S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/25/2019 - 22:13

జాతీయ రాజకీయాలపై నిర్ణయాత్మక ప్రభావం చూపనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా అఖిలేష్ యాదవ్, మా యావతి పొత్తు ఏర్పర్చుకొంటున్నట్లు ప్రకటించగానే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక ప్రేక్షక పాత్ర వహించాల్సిందేనని చాలామంది అంచనాలు వేయడం ప్రారంభించారు.

01/31/2019 - 10:57

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఇటీవల కోల్‌కతలో జరిగిన మహార్యాలీలో విపక్ష పార్టీల డొల్లతనం మరోసారి బహిర్గతమైంది. ఈ ర్యాలీలో నేతల ప్రసంగాల తీరు చూస్తే- ‘బీజేపీ మతతత్వ విధానాలను భరిస్తాం కాని ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపే దాకా నిద్రపోం..’ అనే సంకేతాలు ఇచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన అజెండాను ఖరారు చేయడంలో విపక్ష నేతలు విఫలమయ్యారు.

01/23/2019 - 01:44

అరవై ఏళ్ల వయసు దాటినా ‘తుది డిగ్రీ’ కోసం రాహుల్ పాథక్ ఇంకా దమ్రాన్ సివిల్ కోర్టులో పోరాటం చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘నేషనల్ జ్యుడీషియల్ డేటాగ్రిడ్’ను పరిశీలిస్తే 1951 మే 5న ఆయన తుది డిగ్రీ కోరుతూ వేసిన పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది.

01/22/2019 - 00:17

ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకులకు ‘్భగవద్గీత’ అంటే చాలా ఇష్టం. అందులో ఉన్న ‘స్వధర్మే నిధనం శ్రేయః’లాంటి శ్లోకమంటే వారికి బహుప్రీతి! ధర్మానికి గ్లాని (్భంగం) కలిగినప్పుడు, ధర్మాన్ని రక్షించడానికి మోదీ, కేసీఆర్ లాంటివాళ్ళు అవతార పురుషులుగా జన్మిస్తారు! అధర్మాన్ని ఖండిస్తారు, పాపులను శిక్షిస్తారు. ధర్మసంస్థాపన చేస్తారు.

01/20/2019 - 02:22

కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి దేవాలయంలోకి పది నుంచి యాభై సంవత్సరాల వయసు లోపు మహిళలకు ప్రవేశార్హత లేదనే ఆచారం చాలా సంవత్సరాలుగా అమలులో ఉంది. దీనికి వ్యతిరేకంగా మహిళా ఉద్యమకారులు కోర్టుకెక్కారు. కోర్టు ‘చట్టం దృష్టిలో అంతా సమానమే’అని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఆసరాగా చేసుకొని కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ప్రభుత్వం హిందువుల విశ్వాసాలను నాశనం చేసుకొనేందుకు కంకణం కట్టుకొంది.

01/18/2019 - 22:17

(ఈ నెల 23న సుభాష్‌చంద్ర బోస్ జయంతి)

01/18/2019 - 02:11

ప్రపంచంలోనే అమెరికా వైద్యవిద్యకు చాలా పటిష్టమైనదని కీర్తి వచ్చింది. అలా ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు ఏ మాత్రం విచారించకుండానే- వైద్య విద్యను కోరుకునే పిల్లల శ్రమే దీనికి కారణం అని చెప్పాలి. వైద్య విద్యను కోరే పిల్లలు నాలుగు దశల్లో పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. అవి.. 1. సాట్ స్కూల్ 2. స్కూలులో విద్యార్థి రికార్డు 3. వేసవిలో విద్యార్థి చేసే ఇంటర్న్‌షిప్ చేసిన విధానం, 4.

01/16/2019 - 23:13

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కనీసం 150 లోక్‌సభ సీట్లు తెచ్చుకోవాలి. బీజేపీ వ్యతిరేక ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, తృణమూల్, బీజేడీ, టీడీపీ తదితర పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు తగిన బలం సమకూరుతుందనే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉన్నాయి.

01/13/2019 - 01:41

‘నిజం నిద్రలేచి నడక ప్రారంభించే సమయానికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది..’-అనే నానుడిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన వాగ్దానాల అమలు విషయంలో ప్రజలలోకి వెళ్ళిన అపోహలు నిజం చేస్తున్నాయి. విభజన చట్టంకు సంబంధించి అలనాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన లోని అంశాలను వాటి అమలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్న ప్రచారానికి భిన్నంగా పరిశీలిద్దాం.

01/11/2019 - 21:40

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరు గబోతున్న సమయంలో ఇప్పుడు అందరి దృష్టి ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ వైపే మర లుతున్నది. ఉత్తర ప్రదేశ్ భారత్- భారత్ ఉత్తర ప్రదేశ్ అని తరచూ అంటారు. ఎందుకంటే దేశంలోని 545 నియోజక వర్గాలలో 80 ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడ పట్టు సాధిస్తే గాని కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదు. మన ప్రధాన మంత్రులలో అత్యధికులు ఆ రాష్ట్రం నుండే వచ్చారు.

Pages