S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/15/2016 - 05:47

ముంబయి, సెప్టెంబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. మంగళవారం బక్రీద్ సందర్భంగా సెలవు అవగా, సోమవారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 18.69 పాయింట్లు పెరిగి 28,372.23 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11 పాయింట్లు అందుకుని 8,726.60 వద్ద నిలిచింది.

09/14/2016 - 16:06

ముంబయి: మంగళవారం భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్పంగా కోలుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.91 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8,726 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 19 పాయింట్లు లాభపడి 28,372 వద్ద ముగిసింది.

09/14/2016 - 06:05

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: నౌకా నిర్మాణ రంగంలో రష్యా ప్రభుత్వరంగ సంస్థ యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పెట్టుబడులు పెట్టనుంది. రక్షణ రంగంలో నౌకల తయారీ, ఏపి కేంద్రంగా ప్రాజెక్టు ఏర్పాటుపై ఇండో-రష్యా ప్రతినిధులు విశాఖలో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

09/14/2016 - 06:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్‌కు మంగళవారం ఓ సరికొత్త వాహనాన్ని పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న తమ హచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20ని ఆటోమేటిక్ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 9.01 లక్షల రూపాయలు.

09/14/2016 - 06:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో 3,065.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 3,596.93 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. దీంతో ఈసారి లాభం 14.7 శాతం క్షీణించినట్లైంది.

09/14/2016 - 06:01

హైదరాబాద్, సెప్టెంబర్ 13: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, పరిశ్రమల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపి కవిత తెలిపారు. ఎఫ్‌ట్యాప్సీ భవన్‌లో మంగళవారం తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (టిఐఎఫ్), తెలంగాణ జాగృతి స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ మధ్య ఒప్పందం కుదిరింది.

09/14/2016 - 06:01

చెన్నై, సెప్టెంబర్ 13: వ్యాపార విస్తరణలో భాగంగా పెప్సీకో.. ఆహార విభాగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సంస్థ చైర్‌పర్సన్, సిఇఒ ఇంద్రా నూరుూ భారత్‌లో రెండు రోజులు పర్యటిస్తుండగా, మంగళవారం చెన్నైలోని ఓ రెస్టారెంట్‌ను ఆమె సందర్శించారు.

09/14/2016 - 06:00

బెంగళూరు, సెప్టెంబర్ 13: ఎటియోస్, లివా అప్‌డేట్ వెర్షన్లను మంగళవారం భారతీయ విపణికి పరిచయం చేసింది టొయోటా. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వచ్చిన వీటి ధరలు ముంబయి ఎక్స్‌షోరూం ప్రకారం 5.24 లక్షల రూపాయల నుంచి 8.87 లక్షల రూపాయల మధ్య ఉన్నాయి. న్యూ సెడాన్ ప్లాటినమ్ ఎటియోస్ పేరిట తీసుకొచ్చిన 1.5 లీటర్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కారు ధర 6.43 లక్షల రూపాయల నుంచి 7.74 లక్షల రూపాయల మధ్య ఉంది.

09/14/2016 - 06:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: స్టాక్ మార్కెట్లలోకి కొత్తగా అడుగిడిన సంస్థలు మదుపరులకు లాభదాయకంగా మారాయి. 70 శాతం లాభాల్లో కదలాడుతున్నాయి. పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. మార్కెట్‌లోకి ప్రవేశించిన నాటి నుంచి గమనిస్తే వీటి షేర్ల విలువ గరిష్ఠంగా 98 శాతం వరకు పెరగడం గమనార్హం.

09/13/2016 - 04:12

విజయవాడ, సెప్టెంబరు 12: రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో చక్కెర శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు టొయోటా సుషో సుగర్ ట్రేడింగ్ లిమిటెడ్ సంస్థ ఆసక్తి కనబరచింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

Pages