దామని, క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుదామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బీ ఉదయలక్ష్మి అన్నారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో సమర్థవంతంగా ఆదరణ-2 అమలు, విధివిధానాలపై జరిగిన రాష్టస్థ్రాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

08/26/2018 - 04:39

విశాఖపట్నం, ఆగస్టు 25: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ అన్నారు. పబ్లిక్ ఫోరం ఆధ్వర్యంలో విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో సమాచార హక్కుపై శనివారం జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

08/26/2018 - 04:38

పాడేరు, ఆగస్టు 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 130 శాసనసభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి మళ్లీ అధికార పగ్గాలను చేపట్టబోతుందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్. జవహార్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/26/2018 - 04:37

కర్నూలు, ఆగస్టు 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల సాధన కోసం తెలుగుదేశం పార్టీ కర్నూలులో శనివారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

08/26/2018 - 04:36

కర్నూలు, ఆగస్టు 25: శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక గణనీయంగా తగ్గిపోవడంతో శనివారం నాలుగు గేట్లు మూసివేశారు. జలాశయానికి అధిక మొత్తంలో వరద రావడంతో మూడురోజుల క్రితం ఒకేసారి 8 గేట్లు ఎత్తిన అధికారులు 24 గంటల తరువాత నాలుగు గేట్లను దించివేశారు. తాజాగా శనివారం ఉదయం రెండు గేట్లు, రాత్రి మిగతా రెండు గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం జలాశయం నీటిమట్టం 883.10 అడుగులుగా నమోదైంది.

08/26/2018 - 04:35

బళ్ళారి, ఆగస్టు 25: తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడడంతో జలాశయానికి వరద రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. శనివారం 47,568 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో జలాశయం 10 క్రస్ట్‌గేట్లను అడుగు మేర ఎత్తి దిగువ నదిలోకి 30,935 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

08/25/2018 - 21:50

అమరావతి, ఆగస్టు 24: రాష్ట్రంలో ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. ప్రధాన నగరాలు, తిరుమల-తిరుపతిలో త్వరలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Pages