S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/07/2016 - 06:07

హైదరాబాద్, జనవరి 6: సౌర, పవన విద్యుత్ ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర, పవన విద్యుత్‌ను వినియోగించుకుని దూరదృష్టితో తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు వీలవుతుందని ఆయన సూచించారు.

01/07/2016 - 06:06

ముంబయి, జనవరి 6: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలపాలయ్యాయి. ఈ వారం ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్న సూచీలు.. సోమవారం భారీ స్థాయిలో పతనమైనది తెలిసిందే. మంగళవారం కూడా నష్టాలను అందుకోగా, బుధవారం అదే దారిలో నడిచాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 174.01 పాయింట్లు పడిపోయి 25,406.33 వద్ద ముగిసింది.

01/06/2016 - 17:11

ముంబయి : స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టపోయి 25,406 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 7,741 సూచీ వద్ద ముగిశాయి.

01/06/2016 - 06:58

రాజమహేంద్రవరం, జనవరి 5: గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి గల అవకాశాలు, రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధి అనే అంశాలపై మంగళవారం సదస్సు జరిగింది.

01/06/2016 - 06:51

రాజమహేంద్రవరం, జనవరి 5: ప్రస్తుతం ఉన్న ఇసుక విధానానికి స్వస్తిచెప్పి మళ్లీ గనుల శాఖ ఆధ్వర్యంలో బహిరంగంగా ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో కూడా నిర్మాణ రంగంపైనా, వినియోగదారులపైనా భారం పడేలా కనిపిస్తోంది. మహిళా పొదుపు సంఘాల పర్యవేక్షణలో నడుస్తున్న ఇసుక విధానంలో వినియోగదారులపై తీవ్రస్థాయిలోనే భారం పడటంతోపాటు, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతున్న సంగతి విదితమే.

01/06/2016 - 06:50

న్యూయార్క్, జనవరి 5: ఫోర్బ్స్ ప్రకటించిన ‘30 అండర్ 30’ ఐదో వార్షిక జాబితాలో 45 మంది భారతీయ, భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది. వివిధ రంగాల్లో గుర్తింపును పొందిన 30 ఏళ్ల వయసు లోపున్నవారితో ఈ జాబితా తయారైంది. కన్జ్యూమర్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, మీడియా, తయారీ, పారిశ్రామిక, న్యాయ, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వంటి 20 రంగాలకు చెందిన 600 మంది పురుషులు, మహిళలకు ఈ జాబితాలో స్థానం లభించింది.

01/06/2016 - 06:49

న్యూఢిల్లీ, జనవరి 5: ఉత్పత్తి తగ్గుతోందన్న ఆందోళనల మధ్య రిటైల్ మార్కెట్‌లో పప్పు్ధన్యాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5వేల టన్నుల కందిపప్పు దిగుమతులకు ఓ టెండర్‌ను జారీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసి ఈ టెండర్‌కు సంబంధించి బిడ్లను ఆయా దేశాల నుంచి ఆహ్వానించగా, బిడ్లలో నమోదయ్యే ధరల ఆధారంగా దిగుమతుల పరిమాణాన్ని పెంచుతామని ఎమ్‌ఎమ్‌టిసి తెలిపింది.

01/06/2016 - 06:48

ముంబయి, జనవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. అయితే సోమవారంతో పోల్చితే నష్టాల తీవ్రత చాలా తక్కువగా ఉండగా, అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ రెండు వారాలకుపైగా కనిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య మదుపరులు కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. ఫలితంగానే సెనె్సక్స్ 43.01 పాయింట్లు కోల్పోయి 25,580.34 వద్ద ముగిసింది.

01/06/2016 - 06:48

న్యూఢిల్లీ, జనవరి 5: దేశ ఆర్థిక వ్యవస్థ తీరు ఆశాజనకంగా లేదని, సంస్కరణల అమలు మందగించిందని పారిశ్రామిక సంఘం సిఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందార్ అన్నారు. మంగళవారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర సంస్కరణల అమలు ఆలస్యం కారాదని, దీని అమలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందన్నారు. సంస్కరణలు ఆగిపోలేదని, అయితే వాటి అమలు మందగించిందని పేర్కొన్నారు.

01/05/2016 - 16:38

ముంబయి : స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 25,580 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టి 6 పాయింట్లు నష్టపోయి 7,785 సూచీ వద్ద ముగిశాయి.

Pages