S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/03/2019 - 23:02

కార్మికుడు అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిగా,కూలిపని చేసే వ్యక్తిగా పరిగణించాలి. అనాదిగా సమాజంలో ఆర్థిక అసమానత్వం ఉండడంతో అప్పటి నుంచీ ఇప్పటి వరకు కార్మిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కార్మికులు లేకుంటే అభివృద్ధి అనేది లేదు. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడు లేకున్నా కొన్ని గంటలు చీకటిలో మగ్గవచ్చునేమో కానీ... కార్మికులు లేకుంటే ఒక గంట కూడా ముందుకు సాగడానికి అవకాశం వుండదు. రోజులు మారుతున్నాయి.

05/01/2019 - 01:35

పనిగంటల తగ్గింపు కోసం అమెరికాలోని చికాగోలో 1884లో కార్మికులు జరిపిన ఆందోళన-సమ్మెల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మే 1న ‘కార్మిక దినోత్సవం’ (మేడే)గా ప్రకటించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి ఆనాటి సమ్మె- ఆందోళన స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

04/28/2019 - 02:04

గౌతమ బుద్ధుడు అహింసను బోధించాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. వర్తమానంలో అది కొన్నిచోట్ల తిరగబడింది. ముఖ్యంగా మయన్మార్ (బర్మా)లో ముస్లింల, ముస్లిం మత ఛాందసవాదుల దాడులను తిప్పికొట్టడానికి, తమను తాము రక్షించుకోవడానికి తమ హక్కులను కాపాడుకునేందుకు బౌద్ధులు హింస-విధ్వంసానికి తెగబడ్డారు. 2013 సంవత్సరం నాటి అల్లర్లలో, బౌద్ధులు జరిపిన దాడుల్లో అనేక మంది ముస్లింలు మరణించారు. అపారమైన ఆస్తినష్టం జరిగింది.

04/26/2019 - 01:57

సనాతన హిందూ ధర్మం లేకపోతే బౌద్ధ్ధర్మం లేదు. బౌద్ధం లేకపోయినా హిందూ ధర్మం కొనసాగుతుంది. ఈ సూక్ష్మ పరిశీలనను పూర్తిగా అవగాహన చేసుకుంటే వాస్తవం బోధపడుతుంది. దేశంలో హిందూ-బౌద్ధ్ధర్మాలు పరస్పరం సంఘర్షించుకుంటాయని, ద్వేషించుకుంటాయని చాలామంది అనుకుంటారు. ఆ వాతావరణాన్ని కొందరు తరచూ సృష్టించేందుకు ఆయాసపడుతూ ఉంటారు.

04/24/2019 - 01:58

శాక్యవంశరాజు, కపిలవస్తు పాలకుడు శుద్ధోదనుడి భార్య, సిద్ధార్థుడి తల్లి మాయాదేవికి ‘లుంబిని’లో మహామందిరాన్ని నిర్మించారు. తరతరాలుగా ఆ మందిరానికి మెరుగులు దిద్దుతున్నారు. వర్తమానంలో ఆ మందిర వైభవం ఇంతా అంతా కాదు. విశాలమైన మందిరం లోపల పైకప్పుపై అపురూప చిత్రాలను చిత్రించారు. ‘గుమ్మటం’ లాంటి ఆకారమంతటా మాయాదేవి ప్రసవానికి ముందు- తరువాతి సన్నివేశాలను సృజించారు. ఆపైన తాంత్రిక ‘చక్రం’ ఒకటి చిత్రించారు.

04/21/2019 - 02:23

మ నిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆధారం భూమి మాత్రమే. గాలి, నీరు, అగ్ని, నేల, ఆకాశం అనే పంచభూతాల వల్లే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం స్తంభించక తప్పదు. భూమి సారవంతంగా, సస్యశ్యామలంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అగ్రరాజ్యాల అంతులేని ఆధిపత్య దాహమే భూమండలం కాలుష్యానికి చిరునామాగా మారింది.

04/19/2019 - 21:53

పోలింగ్ ముగిసినప్పటికీ ఫలితాల కోసం దాదాపు నెలన్నర రోజుల పాటు ఎదురుచూపులు..! అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎడతెగని ఉత్కంఠను ప్రజలు, రాజకీయ పార్టీలు ఎదుర్కొనక తప్పని స్థితి. ఈ నిరీక్షణ ఇలా కొనసాగుతుండగా- వోటింగ్ సరళిపై రాజకీయ విశే్లషకులు, వివిధ పార్టీల నేతలు ఎవరి అంచనాల్లో వారు మునిగితేలుతున్నారు.

04/19/2019 - 21:50

స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ తీరు వంకపెట్టలేనిదేమీ కాదు. అలా అని ఆ సంస్థ నిర్ణయాలను నిందిస్తూ కూర్చున్నా ఫలితం ఉండదు. నిష్పక్షపాతంగా దాని పనితీరును మదింపుచేసి లోపాలను, బలహీనతల్ని అధిగమించేలా పనిచేసేలా ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించాలి. ఈసీ పనితీరును ఎత్తిచూపే రాజకీయ పార్టీలు- తాము అధికారంలోకి వస్తే ఎలా దాన్ని బలోపేతం చేస్తామో చెప్పాలి. అందుకు తగ్గట్టు హామీ ఇవ్వాలి.

04/19/2019 - 02:07

జాతి పురోగతిలో ఉపాధ్యాయుల పాత్ర విస్మరించరానిది. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అక్షరాస్యత ముఖ్యమనే విషయం కాదనలేని అంశం. విద్యారంగం దేశానికి గుండె వంటిది. ఆ రంగం ఆగిపోతే దేశానికి కావాల్సిన రక్తప్రసరణ ఆగిపోయినట్లుగా ప్రముఖ విద్యావేత్తలు పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నప్పటికీ- నేటి విద్యారంగం దోపిడీకి లైసెన్స్ ఉన్న మాఫియా వ్యవస్థగా మారిందని చెప్పవచ్చు.

04/17/2019 - 02:14

ఎన్నికల బాండ్ల వివాదంపై మరోమారు విస్తృత చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యయం అపరిమితంగా పెరిగిపోవడం, అక్రమాలకు తావివ్వడం వంటి చర్యలను నిరోధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను ప్రతిపాదించింది. దీనిద్వారా రాజకీయపార్టీలకు జవాబుదారీతనాన్ని తీసుకురావచ్చని, అకౌంట్లను పారదర్శకంగా నిర్వహించేలా చూడొచ్చనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.

Pages