S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/28/2017 - 00:54

విజయవాడ, డిసెంబర్ 27: ఎలక్ట్రిక్ వాహనాల తయారీని రాష్ట్రంలో ప్రొత్సహించేందుకు వీలుగా ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెలగపూడి సచివాలయంలో ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్‌పోర్టు, పరిశ్రమలు, ఆర్టీసీ అధికారులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/28/2017 - 00:53

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, డిసెంబర్ 27: ప్రపంచీకరణతో ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయి.. ఉదార విధానాల ఫలితంగా వృద్ధిరేటు పెరిగింది.. అయితే ఆర్థికరంగంలో సవాళ్లను అధిగమించాల్సి ఉంది.. వ్యాపారరంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఆర్థికాభి వృద్ధి సాధ్యపడుతుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు.

12/28/2017 - 00:52

విశాఖపట్నం, డిసెంబర్ 27: పర్యాటక ప్రాంతమైన విశాఖకు పర్యాటకుల సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే, ఈ ఏడాది పర్యాటకుల తాకిడి 40 శాతం వరకూ పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా విశాఖలో ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ పర్యాటకులు వస్తుంటారు. సెప్టెంబర్ నుంచి బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గడ్ ప్రాంతాల నుంచి పర్యాకులు అంతంతమాత్రంగానే విశాఖకు వచ్చారు.

12/28/2017 - 00:51

హైదరాబాద్, డిసెంబర్ 27: రిస్క్‌మేనేజిమెంట్‌లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు ప్రతిష్టాత్మకమైన సియాంట్ సంస్థకు గోల్డ్‌న్ పీకాక్ అవార్డు ఫర్ రిస్క్ మేనేజిమెంట్ అవార్డును ప్రకటించారు. సియాంట్ సంస్థ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, జియోస్పాటియల్, నెట్‌వర్క్, ఆపరేషన్స్ మేనేజిమెంట్ సర్వీసుల్లో అగ్రగామిగా రాణిస్తున్నట్లు సియాంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ అగర్వాల్ తెలిపారు.

12/28/2017 - 00:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: టెలికం సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని టెలికం విభాగం (డివోటీ) ఆర్థిక మంత్రిత్వశాఖకు సిఫారసు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు పార్లమెంటుకు తెలిపింది. వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతున్న సమయంలో ఈ సిఫారసు అందిందని, ప్రస్తుతం ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా లోకసభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

12/28/2017 - 00:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: తెలంగాణలో సామాన్యుడి పాలరాయిగా గుర్తింపు పొందిన షాబాద్ బం డలపై విధించిన జీఎస్టీ పన్ను రేటును మరింత తగ్గించాలని టీఆర్‌ఎస్ సభ్యురాలు కవిత డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ షాబాద్ బండలపై 18 శాతం జీఎస్టీ పన్ను విధించడం అన్యాయమని అన్నా రు.

12/28/2017 - 00:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం ధరలు పెంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ఖజానా నింపుకోవాలని చూస్తున్నరని కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం హనుమంతురావు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో మద్యం రేట్లను పెంచడంపై చంద్రశేఖర్‌రావుపై మండిపడ్డారు. దశలవారీగా తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ‘తెలంగాణ జాగో..

12/28/2017 - 00:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: విశాఖలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్రోలియం యూనివర్సిటీకి జాతీయ ప్రాధాన్యత సంస్థగా మార్చారు. విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ఏర్పాటుకు ఉద్దేశించిన పెట్రోలియం, ఎనర్జీ బిల్లు 2017 రాజ్యసభలో బుధవారం ఆమోదం పొందింది. పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఇప్పటికే గత పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం తెలిపింది.

12/27/2017 - 00:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్‌ల)కు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి సంస్థ అయిన అనుమతు ల బోర్డు (బోర్డ్ ఆఫ్ అప్రూవల్- బీఓఏ)కు అదనపు అధికారాలు ఇవ్వాలని కేంద్ర వాణిజ్య మం త్రిత్వ శాఖ నియమించిన ఒక కమిటీ సూచించిం ది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్‌ఈజెడ్ నిబంధనల ప్రకారం, బీఓఏకు ఏమాత్రం నిబంధనలు సడలించే అధికారం లేదు.

12/27/2017 - 00:49

ముంబయి, డిసెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సెషన్ చివరలో మదుపురులు జోరుగా కొనుగోళ్లకు పూనుకోవడంతో మార్కెట్ కీలక సూచీలు జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా రెండో సెషన్‌లో పుంజుకొని, 34,010.61 పాయింట్ల వద్ద స్థిరపడింది.

Pages