S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/27/2018 - 05:01

గుంటూరు, ఆగస్టు 26: భారత రాజ్యాంగాన్ని పాలకులు పరిరక్షించాలే తప్ప అపహాస్యం చేయకూడదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాష్టప్రతి, ప్రధాని, కేంద్ర మంత్రులు ఉండే ఢిల్లీ నగరంలో రాజ్యాంగ ప్రతులను మతోన్మాదులు కాల్చినా వారిని అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కించటం తగదన్నారు.

08/27/2018 - 05:00

విజయవాడ, ఆగస్టు 26: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దయ్యేంత వరకు పోరాటం సాగించాలని, ఇందులో భాగంగా సెప్టెంబర్ 1న విజయవాడలో రాష్టస్థ్రాయిలో జరిగే ధర్నాలో పాల్గొనాలని విజయవాడ సత్యనారాయణపురం విజ్ఞాన విహార్‌లో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది.

08/27/2018 - 05:00

విజయవాడ, ఆగస్టు 26: చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని మన్నవరంలో నిర్మించ తలపెట్టిన ఎన్‌బీపీపీఎల్ (ఎన్‌టీపీసీ - బిఇఎల్‌ఎల్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్) ప్రాజెక్టు గుజరాత్‌కు తరలిపోనుందని వస్తున్న వార్తలు, కేంద్రం దుశ్చర్యను తక్షణం నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, మన్నవరంలో పరిశ్రమ కొనసాగేలా చూడాలని, దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలు కోరారు.

08/27/2018 - 02:31

ఆచంట, ఆగస్టు 26: ఇటీవలి వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరి రైతులకు హెక్టారుకు రూ.25వేలు సాయం అందిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం లంక భూముల్లో పండించే వాణిజ్య పంటల సంగతి మరచిపోయిందని రైతులు వాపోతున్నారు. గోదావరి లంక గ్రామాల్లో ప్రధానంగా తమలపాకు, కూరగాయలు, అరటి వంటి వాణిజ్య పంటలు పండిస్తుంటారు.

08/27/2018 - 02:29

విశాఖపట్నం, ఆగస్టు 26: టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో పోలిస్తే స్వాతంత్య్రానికి పూర్వ బ్రిటీష్ వాళ్లే నయమనిపిస్తోందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు.

08/26/2018 - 23:49

విజయవాడ, ఆగస్టు 26: ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులకు ప్రత్యేక పీఆర్సీ ప్రకటించాలని, గురుకులాల ఉపాధ్యాయులకు ప్రత్యేక స్కేల్ ప్రకటించాలని, ఉపాధ్యాయుల బదిలీ చట్టాన్ని పునః సమీక్షించాలని శాసనమండలి సభ్యుడు గాదె శ్రీనివాసులు నాయుడు డిమాండ్ చేశారు. 11వ వేతన సంఘం సిఫార్సులు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సామాజికంగా, ఆర్థికంగా గౌరవప్రదమైన స్థాయికి చేరేలా ఉండాలన్నారు.

08/26/2018 - 23:40

విజయవాడ, ఆగస్టు 26: రాష్ట్రంలో ఏదోవిధంగా అలజడులు సృష్టించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యూహరచన చేశారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆదివారం ఆయన నగరంలో విలేఖరులతో మాట్లాడుతూ అబద్ధాలు చెప్పీచెప్పీ ఆయన ఎంపీ పదవి దక్కించుకున్నారని విమర్శించారు. ఆయన కారు ఢీకొని రోడ్డు ప్రమాదంలో మరణించిన, గాయపడిన ఇద్దరి కుటుంబాల బాధ్యతను జీవీఎల్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

08/26/2018 - 23:35

విజయవాడ, ఆగస్టు 26: కచ్చితంగా ఐదేళ్లకోసారి జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఎవరికి వారు తమ స్వప్రయోజనాల కోసం ముందస్తుగా జరుపుకుంటుంటే, గ్రామాలకు ఆయువుపట్టైన పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి పాలకులకు జంకు ఎందుకని లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ప్రశ్నించారు.

08/26/2018 - 23:34

కోడూరు/ చల్లపల్లి, ఆగస్టు 26: గల్లంతైన ఎసఐ మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు.కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద పంటకాల్వలో గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్‌ఐ కోట వంశీధర్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. చల్లపల్లి మండలం మంగళాపురం సమీపంలోని 9వ నెంబరు పంటకాల్వ వద్ద కనిపించింది. ఎస్‌ఐ వంశీధర్ మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

08/26/2018 - 23:34

విశాఖపట్నం, ఆగస్టు 26: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Pages