S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

12/20/2018 - 01:49

భాజపా సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే ఫ్రంట్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మజ్లిస్ నేత ఓవైసీ రూపొందించే ఫెడరల్ ఫ్రంట్‌కు మధ్య ‘2019- సార్వత్రిక సమరం’ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కొనే్నళ్లుగా వరుస విజయాలతో ముందుకెళుతున్న భాజపాకు 2018 సంవత్సరం గట్టి ‘షాక్’ ఇచ్చింది. ఇటీవలి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను విశే్లషించుకునే పనిలో భాజపా ఉంది.

12/19/2018 - 03:57

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాం టి అనుమానాలు లేవని సుప్రీం కోర్టు తేల్చి చెప్పినా, ఈ వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. సరికొత్త అనుమానాలకు ఈ అంశం తెరతీసింది. సుప్రీం కోర్టుకు సమర్పించిన పత్రాల్లో సత్యదూరమైన సమచారాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఆ వివరాల ఆధారంగానే కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వం అసలు నిజాలను బహిర్గతం చేయాలని విపక్షాలు కోరుతున్నాయి.

12/16/2018 - 02:31

వచ్చే ఏడాది ఆరంభంలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు మార్క్సిస్ట్ (సీపీఎం) పార్టీ కేరళలో ఘోర పరాజయాన్ని పొందబోతున్నదని రాజకీయ పండితులు అపుడే జోస్యం చెపుతున్నారు. ఇది భారతీయ జనతాపార్టీ కల్పించిన కట్టుకథ కాదు. కేరళలో వామపక్ష కూటమి బలహీనపడి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

12/14/2018 - 22:46

అయదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీకి పెద్ద ఎదురు దెబ్బ కాగా, కాంగ్రెస్‌కు ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. 2013 నుండి దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతగా ప్రాచుర్యం పొందుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను ఆకట్టుకొనే సామర్ధం పట్ల ఇప్పుడు నీలినీడలు వ్యాపిస్తున్నాయి.

12/13/2018 - 03:52

భారీ ఎత్తుగడలు లేని వ్యూహాల ద్వారా విజయాలను నెమ్మది నెమ్మదిగా సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి వ్యూహాలు లేని ఎత్తుగడలు అపజయం తప్పదని ముందుగానే హెచ్చరిస్తాయి. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల్లో పొత్తులు ఎలాబెడిసికొడతాయి? ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారనే అంశంపై తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పులో వచ్చే వందేళ్లకు సరిపడ సమాధానం ఉంది.

12/12/2018 - 00:00

ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద సజావుగా నడవాలంటే సరైన నాయకులు దేశాన్ని నడిపించాలి. చట్టసభలకు సత్ప్రవర్తనతో కూడిన ప్రజాసేవకులే ఎన్నిక కావాలి. తమను తాము పరిపాలించుకున్న భావన ప్రజల్లో రావాలంటే, వారి ఆలోచనలు, ఆకాంక్షలు నిజం కావాలంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వారే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలి.

12/09/2018 - 02:39

‘బోస్ వ్యక్తిత్వం, ఉపన్యాసాలు
నన్ను సమ్మోహింపజేశాయ...
మొట్టమొదటి సారిగా-
నాకు నా జీవితంలో...
ఒక భారతీయుని ఉద్బోధల వలన
భారతావని అద్భుత రూపం
నా కళ్ల ముందు కదలాడిందం’టూ...

12/08/2018 - 00:15

ఈ సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన 70వ వార్షికో త్సవాన్ని జరుపుకొంటున్నాము. ఈ సంద ర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విశేష కార్యక్రమాలను జరుపుకొంటున్నాము. మానవజాతి చరిత్రలో సరిగ్గా 70 ఏళ్ళ క్రితం జరిగిన ఈ ప్రకటన అతి పెద్ద మలుపు అని చెప్పవచ్చు. ఆధునిక మానవ నాగరికతకు, నాగరిక జీవనానికి బలమైన పునాది వేసిన చారిత్రాత్మక ఘడియలు అవి.

12/07/2018 - 02:19

‘‘ఓ అణుశాస్తవ్రేత్తగా మూడో ప్రపంచ యు ద్ధంలో ఏం జరుగుతుందో చెప్పండి’’- అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దానికి ‘‘మూడవ ప్రపంచ యుద్ధం గురించి మాత్రం నన్ను అడగకండి? నాలుగో ప్రపంచ యుద్ధం గురించి మాత్రం చెప్పగలను’’ అని అన్నాట్ట ఆయన. ఇదేంటని పాత్రికేయుడు నోరెళ్లబెడితే- ‘‘నాలుగో ప్రపంచ యుద్ధం ఎప్పటికీ జరగదు.. మూడవ ప్రపంచయుద్ధమే ఆఖరి యుద్ధం.

12/06/2018 - 21:44

ఐరోపాలో ఇరుగు పొరుగు దేశాలను జయించిన యుద్ధవీరుడు నెపోలియన్ బొనపర్టే తన జీవితంలో 60 యుద్ధాలు చేశాడు. చివరికి బెల్జియంలోని ‘వాటర్లూ’ అనే ప్రాంతంలో బ్రిటన్, ప్రుష్యన్ సైనికులతో జరిగిన భీకర పోరులో నెపోలియన్ పరాజయం పాలయ్యాడు. ఈ యుద్ధం 1815 జూన్ 18న జరిగింది. బ్రస్సెల్స్‌కు 15 కి.మీ దూరంలోని వాటర్లూ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఓటమి చెందాక నెపోలియన్ బందీ అయ్యాడు.

Pages