S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/03/2018 - 06:03

కురబలకోట, సెప్టెంబర్ 2: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన మొరుంపల్లె రంగారెడ్డి ఇంటి ఆవరణలో శనివారం రాత్రి దాదాపు 90 బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. ఈ పుష్పాలు చూపరులను కనువిందు చేశాయి. రాత్రివేళల్లో మాత్రమే వికసించడం వీటి ప్రత్యేకత. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ పూలు పూస్తాయని రంగారెడ్డి భార్య, కురబలకోట జడ్‌పిటిసి మొరుంపల్లె ధనలక్ష్మి ఆదివారం ఈ విలేఖరికి తెలిపారు.

09/03/2018 - 01:31

మాచవరం, సెప్టెంబర్ 2: పులిచింతల ముంపు ప్రాంతాలైన రేగులగడ్డ, వెల్లంపల్లి గ్రామాల్లో ఆదివారం పులిచింతల స్పెషల్ కలెక్టర్ విజయచందర్ ఆధ్వర్యంలో బాధితులను బలవంతంగా ఖాళీ చేయించారు. నష్టపరిహారం ఇంకా రావాల్సి ఉంటే తప్పనిసరిగా రెండురోజుల్లో అందజేస్తామని, పరిహారం కన్నా ప్రాణం ముఖ్యమని, ప్రభుత్వ అధికారుల మాటలు వినాలని, తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

09/03/2018 - 01:20

వినుకొండ, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కే నాయుడు ఆదివారం గుంటూరు జిల్లా వినుకొండలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను ఎక్కాడు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు టవర్ కింద బేనర్ కట్టి ఆయన టవర్ పైకెక్కాడు. సమాచారం తెలుసుకున్న ప్రజలు, పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది హడావుడిగా అక్కడికి చేరుకున్నారు.

09/03/2018 - 01:15

విజయవాడ, సెప్టెంబర్ 2: పోలవరం ప్రాజెక్టును ఇప్పటివరకు లక్షలాది మంది ప్రజలు సందర్శించి ప్రశంసిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ కనీసం ప్రాజెక్టును చూడకుండా తన అనుచరుల చేత కేసులు వేయిస్తూ అడ్డుకోవాలని నాటకాలాడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

09/03/2018 - 01:14

విజయవాడ, సెప్టెంబర్ 2: సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న మహాగర్జన బస్సుయాత్ర కర్నూలు జిల్లాలో పర్యటించిన సందర్భంగా తాము గుర్తించిన రైతుల కష్టాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ఓ లేఖ రూపంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కరవు తీవ్రత వల్ల రాష్ట్రం మొత్తం మీద 60శాతం ప్రాంతం దుర్భిక్షంగా మారుతోందన్నారు.

09/03/2018 - 06:49

హైదరాబాద్/ శామీర్‌పేట: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదిక సభకు భారీగా గులాబీ దండు కదిలింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దీటుగా లక్షలాది వాహనాలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు సభకు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం సభా ప్రాంగణం మినహా పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం కురియడంతో సభ నిర్వహిస్తారా లేదా అనే ఆందోళన చెందిన పార్టీవర్గాలకు వరుణుడు కరుణించాడు.

09/02/2018 - 01:00

విజయవాడ, సెప్టెంబర్ 1: గుంటూరులో జరిగిన నారా హమారా - టీడీపీ హమారా సభలో గొడవలకు ప్రతిపక్ష నేత జగనే బాధ్యుడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. బీజేపీ, వైసీపీలు కలిసి కుట్ర పన్ని వైసీపీ పార్టీ వాళ్లని పంపించి కావాలని గొడవ చేయించాయన్నారు.

09/02/2018 - 00:59

హైదరాబాద్, సెప్టెంబర్ 1: జాతీయ ప్రవేశపరీక్షల ప్రక్రియ మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీతో పాటు మిగిలిన సంస్థలు జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల నోటిఫికేషన్లు జారీ చేశాయి. యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షకు సోమవారం నాడు రిజిస్ట్రేషన్ మొదలైంది. సెప్టెంబర్ 30 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుంది. నవంబర్ 19 నుండి అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. పరీక్ష డిసెంబర్ 9 నుండి మొదలై 23 వరకూ జరుగుతుంది.

09/02/2018 - 00:59

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 1: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్‌చెరువులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమిలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో శిక్షణకు సన్నాహాలు చేస్తున్నట్టు అకాడమి డిప్యూటీ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు.

09/02/2018 - 00:58

అమరావతి, సెప్టెంబర్ 1: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ 3లక్షల 3వేల 999 రూపాయల విరాళం అందజేశారు. ఈ మేరకు ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో శని వారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెక్కును అందజేశారు. కాగా బాబ్జీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి కేక్ కట్‌చేసి తినిపించారు.

Pages