S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/19/2017 - 00:56

న్యూఢిల్లీ, జూలై 18: హిందుస్థాన్ మీడియా వెంచర్స్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో 44.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 48.7 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 261.9 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 259.28 కోట్ల రూపాయలుగా ఉంది.
హెచ్‌టి మీడియా లిమిటెడ్

07/19/2017 - 00:56

హోండా కార్స్.. మంగళవారం దేశీయ మార్కెట్‌కు సరికొత్త అమేజ్ మోడల్ కారును పరిచయం చేసింది. ప్రివిలేజ్ ఎడిషన్‌గా వచ్చిన ఈ మోడల్‌లో పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6.48 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ. 7.73 లక్షలుగా ఉంది

07/19/2017 - 00:54

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియామి.. మంగళవారం భారతీయ విపణిలోకి మి మ్యాక్స్ 2 మోడల్ స్మార్ట్ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధర 16,999 రూపాయలు. 6.44 అంగుళాల డిస్‌ప్లే, 4జిబి ర్యామ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 64జిబి ఇంటర్నల్ మెమరీ (128జిబి వరకు పెంచుకోవచ్చు) దీని సొంతం

07/19/2017 - 00:52

న్యూఢిల్లీ, జూలై 18: దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో నిలిచాయి. మొదటి స్థానంలో గుజరాత్ యథాతథంగా ఉండగా, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదో స్థానంలో తెలంగాణ నిలిచాయి. రెండో స్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో హర్యానా ఉన్నాయి. ఆర్థిక అధ్యయన సంస్థ ఎన్‌సిఎఇఆర్ విడుదల చేసిన ఈ జాబితాలో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి చోటు దక్కాయి.

07/19/2017 - 00:51

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ పర్సన్ ఇన్‌చార్జీ కమిటీ గడువును ఏడాదిపాటు పొడిగించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు 2017 ఆగస్టు 11 నుండి అమల్లోకి వస్తాయని వివరించారు.

07/19/2017 - 00:51

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా డాక్టర్ జి మంజువాణిని నియమించారు. పశు సంవర్థక శాఖ డైరెక్టర్ హోదాలో ఉన్న మంజువాణి సెలవుపై వెళ్లి, ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు.

07/19/2017 - 00:50

న్యూఢిల్లీ, జూలై 18: దేశంలోని మొత్తం 21 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 9 బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం (2016-17) నష్టాలను అందుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వీటిలో ఐడిబిఐ, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులు కూడా ఉన్నాయి. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) నష్టాలపాలైన ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 13గా ఉందన్నారు.

07/18/2017 - 00:25

దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. దేశంలోనే తొలి బయో-మిథేన్ బస్సును సోమవారం ఆవిష్కరించింది. తేలికపాటి, మధ్యతరహా బస్సుల కోసం 5.7 ఎస్‌జిఐ, 3.8 ఎస్‌జిఐ బయో-మిథేన్ ఇంజిన్లను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. మరోవైపు తమ సరికొత్త ఎస్‌యువి నెక్సాన్ వెర్షన్ కోసం నూతన ఇంజిన్లు, గేర్ బాక్స్‌లను టాటా మోటార్స్ మార్కెట్‌కు పరిచయం చేసింది

07/18/2017 - 00:24

నోకియా బ్రాండ్‌తో మార్కెట్‌లోకి మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్న హెచ్‌ఎమ్‌డి గ్లోబల్.. తాజాగా రెండు చౌక ధరల మొబైల్ ఫోన్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. నోకియా 105 మోడల్‌గా వచ్చిన వీటిలో సింగిల్ సిమ్ మొబైల్ ధర 999 రూపాయలు, డ్యూయల్ సిమ్ మొబైల్
ధర 1,149 రూపాయలు (పన్నులు, రాయతీలు అదనం) అని నోకియా తెలిపింది. ఈ రెండు రకాల మొబైల్స్ బుధవారం నుంచి మార్కెట్‌లో లభిస్తాయని స్పష్టం చేసింది

07/18/2017 - 00:23

న్యూఢిల్లీ, జూలై 17: భారతీయ ఐటి రంగాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కుంభకోణంలో గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పిడబ్ల్యుసి)కు వ్యతిరేకంగా త్వరలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆదేశాలు ఇవ్వనుంది. ఈ కేసును సెబీ దర్యాప్తు చేస్తున్నది తెలిసిందే. కాగా, 2000-2008 మధ్య సత్యం కంప్యూటర్స్ కోసం పిడబ్ల్యుసి పనిచేసింది.

Pages