S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/13/2016 - 04:09

ముంబయి, సెప్టెంబర్ 12: గత మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా సెనె్సక్స్ సోమవారం తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు గురైంది. లావాదేవీలు ముగిసే సమయానికి 444 పాయింట్లు కోల్పోయి 28,353.54కు చేరుకుంది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 8,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనే స్టాక్ మార్కెట్లలో ఈ ఒడిదుడుకులకు దారితీసింది.

09/13/2016 - 04:08

విజయవాడ, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో లక్ష్యాలకు మించి శ్రీనిధి రుణాలు ఇచ్చారు. పేద మహిళలు జీవనోపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద మహిళలు వడ్డీ వ్యాపారుల బారినపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ఈ పథకం ఉపయోగపడుతోంది. స్వయం సహాయక బృందాలకు ఈ పథకం ఓ వరంగా నిలిచింది. పాడి పశువుల కొనుగోలుకు, చిరు వ్యాపారం వంటి వాటికి రూ.75 వేల వరకు రుణం ఇస్తారు.

09/13/2016 - 04:07

విజయవాడ, సెప్టెంబర్ 12: గోల్డెన్ ఫోనెక్స్ కంపెనీ మరియు కింగ్‌బర్డ్‌ల ప్రతినిధులు సోమవారం జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని జలవనరులశాఖ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ కంపెనీ ప్రతినిధులు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో నెల్లూరు జిల్లాలో స్టోన్ మ్యానుఫ్యాక్చురింగ్ కంపెనీ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.

09/13/2016 - 03:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఎక్సైజ్ పన్నుల వసూళ్లు పెరగడంతో దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పరోక్ష పన్నుల నికర వసూళ్లు 27.5 శాతం పెరిగి 3.36 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, కస్టమ్స్ సుంకాలు సహా పరోక్ష పన్ను వసూళ్ల మొత్తంలో ఆగస్టు వరకు 43.2 శాతం వసూళ్లు జరిగినట్లు స్పష్టమవుతోంది.

09/13/2016 - 03:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఆదాయం, ఈక్విటీ విభాగాల్లో రాబడులు భారీగా పెరగడంతో ఆగస్టు నెల చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు 15.6 లక్షల కోట్లకు పెరిగాయి.

09/13/2016 - 03:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సిఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా అనూప్ కుమార్ శర్మ బాధ్యతలు చేపట్టారు. సోమవారం నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఎస్‌సిఐ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది. షిప్పింగ్ కార్పొరేషన్ మన దేశ ప్రధాన నౌకా రవాణా సంస్థగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

09/13/2016 - 03:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశీయ ఆటోమొబైల్ సంస్థ ఎంఅండ్‌ఎం (మహీంద్రా అండ్ మహీంద్రా) సోమవారం సరికొత్త బొలెరో ఎస్‌యువి (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ను ఆవిష్కరించింది. ముంబయిలో దీని ఎక్స్-షోరూమ్ ధర 6.59 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బొలెరో వాహనం కంటే దాదాపు లక్ష రూపాయల తక్కువ ధరకే ఇది లభ్యం కానుంది.

09/13/2016 - 03:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: పప్పు ధాన్యాలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించి దేశంలో ధరల పెరుగుదలను అదుపు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం పప్పుదినుసుల మిగులు నిల్వ పరిమితిని ప్రస్తుతమున్న 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షల టన్నులకు పెంచాలని సోమవారం నిర్ణయించింది.

09/12/2016 - 16:13

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఆరంభం నుంచే భారీ నష్టాల దిశగా పయనించిన మార్కెట్లు ముగిసే సమయానికి కుప్పకూలాయి. ఈ ఏడాది బ్రెగ్జిట్‌ తర్వాత ఇదే అత్యధిక పతనమని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 444 పాయింట్లు కోల్పోయి 28,353 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 8,715 వద్ద ముగిసింది.

09/12/2016 - 11:30

ముంబయి: సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది బ్రెగ్జిట్‌ తర్వాత ఇదే అత్యంత ఆరంభ పతనమని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 546 నష్టంతో మొదలవగా.. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం నిఫ్టీ 400 పాయింట్లకు పైగా, సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతున్నాయి.

Pages