S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/08/2018 - 17:37

ముంబయ: సెన్సెక్స్‌ సోమవారం స్వల్ప లాభాలను నమోదు చేసుకుంది. సెన్సెక్స్‌ 97.39 పాయింట్లు లాభపడి 34,474.38 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా కోలుకుని 31.60 పాయింట్లు లాభపడి 10,348.05 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.04 వద్ద కొనసాగుతోంది.

10/08/2018 - 02:17

విజయవాడ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం, లాభసాటి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాయి. అయితే రైతుల ఆదాయాన్ని మూడింతలు చేసే విధానాన్ని అన్నామలై వర్సిటీ (చెన్నై)కి చెందిన అగ్రానమిస్టు ఆర్‌ఎం కతిరేశన్ రూపొందించారు. తమిళనాడులో దాదాపు 2వేల మంది రైతులు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, నేపాల్‌లోనూ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీ రైతులు కూడా దీనిపై ఆసక్తి కనబరచడం గమనార్హం.

10/07/2018 - 23:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: స్థూలార్థిక గణాంకాలు, రూపాయి కదలికలు, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల ధోరణి సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల సరళిని నిర్దేశించనున్నాయి. జూన్, ఆగస్టు నెలల్లో జరిగిన రెండు వరుస ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజాగా జరిగిన సమావేశంలో మాత్రం వాటిని యథాతథంగా కొనసాగించింది.

10/07/2018 - 23:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన దరిమిలా ప్రజలకు ఒక్క రోజు కాస్త ఉపశమనం కలిగించిన ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఈ నెల అయిదో తేదీన వీటి ధరలు లీటర్‌కు కనీసం రూ. 2.50 చొప్పున తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటి ధరలు మరింత తగ్గాయి.

10/07/2018 - 23:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: నిరాటంకంగా కొనసాగుతున్న రూపాయి విలువ పతనం, ముడి చమురు ధరల పెరుగుదల.. దేశ క్యాపిటల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రెండు అంశాల కారణంగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 9,300 కోట్ల (1.3 బిలియన్ డాలర్ల)కు పైగా విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత నెలలో క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.

10/07/2018 - 23:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న బలహీనమయిన ధోరణి పలు కంపెనీల మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. దేశంలో ని పది కీలక కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శు క్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 2,55,995 కోట్లు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటె డ్ (రిల్) అత్యధికంగా నష్టపోయింది. రిల్ మార్కె ట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ. 1,32,061.4 కోట్లు పడిపోయి, రూ.

10/07/2018 - 23:47

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం బలహీనపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ భారీగా 1,850.15 పాయింట్లు (5.10 శాతం) పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 614 పాయింట్లు (5.50 శాతం) దిగజారింది. రూపాయి విలువ పతనం, ప్రపంచ మార్కెట్‌లో అధిక ముడి చమురు ధరలు ఈ వారంలో ప్రధానంగా దేశీయ మార్కెట్ల ధోరణిని ప్రభావితం చేశాయి.

10/07/2018 - 23:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఆస్తులను తనఖా పెట్టుకొని రుణాలు ఇచ్చే పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) ద్వారా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,470 కోట్లు) సేకరించింది. దేశంలోని గృహ రుణ కంపెనీలు ఈసీబీ పద్ధతిలో ఏటా 750 మిలియన్ డాలర్ల వరకు అప్పులు తీసుకునేందుకు ఈ సంవత్సరం ఆర్‌బీఐ అనుమతించింది.

10/07/2018 - 23:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. కేంద్రంతో పాటు, కొన్ని రాష్ట్రాలు ఇంధనంపై సుంకాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం మళ్లీ ఇంధన ధరలను పెంచాయి.

10/07/2018 - 23:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో బంగారం, వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రపంచ మార్కెట్లలో పసిడి ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు స్థానిక ఆభరణాల వ్యాపారులు తాజాగా కొనుగోళ్లు జరపడం వల్ల దేశీయ బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 50 పెరిగి, రూ. 31,900కు చేరుకుంది. కాయిన్ మేకర్లు తగినంత కొనుగోళ్లు జరిపిన కారణంగా వెండి ధర కూడా తిరిగి కిలోకు రూ. 550 చొప్పున పెరిగి, రూ. 39,800కు చేరుకుంది.

Pages