S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/05/2016 - 06:46

ముంబయి, జనవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. చైనా ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి మదుపరుల పెట్టుబడులను దెబ్బతీశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మూడు నెలలకుపైగా కనిష్ట స్థాయికి దిగజారితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ నాలుగు నెలలకుపైగా కనిష్ట స్థాయికి పతనమైంది.

01/05/2016 - 06:36

రాజమహేంద్రవరం, జనవరి 4: వ్యవసాయ రంగంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి వ్యవసాయ పట్ట్భద్రులు, యువ శాస్తవ్రేత్తలు కృషి చేయాలని కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

01/05/2016 - 06:36

సంగారెడ్డి, జనవరి 4: జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), జెఎన్‌టియు, ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాలలతో అలరారుతున్న మెదక్ జిల్లాకు మరో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏర్పాటై ఉద్యాన వాణిగా పేరుగాంచనుంది.

01/05/2016 - 06:35

న్యూఢిల్లీ, జనవరి 4: సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైకిల్స్ గత నెల డిసెంబర్‌లో 6 లక్షలకుపైగా సైకిళ్లను అమ్మింది. 2014 డిసెంబర్‌తో పోల్చితే ఇది 20 శాతం అధికం. కాగా, కేవలం ఒక నెలలో ఈ స్థాయి అమ్మకాలు నమోదవడం భారతీయ సైకిళ్ల పరిశ్రమ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో హీరో సైకిల్స్ తెలిపింది. అమ్మకాల రికార్డుపై హీరో సైకిల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజల్ ఆనందం వ్యక్తం చేశారు.

01/05/2016 - 06:35

విశాఖపట్నం, జనవరి 4: ఈపిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లోని పుణ్యక్షేత్రాల్లో భూగర్భ విద్యుద్దీకరణ పనులకు 126 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రపంచబ్యాంకు నుండి ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే టెండర్లు ఖరారు చేస్తారు. విజయనగరం పట్టణంలోని పైడితల్లి అమ్మవారి దేవాలయ పరిధిలో 14.9 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుద్దీకరణ కోసం రూ.

01/04/2016 - 16:48

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 530 పైగా పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 170 పాయింట్లు క్షీణంచింది. ముఖ్యంగా నిఫ్టీ గట్టిమద్దతు స్థాయి 7800 పాయింట్లకు దిగజారి మరింత బలహీన సంకేతాలను అందజేసింది.

01/04/2016 - 07:52

న్యూఢిల్లీ, జనవరి 3: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/04/2016 - 07:50

న్యూఢిల్లీ, జనవరి 3: భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది.

01/04/2016 - 07:50

విశాఖపట్నం, జనవరి 3: విశాఖ నగరాన్ని పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. ఆదివారం విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, మన చరిత్ర, సంస్కృతిని కాపాడుకునేందుకు విశాఖ ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.

01/04/2016 - 07:49

హైదరాబాద్, జనవరి 3: వరంగల్‌లో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పిఎఫ్‌సి) బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను ఈ నెల 29వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు సమర్పించాల్సి ఉంది. టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా వీటికి బిడ్లను ఆహ్వానిస్తారు.

Pages