S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/10/2015 - 06:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనే విధంగా దేశంలో చేతివృత్తుల రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. రుణ సదుపాయాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ఉత్పత్తులను ప్రమోట్ చేయడం సహా ఈ రంగానికి ఊతమిచ్చేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

12/10/2015 - 06:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: స్టాక్ మార్కెట్లలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పెట్టే పెట్టుబడుల భవితవ్యం ఆయా మార్కెట్ల ఒడిదుడుకులకు లోబడే ఉంటుందని, వీటికి తాము ఎటువంటి హామీ ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

12/10/2015 - 06:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 24 శాతం పెరిగి 60.69 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

12/10/2015 - 06:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పింఛను రంగానికి పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటుగా అవ్యవస్థీకృత రంగానికి సైతం పెన్షన్ రంగాన్ని విస్తరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, అభివృద్ధి అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఏ) చైర్మన్ హేమంత్ జి కాంట్రాక్టర్ అన్నారు. ‘జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పిఎస్)కు సంబంధించి ఏ పన్నుల విధానమైనా సరే ప్రభుత్వం వైపునుంచి ఒకే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం.

12/10/2015 - 06:29

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఇంధన పొదుపులో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జివిఎంసి) జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఇంధన పొదుపు, ఖర్చు నియంత్రణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ విభాగం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ 2015వ సంవత్సరానికి ఇంధన పొదుపు అవార్డుకు జివిఎంసిని ఎంపిక చేసింది.

12/10/2015 - 06:28

ముంబయి, డిసెంబర్ 9: పన్ను సంస్కరణలకు సంబంధించిన కీలక బిల్లు వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు ఆమోదం మరింత ఆలస్యం కావచ్చన్న భయాల కారణంగా బుధవారం వరసగా ఆరో రోజు కూడా దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బిఎస్‌ఇ సెనె్సఖ్స 274 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 89 పాయింట్లు నష్టపోయి 7,700 పాయింట్ల దిగువకు పడిపోయింది.

12/09/2015 - 16:15

ముంబయి : స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 274 పాయింట్లు నష్టపోయి 25,036 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 7,613 సూచీ వద్ద ముగిశాయి.

12/09/2015 - 06:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వ్యయ నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ప్రణాళికా, ప్రణాళికేతర’ వ్యయాల వర్గీకరణను తొలగించాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రణాళికా సంఘాన్ని తొలగించిన విషయం తెలిసిందే.

12/09/2015 - 06:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ మార్కెట్లలో జరుగుతున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండబోదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-నవంబర్ వ్యవధిలో భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు దాదాపు 7,008 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

12/09/2015 - 06:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వొడాఫోన్ ఇండియా దేశీయంగా 4జి సేవలను ప్రారంభించింది. మంగళవారం కొచ్చి నుంచి 4జి సేవల్లోకి వొడాఫోన్ ప్రవేశించగా, ఈ నెల 14 నుంచి కొచ్చిలో 4జి సేవలు వొడాఫోన్ వినియోగదారులకు అందనున్నాయి. అతిత్వరలో త్రివేండ్రం, కాలికట్‌లలోనూ ఈ సేవలను సంస్థ అందుబాటులోకి తేనుంది.

Pages