S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/04/2018 - 13:36

ముంబయి: గత కొద్దిరోజులుగా చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు గురువారంనాడు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర గురువారం 15 పైసలు పెరిగి రూ.84 చేరుకుంది. ముంబయిలో 14 పైసలు పెరిగి లీటరు పెట్రోలు ధర రూ.91.34 మార్కును తాకగా.. డీజిల్‌ ధర లీటరుకు 21 పైసలు పెరిగి రూ.80.10కి చేరింది. దిల్లీలో డీజిల్‌ ధర 20 పైసలు పెరిగి రూ.74.45కు చేరింది.

10/04/2018 - 11:32

ముంబయి : స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఈ రోజు సెన్సెక్స్‌ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 155 పాయింట్లకు పైగా పడిపోయి 10,700 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.45 సమయానికి సెన్సెక్స్‌ 527 పాయింట్లు నష్టపోయి 35448 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 158 పాయింట్లు నష్టపోయి 10700 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.67 వద్ద ట్రేడవుతోంది.

10/04/2018 - 05:05

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో హైదరాబాద్‌లో రిసెర్చ్ డవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఒప్పో రిసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ విభాగం అధిపతి తస్లీమ్ ఆరిఫ్‌తో పాటు కంపెనీ ప్రతినిధులు బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో సమావేశమయ్యారు.

10/04/2018 - 04:47

ముంబయి, అక్టోబర్ 3: కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు మూడు రోజుల పాటు సాగే చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ద్రవ్య విధాన కమిటి (ఎంపీసీ) సమావేశం బుధవారం ఇక్కడ ప్రారంభమయింది.

10/04/2018 - 04:32

హిందూపురం, అక్టోబర్ 3: రోజురోజుకు పతనమవుతున్న పట్టుగూళ్ల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. కనీస మద్దతు ధర లభించకపోవడంతో రైతులు డీలా పడ్డారు. ధర రోజురోజుకు తగ్గుముఖం పట్టడం రైతున్నను కుంగతీస్తోంది. దీపావళి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయం తర్వాత అనంతపురం జిల్లాలో పట్టుపరిశ్రమపై రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు.

10/04/2018 - 04:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలో బంగారం ధర బుధవారం బాగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ. 555 పెరిగి, రూ. 32,030కు చేరింది. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారులు తాజాగా కొనుగోళ్లు జరపడం వల్ల బంగారం ధరలు పెరిగాయి. వెండి ధర కూడా పెరిగి, కిలోకు రూ. 39,000ను దాటింది.

10/04/2018 - 04:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రూపాయి విలువ పతనం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. అందువల్ల రూపాయి విలువ పతనం, పెరుగుతున్న వాణిజ్య లోటుపై చర్చించడానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు అధ్యక్షతన గురువారం ఇంటర్-మినిస్టీరియల్ సమావేశం జరుగనుందని ఒక అధికారి తెలిపారు.

10/03/2018 - 23:49

ముంబయి, అక్టోబర్ 3: రూపాయి విలువ పతనం బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లను ఘోరంగా దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అంతకంతకూ పడిపోతుండటంతో బుధవారం ఇంట్రా-డేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయికి పతనమయింది. దీంతో మార్కెట్ కీలక సూచీలు బాగా పడిపోయాయి.

10/03/2018 - 23:47

ముంబయి, అక్టోబర్ 3: రూపాయి మారకం విలువ బుధవారం మరో 43 పైసలు పడిపోయి, సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 73కన్నా దిగువకు దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆ కారణంగా క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయని, భారత కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరుగుతుందనే భయాందోళనలు నెలకొనడంతో బుధవారం రూపాయి విలువ మరింత పతనమయింది.

10/03/2018 - 23:46

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,038.00
8 గ్రాములు: రూ.24,304.00
10 గ్రాములు: రూ. 30,380.00
100 గ్రాములు: రూ.3,03,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,249.198
8 గ్రాములు: రూ. 25,993.584
10 గ్రాములు: రూ. 32,491.990
100 గ్రాములు: రూ. 3,24,919.80
వెండి
8 గ్రాములు: రూ. 320.80

Pages