S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/24/2018 - 02:22

హద్దులు మీరుతున్న వ్యవస్థలకు ముకుతాడు వేసి, వాటిని ముందుకు నడుపుతున్న న్యాయవ్యవస్థ సైతం అప్పుడప్పుడు గాడి తప్పడం సామాన్యులకు తెలియకపోయినా, కోర్టులకు, న్యాయమూర్తులకు సుపరిచితమే. హైకోర్టు జడ్జీలపైన, సుప్రీం న్యాయమూర్తులపైన గతంలో అవినీతి, అక్రమాలు, ఆశ్రీతపక్షపాతం వంటి ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలతో కొంతమంది జడ్జీలు జైలుకు వెళ్లారు.

10/21/2018 - 00:51

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, వితరణశీలి పాల్ ఎలెన్ (65) కన్నుమూశారు. ప్రపంచాన్ని ఒకటికి రెండుసార్లు మార్చిన బిల్‌గేట్స్- పాల్ ఎలెన్ ద్వయంలో ఒకరు ఒరిగిపోయారు. పి.సి.లను ప్రపంచానికి పరిచయం చేసి కంప్యూటర్ విప్లవాన్ని సృష్టించిన గొప్ప సాంకేతిక దిగ్గజం ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా ప్రపంచాన్ని అతి తక్కువ సమయంలో కుదిపేసిన కార్యదక్షుడు పాల్ ఎలెన్.

10/21/2018 - 00:46

అగర్వాల్ భారత రక్షణ రంగంలో ఒక ఉన్నతోద్యోగి. ఇటీవల అతడు దేశద్రోహ నేరం కింద పట్టుబడ్డాడు. ఇదెలా జరిగిందంటే ఒక హనీట్రాప్ ఉదంతంతో తీగె లాగితే డొంక కదిలింది. ఎవరినుండైనా రహస్యాలు సేకరించడానికి శత్రువర్గాలు స్ర్తిలను ప్రయోగిస్తారు- దీనికే హనీట్రాప్ అని పేరు. ఇది చాణక్యుని కాలంనుండి అమలులో ఉన్న రాజకీయ తంత్రమే. పండిత జవహర్‌లాల్ నెహ్రూ యుగంలో ఈ కథలు చాలా ప్రచారంలోకి వచ్చాయి.

10/20/2018 - 01:00

కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను, శతాబ్దాల నాటి సంప్రదాయాలను, భారతీయ సమాజంలో నెలకొన్న వైవిధ్యాన్ని అర్థం చేసుకోకుండా శబరిమల క్షేత్రం గురించి సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ఈ మధ్యనే అసాధారణమైన వరద తాకిడితో అల్లకల్లోలంగా మారిన కేరళలో అసామాన్యమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది.

10/18/2018 - 00:53

నవరాత్రి పర్వదినాలు చివరి దశకు చేరాయ. ఎక్కడ చూసినా దసరా కోలాహలమే. భార తావనిలో దసరా ఒక ముఖ్యమన పండుగ. దసరా లేదా విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ. శ్రీరాముడి చేతిలో రావణుడి ఓటమి దసరా దశమి నాడే జరి గిందంటారు. విష్ణుమూర్తి దశావతారాలలో ఏడవ అవతారమైన రామావతారంలో రాక్షసరాజు రావణుడిని యుద్ధంలో ఓడించి చెరలోనున్న తన భార్య సీతను విడిపించుకుంటాడు రాముడు.

10/17/2018 - 02:36

ఎక్కడ చూసినా మహిళలపై శారీరక, మానసిక హింస.. కుటుంబ సభ్యులు సహా ఇరుగుపొరుగు వారి వేధింపులు.. కార్యాలయాల్లో అరాచకాలు.. కనురెప్పలనే నమ్మలేని దురవస్థ.. బయటకు చెప్పుకుంటే వేధింపులు పెరుగుతాయనే భయం.. సంరక్షించేవారు లేరనే ఆవేదన.. చుట్టూ ఉన్నవారు నచ్చచెప్పే ప్రయత్నమే తప్ప- తప్పు చేసిన వారిని నిలదీసే యోచన లేకపోవడం.. అవతలి వారు శక్తిమంతులని తెలిశాక ఏర్పడే నిస్తేజం..

10/13/2018 - 22:27

అబ్దుల్ కలాం జననం భారతదేశ భవిష్యత్తును ప్రపంచ చరిత్రలోనే నూతనాధ్యాయాన్ని సృష్టిం చేలా చేసింది. 1931, అక్టోబరు 15న జన్మించిన ఆయన ఆదర్శాలను అమలు చేయగలిగినప్పుడు ప్రతి వ్య క్తీ ఒక్కో కలాం కాగలడు. కడవరకూ జీవితాన్ని అధ్య యనం చేసిన ఆయన ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా తన కోసం ఆస్తిపాస్తులేమీ సంపాదించుకోలేదు.

10/13/2018 - 00:27

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఫలించేలా కన్పించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసి ఇటీవలి ఉపఎన్నికలలో విజయం సాధిం చడంతో అంతా కలిస్తే ఇక మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేననే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది.

10/11/2018 - 00:48

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముహూర్తం ప్రకటించడంతో రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టి సారించాయి. మిగతా పార్టీల కంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పలు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కాంగ్రెస్, భాజపాల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంది.

10/09/2018 - 23:45

అవినీతి, కపటత్వం అనేవి ప్రజాస్వామ్యానికి ‘అనివార్యమైన ఉత్పత్తులు’ కాకూడదని మహా త్మా గాంధీ ఏ విధంగా వాంఛించారో- అందుకు భిన్నమైన వాతావరణం నేడు దేశంలో అలముకుంది. నీతి నిజాయితీలకు మారుపేరైన వారు సమాజం దృష్టిలో చేతకానివారిగా మిగిలిపోతున్నారు. ‘డబ్బులు తీసుకున్నా ఫర్వాలేదు, పనిచేస్తాడు..’ అనే విపరీత ధోరణికి జనం చేరుకుంటున్నారు. ఒక నాయకుడి అవినీతిని ఎవరైనా ప్రస్తావిస్తే...

Pages