S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/09/2018 - 16:51

ముంబయి: స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నాం నుంచి నష్టాల్లో కొనసాగి చివరకు సెనె్సక్స్ 174.91 పాయింట్ల నష్టంతో 34299.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 10301.5 పాయింట్లకు చేరింది.

10/09/2018 - 16:50

ముంబయి: రూపాయి పతనం రోజురోజుకు కొనసాగుతుంది. ఈ రోజు డాలరుతో పోలిస్తే 21 పైసలకు పడిపోయింది. రూపాయి విలువ 74.27 వద్ద తాజా జీవన కాల కనిష్టానికి పడిపోయింది. నిన్న ట్రేడింగ్‌లో రూపాయి విలువ 74.06కి పడిపోయింది.

10/09/2018 - 12:01

ముంబయి : ఇంధన ధరలను ఆయిల్ కంపెనీలు ఈరోజు కూడా పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 29 పైసలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 82.26కు, డీజిల్ ధర రూ. 74.11కు చేరింది. ముంబయిలో పెట్రోల్ ధర రూ. 87.73కు, డీజిల్ ధర రూ. 77.68కు పెరిగింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.19కు చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 80.69కు చేరుకుంది.

10/09/2018 - 02:48

ముంబయి, అక్టోబర్ 8: అమెరికా డాలర్‌తో రూపాయి మారకపు విలువ పతనం కొనసాగుతునే ఉంది. శుక్రవారం 18 పైసలు పతనమైన రూపాయి సోమవారం 14 పైసలు దిగజారింది. మార్కెట్‌లో ట్రేడింగ్ మొదలైన వెంటనే, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి బలపి, దాని ప్రభావం రూపాయి మారకపు విలువపైన పడింది. ఆరంభంలో దారుణంగా దిగజారడంతో డాలర్ విలువ 74.23 రూపాయలకు దూసుకెళ్లింది. అయితే, ఆతర్వాత కొద్దిగా సర్దుకొని 73.76 రూపాయల వద్ద ముగిసింది.

10/09/2018 - 02:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పెట్రోలు, డీజిల్ ధర పెరుగుతునే ఉంది. సోమవారం ఏకంగా 21 పైసలు పెరగడంతో, లీటర్ పెట్రోలు ధర వంద రూపాయలకు చేరడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈనెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోలుపై సుంకాన్ని 2.5 రూపాయలు తగ్గించిన విషయం తెలిసిందే. మరో 2.5 రూపాయలను భరించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు సూచించింది.

10/09/2018 - 02:46

ముంబయి, అక్టోబర్ 8: దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ బలహీన పడడంతో బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. పండు రోజులు కావడంతో, ఇటీవల విపరీతమైన డిమాండ్‌తో పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈవారం మొదటి రోజైన సోమవారం కొంత తగ్గినప్పటికీ, రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకుంటుందని విశే్లషకుల అభిప్రాయం.

10/09/2018 - 02:44

ముంబయి, అక్టోబర్ 8: వరుసగా మూడు రోజుల పాటు ఎదురైన నష్టాలకు తెరపడింది. భారత స్టాక్ మార్కెట్ సోమవారం కోలుకోవడంతో సెనె్సక్స్ 97.39 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ సైతం ఊపిరి పీల్చుకుంది. 31.60 పాయింట్లు మెరుగుపడింది. నిజానికి సోమవారం స్టార్ మార్కెట్‌లో లావాదేవీలు అస్థిరంగా కొనసాగాయి.

10/09/2018 - 02:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: పెట్రో ధరల నియంత్రీకరణ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తివేయాలన్న తమ విధానాలను మార్చుకోబోవడం లేదన్నారు. ఇటీవల కాలంలో పెట్రో ధరలు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. లీటర్ పెట్రోలు ధర సోమవారం ఒక్కసారిగా 21 పైసలు పెరిగిం ది.

10/09/2018 - 02:42

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,098.00
8 గ్రాములు: రూ.24,784.00
10 గ్రాములు: రూ. 30,980.00
100 గ్రాములు: రూ.3,09,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,313.369
8 గ్రాములు: రూ. 26,506.952
10 గ్రాములు: రూ. 33,133.61
100 గ్రాములు: రూ. 3,31,336.90
వెండి
8 గ్రాములు: రూ. 328.80

10/08/2018 - 23:32

విశాఖపట్నం, అక్టోబర్ 8: విశాఖ నుంచి బ్యాంకాక్‌కు ఎయిర్ ఏషియా డైరెక్ట్ సర్వీసును నడపనుంది. థాయ్ ఎయిర్ ఏషియా ముఖ్య కార్యనిర్వాహక అధికారి రాజకుమార్ పరంధామన్, థాయ్ దేశ పర్యాటక శాఖ డైరక్టర్ చొలాడ సిద్దవరన్ ఆదివారం ఇక్కడ సంయుక్త విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరంధామన్ మాట్లాడుతూ డిసెంబర్ ఏడవ తేదీన ఈ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు.

Pages