S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/05/2017 - 01:12

హైదరాబాద్, మార్చి 4: సిఐఐ యంగ్ ఇండియన్స్ (హైదరాబాద్ ఛాప్టర్) కొత్త చైర్మన్‌గా సందీప్ రతి, కో-చైర్మన్‌గా నమన్ బాల్‌ద్వా ఎన్నికయ్యారు. నూతన ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు శనివారం సిఐఐ (హైదరాబాద్ ఛాప్టర్) ఒక రోజు సదస్సు నిర్వహించింది.

03/05/2017 - 01:12

హైదరాబాద్, మార్చి 4: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్‌కు జాతీయ స్థాయిలో రెండు బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డులు లభించాయి.

03/04/2017 - 00:54

న్యూఢిల్లీ, మార్చి 3: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి ధర 275 రూపాయలు తగ్గగా, ఈ ఒక్కరోజే కిలో వెండి విలువ ఏకంగా 1,350 రూపాయలు దిగింది. ఫలితంగా 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి 30 వేల దిగువకు చేరి 29,725 రూపాయల వద్ద స్థిరపడితే, 99.5 స్వచ్ఛత కలిగిన దాని ధర 29,575 రూపాయలుగా ఉంది.

03/04/2017 - 00:52

శుక్రవారం న్యూఢిల్లీలో దేశీయ మార్కెట్‌కు సరికొత్త బాలెనో ఆర్‌ఎస్‌ను మారుతి సుజుకి పరిచయం చేసింది. మరిన్ని ఫీచర్లతో ముందుకొచ్చిన దీని ధర 8.69 లక్షల రూపాయలుగా ఉంది

03/04/2017 - 00:51

ముంబయి, మార్చి 3: అంతర్జాతీయ బాండ్ల విక్రయం ద్వారా నిధులను సమీకరించినట్లు దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ శుక్రవారం తెలియజేసింది. ఈ బాండ్ల జారీతో 300 మిలియన్ డాలర్లను అందుకున్నట్లు చెప్పింది. 5.5 సంవత్సరాల నిర్ణీత రేటు నోట్లను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ (డిఐఎఫ్‌సి)లోని తమ శాఖ ద్వారా అమ్మినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

03/04/2017 - 00:50

హైదరాబాద్, మార్చి 3: నైపుణ్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని, అందుకే టిఎస్‌ఐఐసితో చేతులు కలిపామని ఫోనిక్స్ గ్రూప్ డైరెక్టర్ శ్రీకాంత్ బడిగ తెలిపారు. టిఎస్‌ఐఐసి, ఫోనిక్స్ ఫౌండేషన్ (్ఫనిక్స్ గ్రూప్) జాయింట్ వెంచరే ఫోనిక్స్ అరెనా అని ఆయన శుక్రవారం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో చెప్పారు.

03/04/2017 - 00:49

న్యూఢిల్లీ, మార్చి 3: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. తమ ప్రస్తుత (ప్రైమ్) కస్టమర్లకు మరింత డేటాను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 303 రూపాయలతో రీచార్జ్ చేసుకునేవారికి అదనంగా 5 జిబి డేటా లభించనుంది.

03/04/2017 - 00:48

న్యూఢిల్లీ, మార్చి 3: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుత పరిస్థితికి లోపభూయిష్టమైన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు కూడా కారణమేనని విజయ్ మాల్యా అన్నారు. మాల్యా నేతృత్వంలోని ఈ విలాసవంతమైన ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలమైన మాల్యా.. లండన్‌కు పారిపోయినదీ విదితమే.

03/04/2017 - 00:46

విశాఖపట్నం, మార్చి 3: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజిలెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. స్టీల్ ప్లాంట్‌కు వరుసగా నాలుగో సంవత్సరం ఈ అవార్డు లభించడం గమనార్హం. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు ఈ అవార్డును స్టీల్ ప్లాంట్ అధికారులకు అందజేశారు.

03/04/2017 - 00:44

రాజమహేంద్రవరం, మార్చి 3: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రస్తుతం మట్టిపని, కీలకమైన కొండ తవ్వకం పనులు సాగుతున్నాయి. ఎపి జెన్కో.. విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను చేపట్టడానికి 4,800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. టెండర్ల ప్రక్రియ ఏప్రిల్‌లో పూర్తిచేసి, మేలో సివిల్ నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు.

Pages