S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

11/21/2018 - 01:10

ప్రకృతి విలయాలు, ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మించిపోతున్న మరో పెనుముప్పు నేడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టెక్నాలజీకి మరో వికృత రూపం నకిలీ వార్తలు. క్షణంలో కోటానుకోట్ల నకిలీ వార్తలు పుడుతూ మరుక్షణంలో విశ్వమంతటా చుట్టేస్తున్నాయి. వాటిని విన్న వారు తీవ్ర ఉద్వేగానికి గురికావడమో, ఆవేశకావేశాలకు లోనుకావడమో జరుగుతోంది. నకిలీ వార్తల పుణ్యమాని కొన్ని చోట్ల మూకదాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి.

11/20/2018 - 00:36

నియంతృత్వ పోకడలకు స్వస్తి పలికి ప్రజాకాంక్షే పరమావధిగా మరో ప్రజాస్వామ్య కుసుమం విరిసింది. ప్రజాహితాన్ని విస్మరించి అధికారమే అంతిమలక్ష్యంగా విడ్డూర పోకడలకు పోయే ఏ నాయకుడూ నిలువలేడనడానికి చరిత్రలో ఉదంతాలకు కొదవ లేదు.

11/18/2018 - 00:49

హైదరాబాద్ నగర మేయర్‌గా పనిచేసిన బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సైతం పార్టీకి ‘గుడ్ బై’ చెప్పేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై నిప్పులు చెరిగి బహిరంగంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

11/17/2018 - 00:35

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం జరుపుతున్న పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఒక్కరే అని చెప్పవచ్చు. మిగిలిన పార్టీలన్నీ ఏదో ఒక విధంగా అవకాశవాద ధోరణినే ప్రదర్శిస్తున్నాయి. వాటికి తమ సొంత రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యం. మోదీని సాగనంపి, ఆ స్థానంలో రాహుల్‌ను గద్దె ఎక్కించడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

11/15/2018 - 22:22

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంతో- 1956, 1972లో చేసిన తప్పును కాంగ్రెస్ నేతలు సరిచేశారని ఆంధ్ర ప్రజలు బాధపడి మానసికంగా తేరుకుంటున్న సమయమిది. తాజా విభజన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలను నవంబర్ 1న జరపడమెందుకు? అని తిరస్కరించినా ప్రజలు మానసికంగా రోదించి జీర్ణించుకున్నారు.

11/14/2018 - 00:52

అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ‘మినీ మారథాన్’ మొదలైంది. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, పలు శాసనసభ ఎన్నికలపై పడుతుందని కొందరు, అలాంటిదేమీ ఉండదని ఇంకొందరు వాదిస్తున్నారు. ఫలితాల ప్రభావం సంగతి పక్కన పెడితే, ఎన్నికల కోలాహలం ఇప్పటికే మిన్నంటింది.

11/13/2018 - 00:23

దేశం అనే దేహానికి ‘బ్యాంకింగ్ వ్యవస్థ- ద్రవ్య చలామణి’ అనే యుగళం రక్తప్రసరణ ప్రక్రియ లాంటి ప్రధాన లక్షణం. బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమత కోల్పోతే ఆ దుర్లక్షణం బ్లడ్ క్యాన్సర్‌లా దేశాన్ని కుప్పకూల్చేస్తుంది. రక్తప్రసరణ క్రియలో గుండె ఎంత ప్రధానమైనదో దేశానికి రిజర్వ్ బ్యాంక్ అంత ప్రధానమైనది.

11/11/2018 - 01:34

విశాఖ మన్యంలో ఇటీవల ఇద్దరు ప్రజానాయకులను హత్యచేసిన మావోయిస్టులకు సహకరించిన నలుగురిని పోలీసులు గుర్తించారు. డుంబ్రిగూడకు చెందిన యేడేల సుబ్బారావు, అతని భార్య ఈశ్వరి, ఆంత్రాగూడకు చెందిన గెమ్మిలి శోభన్, తడ్డకు చెందిన కొర్రా కమల మావోయిస్టులకు సంఘటన జరిగిన రోజున సహకరించినట్టు విచారణలో వెల్లడైంది.

11/10/2018 - 00:58

కర్నాటకలో తాజా ఉపఎన్నికల ఫలితాలు సహ జంగానే భాజపా వ్యతిరేక పక్షాలలో నూత నోత్సాహం కలిగిస్తున్నాయి. తాము ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టగలిగితే 2019 ఎన్నికలలో భాజ పాను ఓడించడం చాలా సులభం అనే సందేశాన్ని విపక్షాలు మరో మారు ఇస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా ఆధిక్యతను సాధించినా, అది ప్రతిపక్షాల మధ్య చీలికల వల్లనే సాధ్యమైందని గుర్తించాలి.

11/09/2018 - 00:20

ఇంట్లో వేగంగా నఢుచుకుంటూ పరుగెత్తుతున్న కొడుక్కి అడ్డుగా ఉన్న బకెట్ తగిలింది. అక్కడే ఉన్న తండ్రి ‘కళ్లు కన్పించడం లేదా! చూసుకొని వెళ్లక్కర్లేదా?’ అని కొడుకుపై అరిచాడు. ఓ వారానికి అదే తండ్రి నడుచుకుంటూ వెళ్తుంటే అదే బకెట్ కాలికి తగిలింది. వెంటనే అక్కడున్న కొడుకును ‘ఎవడ్రా! ఇక్కడ బకెట్ పెట్టింది?’ అని తిట్టాడట. ఈ తండ్రి స్వభావం ఇపుడు చంద్రబాబులో కన్పిస్తుంది. తాను చేసిందే గొప్ప విషయం.

Pages