S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/03/2018 - 23:45

శాన్‌ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 3: చైనా దేశం సహా పలు దేశాల్లోని డేటాని ఎన్‌క్రిప్ట్, సర్వర్లను లాక్ చేయడం ద్వారా రక్షిస్తూ పౌరుల వ్యక్తిగత రహస్యాలకు ఎలాంటి భంగం కలగకుండా వ్యవహరించడంలో తమ కంపెనీ పూర్తి కృతనిశ్చయంతో ఉందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.

10/03/2018 - 13:36

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 233, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. రూపాయి మరోసారి భారీగా క్షీణించింది. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 73 మార్క్‌ను దాటింది.

10/03/2018 - 12:58

న్యూఢిల్లీ : రూపాయి ధర బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ. 73.26కు చేరింది. వాణిజ్య పెట్టుబడుల మార్కెట్‌లో దేశీయ కరెన్సీ 43 పైసలకు పడిపోవడంతో రూపాయి విలువ రూ. 73.26 వద్ద ముగిసింది.

10/03/2018 - 03:22

న్యూఢిల్లీ: గాంధీజీ శత జయంతి సందర్భంగా మొట్టమొదటి సారిగా మహాత్ముని చిత్రం వంద రూపాయల నోటుపై సుమారు 50 సంవత్సరాల క్రితమే దర్శనమిచ్చింది. మనకు స్వాతంత్య్రం వచ్చిన 1947 తర్వాత అప్పటివరకు ఉన్న బ్రిటీష్ రాజు చిత్రం స్థానంలో మహాత్ముడి చిత్రాన్ని ప్రవేశపెట్టారు. అయితే మహాత్ముని చిత్రాన్ని ఉంచడంలో ప్రభుత్వం కొంత తర్జనభర్జన పడుతున్న సమయంలో బ్రిటీష్ రాజు చిత్రం స్థానంలో మూడు సింహాల బొమ్మను ఉంచారు.

10/03/2018 - 01:15

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. హార్ట్ స్టెంట్ల తయారీలో పేరుపొందిన ఎస్‌ఎంటి (సహజానంద మెడికల్ టెక్నాలజీస్) ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు మంగళవారం ప్రకటించింది.

10/02/2018 - 23:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.20కు, లీటర్ డీజిల్ ధర రూ. 79.89కి చేరింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.85కు, లీటర్ డీజిల్ ధర రూ. 75.25కు పెరిగింది.

10/02/2018 - 23:28

తిరువనంతపురం, అక్టోబర్ 2: నీరవ్ మోదీ చేసిన భారీ మోసంతో నష్టాల పాలయిన ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తిరిగి గాడిన పడుతుందా? అవుననే అంటున్నారు ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సునిల్ మెహతా. పీఎన్‌బీ ఈ ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాలను ఆర్జిస్తుందని, వృద్ధి సాధించడానికి తగిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. నీరవ్ మోదీ పాల్పడిన రూ.

10/02/2018 - 23:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో కుంటుపడిన తన దేశీయ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరంలో కుదుటపడుతుందని ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్స్ ఆశిస్తోంది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యాపారం జీఎస్‌టీ అమలు తరువాత 2017-18 ఆర్థిక సంవత్సరంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది.

10/02/2018 - 23:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత్ 2030 నాటికి ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్తులో 40 శాతాన్ని శిలాజేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో వాతావరణ కాలుష్యాన్ని సృష్టించే బొగ్గుకు బదులు సౌర, పవన శక్తులను విస్తారంగా ఉపయోగించుకోవడానికి భారత్ కృషి చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ విషయం చెప్పారు.

10/02/2018 - 23:25

ముంబయి, అక్టోబర్ 2: దేశంలో గిడ్డంగుల పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ఈ పరిశ్రమకు వౌలికసదుపాయాల పరిశ్రమ హోదాను ఇవ్వడంతో ఈ పరిశ్రమ ఇటీవలి కాలంలో బాగా పుంజుకుంటోంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో గల మొత్తం గిడ్డంగుల్లోని సరుకులు ఉంచే స్థలం 2021 నాటికి 21 శాతం సీఏజీఆర్‌తో 297 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని ఒక నివేదిక అంచనా వేసింది.

Pages