S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/10/2017 - 00:34

ముంబయి, మార్చి 9: కీలక రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ సహా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు గురవుతూ చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.

03/10/2017 - 00:32

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్య ప్రతిష్టాకరమైన పెట్రోకెమికల్స్ ప్రాజెక్టును నెలకొల్పాలన్న ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం విరమించుకుంది. పదేళ్లుగా ఈ ప్రాంతంలో పెట్రోలియం కెమికల్స్ పెట్రో కెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్‌ను నెలకొల్పుతామని గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పాయి.

03/10/2017 - 00:31

హైదరాబాద్, మార్చి 9: తమ వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సౌకర్యవంతం చేసేందుకు గాను కరూర్ వైశ్యా బ్యాంక్ దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా ఫాస్టాగ్ సర్వీసులను ప్రారంభించింది. ఫాస్టాగ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, భారత్ బిల్ పేమెంట్ సిస్టం పేరిట మూడు కొత్త సాంకేతిక సేవలను ప్రారంభించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

03/10/2017 - 00:31

హైదరాబాద్, మార్చి 9: పేరొందిన హైదరాబాద్ బిర్యానీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ దక్కలేదు. తొలిసారిగా నిజాం నవాబు హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేసిన ఈ బిర్యానీ ఎంతోమందికి నచ్చింది. హైదరాబాద్ విచ్చేసిన ప్రపంచలోని ఎక్కడి వారైనా మెచ్చుకోవాల్సిందే, ఆ రుచికి దాసాహం కావాల్సిందే. కానీ జీఐ ట్యాగ్ సంపాదించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

03/10/2017 - 00:29

ముంబయి, మార్చి 9: భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) త్వరలో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన కొత్త 10 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానుంది.

03/10/2017 - 00:29

న్యూఢిల్లీ, మార్చి 9: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)లో గురువారం ఒకే రోజు 50 వేల కోట్ల రూపాయల విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు చేతులు మారాయి. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూపు సంస్థల మధ్య షేర్‌హోల్డింగ్స్‌లో భారీ మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆ కంపెనీ షేర్లు భారీ ఎత్తున చేతులు మారాయి.

03/10/2017 - 00:28

న్యూఢిల్లీ, మార్చి 9: బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరగడం వలన ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు అధికారులు శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి అంజూలీ చిబ్ దుగ్గల్ కూడా హాజరుకానున్నారు.

03/10/2017 - 00:28

ముంబయి, మార్చి 9: బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సి) ఇకపై బంగారం తాకట్టుపై 25 వేల రూపాయలకు మించి రుణాలు ఇవ్వరాదని రిజర్వ్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. ఇంతకుముందు బంగారం తాకట్టుపై లక్ష రూపాయలకు మించి ఇచ్చే రుణాల చెల్లింపులు చెక్‌ల ద్వారా మాత్రమే చేయాలని ఎన్‌బిఎఫ్‌సిలకు రిజర్వ బ్యాంక్ నిబంధన ఉంది.

03/10/2017 - 00:27

పరకాల, మార్చి 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ వద్ద ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం 600 మెగావాట్ల ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బాయిలర్‌లోని వాటర్ ట్యూబ్‌లు లీకేజీ కావడంతో ఉత్పత్తి నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాంటు నుండి రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

03/09/2017 - 07:48

న్యూఢిల్లీ, మార్చి 8: బ్యాంకులు.. ఇక కొందరివేనా?, అందరికీ బ్యాంకింగ్ సేవలు అందవా?, సామాన్యుడి ప్రయోజనాలను బ్యాంకర్లు పట్టించుకోవడం లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు అవుననే సమాధానమే చెప్పాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల తాజా నిర్ణయాలు ఇలాగే ఉన్నాయమరి.

Pages