S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/25/2018 - 04:07

విశాఖపట్నం, ఆగస్టు 24: రాజకీయ పక్షాలు శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా వ్యవహరించాలని, అప్పుడే ప్రజలకు మేలు చేకూరుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఉప రాష్టప్రతిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలో సన్నిహితులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న తీరుపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

08/25/2018 - 04:04

మడకశిర, ఆగస్టు 24: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ సీట్లు రద్దుచేసి వాటిని పేద విద్యార్థులకు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

08/25/2018 - 04:04

మంత్రాలయం, ఆగస్టు 24: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి 347వ సప్తఆరాధన మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.

08/25/2018 - 04:02

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఆగస్టు 24: శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లి భక్తులకు శ్రీవరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీవరలక్ష్మీదేవి అలంకారంతో ఉన్న శ్రీకనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు వేకువ జామునుండే ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు.

08/25/2018 - 04:01

సింహాచలం, ఆగస్టు 24: ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయుధంలా పనిచేస్తున్న సమాచార హక్కు చట్టాన్ని రక్షిస్తామని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చేలా ప్రజలు, జర్నలిస్టులు నాయకులను డిమాండ్ చేయాలని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీ్ధరాచార్యులు పిలునిచ్చారు. శుక్రవారం ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

08/24/2018 - 04:41

విజయవాడ, ఆగస్టు 23: విశాఖ మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధుల బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ బృందం గురువారం కలిసింది. సీఎంను కలిసిన బృందంలో మెట్రో రైలు కోచ్‌లకు వౌలిక సౌకర్యాల కల్పన, సిగ్నలింగ్ సిస్టమ్, ట్రాక్ డెవలపర్ల సంస్థల ప్రతినిధులు ఉన్నారు.

08/24/2018 - 04:40

గుంటూరు, ఆగస్టు 23: కేంద్రప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ నిలదీశారు. కేంద్రప్రభుత్వ పీడీ ఎకౌంట్‌లపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును జవహర్ ప్రశ్నించారు.

08/24/2018 - 04:40

కర్నూలు, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేసి ఆ దరిద్రాన్ని తలపై పెట్టుకునే అవసరం తమకు లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల టీడీపీ, కాంగ్రెస్ పార్టీ స్నేహంపై వస్తున్న వార్తల విషయంలో స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీలు తమకు ఉమ్మడి శత్రువులని పేర్కొన్నారు.

08/24/2018 - 02:58

రాజమహేంద్రవరం, ఆగస్టు 23: ప్రమాదపుటంచులను తాకి పరవళ్లు తొక్కిన వరద గోదావరి నెమ్మదిగా శాంతిస్తోంది. గత నాలుగు రోజులుగా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో అంటే దాదాపు 15 అడుగులకు పైబడి మట్టంలో ప్రవహిస్తూ గోదావరి తన ఉగ్రరూపం చూపించింది. అయితే ఎగువన వరద ఉద్ధృతి కాస్తంత తగ్గుముఖం పట్టింది. దిగువ మాత్రం ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది.

08/24/2018 - 02:54

విజయవాడ, ఆగస్టు 23: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు యనమల ఫౌండేషన్ తరపున రెండు లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అందచేశారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ఈ మేరకు సీఎంను గురువారం కలిసి చెక్కును అందచేశారు. ఏపీసీఆర్‌డీఏ తరపున ఉద్యోగుల ఒక రోజు వేతనాన్ని కేరళకు విరాళంగా 5.57 లక్షల రూపాయలను సీఎంకు సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీ్ధర్ అందచేశారు.

Pages