S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/03/2018 - 23:24

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్న ఎండిని, అధికారులను సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రశంసించారు. సంస్థను ఇంకా ఆదాయం వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బుధవారం నాడిక్కడ బస్‌భవన్‌లో చైర్మన్‌కు ఎండి జి.వి.రమణారావు, ఈడిలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

01/03/2018 - 23:23

న్యూఢిల్లీ, జనవరి 3: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా ఎలాంటి ప్రతికూల చర్యలు చేపట్టినా ఇరుదేశాల సంబంధాలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నాస్కామ్ తెలిపింది. హెచ్1బీ వీసాల పొడిగింపును నిరోధించేందుకు అమెరికా కొత్త చర్యలను చేపడుతోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో నాస్కామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

01/03/2018 - 23:23

నిజామాబాద్, జనవరి 3: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో రూపుదిద్దుకుంటున్న స్పైస్ పార్క్ పనులు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో మరింత వేగం పుంజుకోనున్నాయి. ఢిల్లీలో బుధవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ప్రభును కలిసి పసుపు రైతులను ఆదుకునేందుకు చేపడుతున్న స్పైస్ పార్క్ పనుల గురించి వివరించారు.

01/03/2018 - 23:21

న్యూఢిల్లీ, జనవరి 3: కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (విశాఖ ఉక్కు కర్మాగారం)లో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలో 10 శాతాన్ని పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) ద్వారా విక్రయిచడం జరుగుతుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్టు దేవసాయి పేర్కొన్నారు.

01/03/2018 - 23:21

న్యూఢిల్లీ, జనవరి 3: చైనా నుంచి భారీగా దిగుమతి అవుతున్న కృత్రిమ రబ్బర్ నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ విషయమై సమగ్ర విచారణ జరపాలని భారత్ నిర్ణయించింది. దేశీయ వ్యాపారులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనా రబ్బర్ నాణ్యతపై గుజరాత్ ఫ్లూరోకెమికల్స్ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ అలైడ్ డ్యూటీస్ (డిజిఎడి) ముందు ఫిర్యాదు చేసింది.

01/03/2018 - 23:20

న్యూఢిల్లీ, జనవరి 3: ఆహార ధాన్యాలు, పంచదారను జూట్(జనపనార) సంచుల్లోనే ప్యాక్ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ కమిటీ పొడిగించింది. వచ్చే జూన్ నెలాఖరు వరకూ నాటికి జూట్ ప్యాకేజీని కచ్చితంగా అమలుచేయాలని తొలుత నిర్ణయించారు. జనపనార పరిశ్రమను ప్రోత్సహించడంతోపాటు ఆ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలు, రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

01/03/2018 - 23:19

న్యూఢిల్లీ, జనవరి 3: ఎన్నికల బాండ్ల జారీకి సంబంధించి డోనర్స్ (దాతలు) పేర్లు బయటపెట్టకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటిస్తామని చెబుతున్న కేంద్రం విరాళాలు ఇచ్చేవారి పేర్ల విషయంలో గోప్యత పాటించడం ఎందుకని కాంగ్రెస్ నిలదీసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తిరోగమన చర్యగా పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల అభివర్ణించారు.

01/03/2018 - 00:50

న్యూఢిల్లీ, జనవరి 2: దేశ తయారీ రంగం (మానుఫాక్చరింగ్ సెక్టర్) నిరుడు డిసెంబర్ నెలలో బాగా పుంజుకుంది. గత అయిదేళ్ల కాలంలో ఏ నెలలోనూ లేనంతగా అత్యంత వేగంగా వృద్ధి చెందింది. డిసెంబర్ నెలలో నిర్వహణ పరిస్థితులు అమిత వేగంతో మెరుగుపడటంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం వల్ల తయారీ రంగం గత అయిదేళ్ల కాలంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిందని ఒక నెలవారీ సర్వే వెల్లడించింది.

01/03/2018 - 00:49

ముంబయి, జనవరి 2: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, ఐరోపా మార్కెట్లలో షేర్ల ధరలు పెరగక పోవడం వంటి కారణాల వల్ల మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి.

01/03/2018 - 00:47

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లు, హోల్‌సేల్ రైస్ డీలర్లు, చిన్న చిన్న కిరాణ దుకాణాల్లో ‘కర్నూలు’ రైస్ అమ్ముతుంటారు. కర్నూలు జిల్లాలో పండే వరిధాన్యం తెలంగాణ ప్రజలందరి అవసరాలకు సరిపోతాయా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కర్నూలు రైస్ అంటూ తెలంగాణలోని వ్యాపారులు ప్రత్యేకంగా అమ్ముతుంటారు.

Pages