S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/02/2018 - 00:22

హైదరాబాద్/నార్సింగి, జనవరి 1: నాటినుంచి నేటివరకు అంచలంచెలుగా అఖిల భారత ప్రారిశ్రామిక ప్రదర్శన ఎదుగుతూ వస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలీ, కడియం శ్రీహరి అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలకు గత ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవటంతో కొన్ని మూసివేసే స్థాయిలో ఉన్నాయని, సొసైటీ అనుమతిస్తే ప్రభుత్వం కాలేజీల నిర్వహణ చేపడుతుందని వారు స్పష్టం చేశారు.

01/02/2018 - 00:21

ముంబయి, జనవరి 1: కొత్త సంవత్సరం మొదటి రోజునే దేశీయ మార్కెట్ సూచీలు పడిపోయాయి. సోమవారం సెషన్ చివరలో వాహన, బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల షేర్లలో జోరుగా విక్రయాలు జరగడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి 244 పాయింట్లు పడిపోయింది. నెల రోజుల వ్యవధిలో సెనె్సక్స్ ఇంతగా నష్టపోవడం ఇదే తొలిసారి.

01/02/2018 - 00:19

విశాఖపట్నం, జనవరి 1: విశాఖ స్టీల్ ప్లాంట్ లక్ష్యానికి చేరువగా ఉంది. ప్లాంట్ విస్తరణను విజయవంతంగా పూర్తి చేసుకుని, సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించేందుకు మార్గాన్ని సుగమమం చేసుకుంటోంది.

01/02/2018 - 00:17

గత ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే 2017 డిసెంబర్‌లో పెరిగిన
వాహనాల అమ్మకాలను పై గ్రాఫ్‌లో చూడవచ్చు

01/02/2018 - 00:16

న్యూఢిల్లీ, జనవరి 1: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపులో భాగంగా వ్యాపార సంస్థలు తమ నెలవారీ రిటర్న్‌లు -జీఎస్‌టీఆర్-3బీ-లలో పొరపాట్లను సవరించుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. ఎలాంటి జరిమానా చెల్లించకుండా, భయాందోళనలకు లోనుకాకుండా వ్యాపారులు తమ రిటర్న్‌లలోని పొరపాట్లను సవరించుకోవడానికి ఈ చర్య దోహదపడుతుంది.

01/02/2018 - 00:15

విశాఖపట్నం, జనవరి 1: ఇథియోపియా దేశానికి చెందిన వచామా విశ్వవిద్యాలయంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఓయూ కుదుర్చుకుంది. ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఏయూ వీసీ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు సమక్షంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ ఉమామహేశ్వర రావు, వచామా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ అదానే హైలే సోమవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

01/02/2018 - 00:13

న్యూఢిల్లీ, జనవరి 1: ఆహార వస్తువులు, కిరోసిన్, వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన రిటెయిల్ ద్రవ్యోల్బణం 2017 నవంబర్ నెలలో 3.97 శాతానికి పెరిగింది. 2017 అక్టోబర్‌లో 3.24 శాతం ఉన్న సీపీఐ-ఐడబ్ల్యు (వినియోగ వస్తువుల ధరల సూచీ- పారిశ్రామిక కార్మికులు) 2017 నవంబర్‌లో 3.97 శాతానికి పెరిగింది. ఈ సూచీ 2016 నవంబర్‌లో 2.59 శాతం ఉండింది.

01/01/2018 - 04:19

నిజామాబాద్, డిసెంబర్ 31: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధి నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలనే డిమాండ్‌కు అటు జీఎస్‌టీ మండలి కానీ, ఇటు కేంద్రం నుండి స్పందన కరవవుతోంది. ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రాంత ఎంపీలు కేంద్రానికి ప్రత్యేకంగా విన్నవించినా ఫలితం శూన్యంగానే ఉంటోంది.

01/01/2018 - 03:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను, అలాగే ఆర్‌ఈఆర్‌ఏ ప్రభావానికి తీవ్రస్థాయిలో కునారిల్లిన రియల్టీరంగం కొత్త సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టబోతోంది. ఈ మూడు కీలక సంస్కరణల ప్రభావానికి తీవ్రంగా లోనైన రియల్టీ రంగం ప్రస్తుతం నష్టాలను, కష్టాలను అధిగమించే కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు సమాయత్తమవుతోంది.

01/01/2018 - 03:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే అవినీతి ఓ పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని, అందుకే విదేశీ మదుపుదారులు ధైర్యంగా ముందుకు రావడం లేదని అమెరికాకు చెందిన ఓ యాజమాన్య నిర్వహణ సంస్థ క్రోల్ వెల్లడించింది.

Pages