S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/30/2018 - 06:12

ఒంగోలు అర్బన్, ఆగస్టు 29 : హైదరాబాద్‌లో విప్లవ రచయిత సంఘం నాయకుడు వరవరరావు ఇంటిపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించి ఆయన్ని అరెస్టుచేయడమే కాకుండా ప్రజా సాహిత్యాన్ని స్వాధీనం చేసుకోవడం అప్రజాస్వామికమని విరసం రాష్ట్ర నాయకులు జి కల్యాణ్‌రావు ఖండించారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఒంగోలులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

08/28/2018 - 06:05

విజయవాడ, ఆగస్టు 27: రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రక్షాళనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలను వ్యవస్థీకరించేందుకు ఒక చట్టం, పదోన్నతులు, ప్రోత్సాహకాల కోసం మరో చట్టాన్ని రూపొందిస్తోంది.

08/28/2018 - 06:08

విశాఖపట్నం, ఆగస్టు 27: ఆరు దశాబ్దాలపాటు ఉపాధ్యాయ నేతగా అనేక ఉద్యమాలు నడిపిన ఏపీటీఎఫ్ సీనియర్ నాయకుడు గుల్లపల్లి సింహాద్రప్పడు సోమవారం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ కేర్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన మరణించారు. ఆయన పార్థివదేహాన్ని విశాఖకు తీసుకువస్తున్నారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

08/28/2018 - 06:03

విజయవాడ, ఆగస్టు 27: కాంగ్రెస్ పాలనలో హరిత విప్లవం, క్షీర విప్లవం తీసుకురాగా.. బీజేపీ, టీడీపీ పాలనలో అవినీతి విప్లవం వచ్చిందని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసీరెడ్డి ధ్వజమెత్తారు.

08/28/2018 - 06:03

రాజమహేంద్రవరం, ఆగస్టు 27: ఘోర వరదల కారణంగా అపార నష్టం వాటిల్లిన కేరళ రాష్ట్రానికి కేవలం రూ.600 కోట్ల సాయం కేంద్రం ప్రకటించడం శోచనీయమని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు తేరుకోవడానికి చాలా కాలం పడుతుందన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

08/28/2018 - 06:00

కర్నూలు, ఆగస్టు 27: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ పర్యటన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాహుల్ అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించారన్నారు. వచ్చే నెల 18న కర్నూలులో రాహుల్ పర్యటన ఉంటుందన్నారు.

08/28/2018 - 05:59

విజయవాడ, ఆగస్టు 27: రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయమే లక్ష్యంగా వచ్చే నెల 15న విజయవాడలో మహాగర్జన నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజల సహకారాన్ని కోరుతూ సీపీఐ, సీపీఎం ఐక్యంగా బస్సు జాతాలు చేపడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. విజయవాడ దాసరి భవన్‌లో సోమవారం మహాగర్జన పోస్టర్‌ను, ప్రచార గీతాల సీడీనీ సీపీఐ, సీపీఎం నేతలు విడుదల చేశారు.

08/28/2018 - 05:55

విజయవాడ, ఆగస్టు 27: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల కనీస వేతనం రూ. 43,180లుగా ఉండేలా సిఫార్సు చేయాలని కోరుతూ ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయు) ఎమ్మెల్సీ ఫ్రంట్ ఫ్లోర్‌లీడర్ గాదె శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం సోమవారం నూతన పీఆర్‌సీ చైర్మన్ అశుతోష్ మిశ్రాను కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల కనీస వేతనం రూ. 25వేలు.. గరిష్ఠ వేతనం రూ.

08/27/2018 - 05:02

గుంటూరు, ఆగస్టు 26: ఒక నిర్ణయం ఎంతటి సంక్షోభాన్ని సృష్టిస్తుందో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే తెలుస్తుంది. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా తమ పార్టీకి ఎదురులేదనుకున్న పరిస్థితుల్లో తా జాగా పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది.

08/27/2018 - 05:01

విజయవాడ, ఆగస్టు 26: 1993 నవంబర్ 23కి ముందుగా నియమితులైన తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఆదివారం తాత్కాలిక ఎంప్లారుూస్ అసోసియేషన్ జేఏసీ కృష్ణా జిల్లా సమావేశం జరిగింది. బొజ్జా సుబ్బారావు అధ్యక్షత వహించారు.

Pages