S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

12/05/2018 - 03:07

మీ ‘ఆధార్’ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందా..? ‘ఆధార్’ నెంబర్లను, పుట్టిన తేదీ ఇతర వివరాలను తెలుసుకుని ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే ఆందోళన ఉందా? అలాంటి అనుమానాలు, లేనిపోని భయాలు ఇక అక్కర్లేదు. ఎందుకంటే ‘ఆధార్’లో బయోమెట్రిక్ డేటాను విలీనం చేసిన రీతిలోనే ఇక మీదట డీఎన్‌ఏ డేటాను విలీనం చేస్తే ఎవరు ఎంత ప్రయత్నించినా మీ వ్యక్తిగత సమచారాన్ని ఛేదించలేరు.

12/02/2018 - 00:25

‘కుక్కతోక వంకర’ అన్నట్టు చైనా పాలకులకు బుద్ధి రావటం కలలోని మాట. అమెరికా, చైనాల వాణిజ్య యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయి చేరుకుని, ఆసియా ఖండంపై ఈ రెండు దేశాలూ పట్టు బిగిస్తున్నాయి. పాకిస్తాన్‌కు రక్షణ సహాయాన్ని అమెరికా ఆపివేయగా చైనా మాత్రం పాక్‌ను తన వాణిజ్యవలస క్షేత్రంగా మార్చుకుంది. ఉత్తర కొరియా, చైనాల నుండి పాక్‌కు ఆయుధ సంపత్తి అందుతోంది. ఆయుధ పాటవాన్ని భారత్‌పై ప్రయోగించటమే పాక్ లక్ష్యం.

12/01/2018 - 00:47

మరో ఆరు నెలల్లో తన ఐదేళ్ల పదవీ కాలాన్ని ముగించుకోబోతున్న నరేంద్ర మోదీ ప్రభు త్వం ప్రస్తుతం ముఖ్యంగా రెండు వర్గాల నుండి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నది. మొదటిది ఉపాధి అవకాశాలు లేకపోగా, ఉన్న అవకాశాలు సైతం సన్నగిల్లి పోతూ ఉండడంతో యువత ఆగ్రహిస్తున్నది. మరొకటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతాంగం. ఈ రెండు విషయాల్లో ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితులలో మోదీ ప్రభుత్వం కనిపిస్తున్నది.

11/30/2018 - 00:10

పెన్‌గన్‌గ.....

11/29/2018 - 00:26

మనదేశ రాజధాని ఢిల్లీ మహా నగరం మెల్లగా ‘కోమా’లోకి జారుకుంటోంది! ఈ మహానగరంలో నెలకొన్న భయంకర వాయు కాలుష్యం తీరు చూస్తే ఇది మానవ నివాస యోగ్యం కాదని ఎప్పుడో తేలిపోయింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానంలో ఉంది. కానీ, పర్యావరణపరంగా ఈ రోజు ఢిల్లీ గురించి గర్వంగా చెప్పుకునేందుకు ఏముంది?

11/27/2018 - 23:56

ప్రపంచ దేశాలను తలదన్ని వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న భారత్- అంతర్జాతీయ మార్కెట్ వ్యూహాలకు అనుగుణంగా తక్షణ స్పందనలో జాప్యం కారణంగా తీవ్ర మార్కెట్ ఒడిదుడుకులను, అంతర్జాతీయ విపణి వేదికపై ప్రతికూలతను ఎదుర్కొంటోంది. మన దేశంలో సృజనాత్మకత, వినూత్న శక్తులు అపారంగా ఉన్నా, అందరికీ మెరుగైన ప్రకాశవంతమైన భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఆసన్నమైంది.

11/25/2018 - 01:09

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైన వారి వారి రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు విమర్శల జోరు పెంచారు. ఈ సీఎంలిద్దరూ చేసిన ‘అక్రమాల’పైన విపక్ష నేతలు ఏకరువు పెడుతున్నారు. నిజంగా ఈ ఇద్దరు ‘చంద్రులు’ అవకతవకలకు పాల్పడ్డారా? తమ తమ రాష్ట్రాలకు వీరు ఏమీ చేయలేదా? చంద్రబాబు నిరంతర శ్రమజీవి.

11/24/2018 - 01:17

ప్రపంచంలో ఎక్కడ కూడా ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని సాయుధ దళాలతో మాత్రమే పరిష్కరించడం సాధ్యం కాదు. ఆ విధంగా ప్రయత్నం చేస్తే విధ్వంసక ఫలితాలే వస్తాయి. సాయుధ దళాలు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే అక్కరకు వస్తాయ. సాధారణ ప్రజలను విశ్వాసంలోకి తీసుకొనే విధంగా రాజకీయ పక్రియను చేపట్టకుండా ఇటువంటి సమస్యలను పరిష్క రించలేము.

11/23/2018 - 01:32

చాలామంది ఆర్టీసీ బస్సు ఎక్కాలని ఇష్టపడతారు. కారణం ఆర్టీసీలో ప్రయాణం ‘సుఖకరం, సురక్షితం’ అని నమ్మడం. అనివార్య కారణాల వల్ల మాత్రమే ప్రైవేటు వాహనాలపై ఆధారపడతారు. అప్పటివరకు అరచి గీపెట్టినా ప్రైవేటు వాహనంలో ఎక్కనివారు సైతం కాస్త స్థలం ఉంటే కూర్చుంటామని బతిమాలుతారు. ఇదంతా బస్టాండ్ల వద్ద నిత్యం కనిపించే దృశ్యం.

11/22/2018 - 00:12

‘దేశభక్తిని జాతీయ వాదం వంచిస్తోంది. జాతీయ వాదం ముసుగులో పాత దయ్యాలు తిరిగి వస్తున్నాయి. అవి హింసను, ఉన్మాదాన్ని ప్రేరేపిస్తాయి’- అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా కొద్దిరోజుల క్రితం జరిగిన విశ్వనేతల సదస్సులో హెచ్చరించారు. ఆయన అన్నట్టు దేశ భక్తి, జాతీయవాదం మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

Pages