S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/17/2016 - 06:31

విజయవాడ, సెప్టెంబరు 16: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఆలంబనగా నిలుస్తూ, ఏపి ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉండేందుకు విప్రో సంస్థ ముందుకు వచ్చింది.

09/17/2016 - 06:31

ముంబయి, సెప్టెంబర్ 16: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో వారం ప్రారంభంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి నాటికి ఓ మోస్తరుగా కోలుకున్నాయి. శుక్రవారం వరసగా మూడో రోజు కూడా సెనె్సక్స్ 186 పాయింట్లు లాభపడి వారం రోజుల గరిష్ఠ స్థాయి అయిన 28,599.03 పాయింట్లకు చేరుకుంది.

09/17/2016 - 06:30

విజయవాడ, సెప్టెంబరు 16: రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సింగపూర్, శ్రీలంక, మలేషియా తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్కృతి, పురావస్తు, వారసత్వ సంపద, పర్యాటక, ఆహారం, ఆతిథ్యం తదితర శాఖలను అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

09/17/2016 - 06:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తక్కువగా చూపేందుకు జన్ ధన్ ఖాతాల్లో బ్యాంకర్లే సొమ్మును డిపాజిట్ చేశారా? లేక ఆ సొమ్మును ఖాతాదారులే డిపాజిట్ చేసుకున్నారా? అనే అంశంపై ప్రభుత్వ రంగంలోని నాలుగు బ్యాంకులు శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం వెల్లడించారు.

09/17/2016 - 06:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచీలో మన దేశం ఇంతకు ముందున్న స్థానంనుంచి పది స్థానాలు దిగజారి 159 దేశాల్లో 112వ స్థనంలో నిలిచింది. న్యాయ వ్యవస్థ, రెగ్యులేటరీ నిబంధనలులాంటి విషయంలో ఘోరంగా విఫలం కావడమే ఈ దిగజారుడుకు ప్రధాన కారణమని ‘ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ వరల్డ్: 2016 వార్షిక నివేదిక’పేర్కొంది.

09/16/2016 - 15:47

దిల్లీ: రూ. 31 వేల మార్కును దాటిన బంగారం ధర శుక్రవారం కాస్త దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ధర తగ్గి రెండు వారాల కనిష్ఠానికి చేరింది. 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31వేలుగా ఉంది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,313.10 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా శుక్రవారం రూ. 350 తగ్గింది. కేజీ వెండి ధర రూ. 45,100గా దేశీయ మార్కెట్లో ఉంది.

09/16/2016 - 11:23

ముంబయి: శుక్రవారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.85 పైసలు వద్ద కొనసాగుతోంది. 250 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 65 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

09/16/2016 - 08:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: రూపాయి విలువను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో గురువారం ఉదయం దేశీయ కరెన్సీ విలువ అకస్మాత్తుగా పతనమైంది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు రంగంలోకి దిగి, రూపాయి విలువను తగ్గించాలన్న ఆలోచనలేమీ లేవని, ఇకముందు కూడా దీని విలువను మార్కెట్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

09/16/2016 - 07:59

ముంబయి, సెప్టెంబర్ 15: రోజంతా ఆటుపోట్ల మధ్య సాగిన దేశీయ మార్కెట్లు చివర్లో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకోవడంతో లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 41 పాయింట్లు లాభపడి 28,412.89 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపు 16 పాయింట్లు లాభపడి 8,742.55 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి.

09/16/2016 - 07:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: నల్లధనం వెలికి తీయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ డిక్లరేషన్ పథకం (ఐడిఎస్) కింద డిక్లరేషన్లు ఇవ్వడానికి గడువు ఈ నెల 30 తేదీతో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని కార్యాలయాలను 30వ తేదీ అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆదాయం పన్ను విభాగాన్ని ఆదేశించింది.

Pages