S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/02/2018 - 03:57

న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాలు తెరడంతోపాటు సిమ్ కార్డులను పొందేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధార్‌గా పేర్కొనే 12 అంకెలుగల ఐడీ నంబర్‌ను దేశంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) జారీ చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ టెలికామ్ కంపెనీలు సిమ్ కార్డులను ఇవ్వడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకునేవి.

10/01/2018 - 23:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని వేల కోట్ల రూపాయల మేర ముంచేసి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన 637 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) జప్తు చేసింది. వీటిలో న్యూయార్క్‌లోని ఐకానిక్ సెంట్రల్ పార్ట్‌లోని రెండు అపార్ట్‌మెంట్, లండన్‌లోని ఫ్లాట్ ఉన్నాయి.

10/01/2018 - 23:29

కోల్‌కతా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 187వ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఛాంబర్ అధ్యక్షుడు ఆర్. ఖండేల్వాల్,
కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా (కుడి)

10/01/2018 - 23:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ) భారత విభాగం చీఫ్‌గా తస్లీం ఆరిఫ్‌ను నియమించినట్టు ఒప్పో సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ యూనిట్‌కు ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని ప్రకటించలేదు. ఒప్పో ఇది వరకే చైనాలోని బీజింగ్, షాంఘై, షెన్‌జెన్, డోంగువాన్ నగరాల్లో ఒక్కో ఆర్ అండ్ డీ యూనిట్లను నెలకొల్పింది.

10/01/2018 - 23:26

ముంబయి, అక్టోబర్ 1: స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఈవారం లాభాలతో మొదలైంది. సెనెక్స్ పాయింట్లు 200కిపైగా పెరిగితే, నిఫ్టీ సుమారు 40 పాయింట్లు లాభపడింది. దేశీయ ఉత్పత్తి రంగం గత నెల చురుగ్గా వ్యవహరించడం, షేర్లపై మదుపరులు ఆసక్తి చూపడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చాయి. సోమవారం మధ్యాహ్నం లావాదేవీలు ఊపందుకోవడంతో, 200.83 పాయింట్లు (0.55 శాతం) పెరిగిన సెనె్సక్స్ 36,427.97 పాయంట్ల వద్ద ముగిసింది.

10/01/2018 - 23:25

‘దేశంలో అంతర్ రాష్ట్రాలు, అంతర్ జిల్లాల మధ్య వైరుధ్యాలు, సమస్యలు’ అనే అంశంపై పాట్నాలో సోమవారం జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన వివరించారు

10/01/2018 - 23:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: గత నెల జీఎస్టీ వసూళ్లలో స్వల్ప పెరుగుదల నమోదైంది. 93,960 కోట్ల రూపాయలగా ఉన్న జీఎస్టీ వసూళ్లు గత నెల 94,442 కోట్ల రూపాయలుగా నమోదైంది. పండగల సీజన్ రాబోతున్న నేపథ్యంలో జీఎస్టీ మరింతగా పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం చేసిన ప్రకటన ప్రకారం 67 లక్షల వ్యాపార సంస్థలు సెప్టెంబర్‌లో జీఎస్టీ చెల్లించాయి.

10/01/2018 - 23:20

ముంబయి, అక్టోబర్ 1: వడ్డీ రేట్లను మరోసారి పెంచేందుకు ఆర్‌బీఐ రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం, రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ కావడం వంటి అంశాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ను కఠిన నిర్ణయాలు తీసుకునే దిశలో నడిపిస్తున్నాయి.

10/01/2018 - 23:19

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,008.00
8 గ్రాములు: రూ.24,064.00
10 గ్రాములు: రూ. 20,080.00
100 గ్రాములు: రూ.3,00,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,217.112
8 గ్రాములు: రూ. 24,064.896
10 గ్రాములు: రూ. 32,171.120
100 గ్రాములు: రూ. 3,21,711.20
వెండి
8 గ్రాములు: రూ. 328.00

10/01/2018 - 16:30

ముంబయి : ఈ రోజు నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 299 పాయింట్లతో 36,524.14, నిఫ్టీ 77.85 పాయింట్ల లాభంతో 11,008.30కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.80గా ఉంది.

Pages