S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/19/2019 - 02:39

వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలపైన తప్పిదాలు చేస్తోంది. ఈ పరిణామక్రమానికి బోర్డు సభ్యులు, అధ్యాపకుల నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రధాన కారణమంటూ విద్యారంగ విశే్లషకుల భావన. లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించిన తలిదండ్రులు ఇపుడు ఆందోళన చెందుతున్నారు.

05/18/2019 - 01:38

ఇతర పార్టీల బలాలను, బలహీనతలను అందిపుచ్చుకోవడంలో అందెవేసిన చేయి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. తెలంగాణ రాష్ట్ర సాధనలోను, శాసనసభ ‘ముందస్తు’ ఎన్నికల్లోను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొన్న ఆయన ఇపుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. థర్డ్‌ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్, మూడవ ఫ్రంట్ తదితర పేర్లతో- భాజపా రహిత, కాంగ్రెస్సేతర పక్షాలను ఏకం చేసే నాయకుడిగా తన ప్రయత్నాలను ఆయన ఇప్పటికే ప్రారంభించారు.

05/16/2019 - 02:06

గతంలో తెలుగు రాష్ట్రాలలో ‘బెట్టింగ్’ అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పర్వదినాలలో జరిగే కోడి పందేలు మాత్రమే. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల్లో ఎక్కడ వున్నా ఆరోజు సొంత గ్రామాలకు చేరుకోవడం, బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ఇలాంటి పందేలలో సరదాగా పాల్గొనడం ఆనవాయితీ. కాలక్రమేణా ఎన్నో మార్పులు జరిగాయి. పట్టణాలలో నివసించేవారిలో కొందరు వివిధ ఆటలలో పందెం కట్టేవారు.

05/15/2019 - 01:56

ఒకప్పుడు పాళి భాషలో బౌద్ధ సాహిత్యం వెలువడింది. బుద్ధుడు తన ప్రవచనాలను ఆ భాషలోనే చేశాడని చెబుతారు. అప్పటికి బహుళ ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత భాషపై చిన్నచూపు ప్రదర్శించారు. వైదిక ధర్మానికి, సంస్కృత భాషకు ‘ప్రచ్ఛన్నం’గా బౌద్ధ ధర్మాన్ని, పాళి భాషను పీఠంపైకి తీసుకొచ్చారు.

05/12/2019 - 01:42

అమ్మ గురించి ఎంత చెప్పినా
ఎంత చేసినా తక్కువే
అమ్మ కంటికి మనం
చాలా అందంగా కనిపిస్తాం
అమ్మ తన బిడ్డల కోసం నిత్యం పోరాడుతూ
శ్రమిస్తూనే ఉంటుంది

ఈ ప్రపంచంలో పేదవాడు ఎవడు అంటే-
అమ్మ లేనివాడు అసలైన పేదవాడు
ఎంత ధనం ఉన్నా కొనలేనిది
అమ్మప్రేమ ఒక్కటే
అమ్మ ప్రేమను పొందినవాడే
నిజమైన ధనవంతుడు

05/12/2019 - 01:38

మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం రోగులకు వ్యవస్థీకృత వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అర్హత లేని వైద్యులను ఆశ్రయించడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ‘అందరికీ ఆరోగ్యం’ అనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వ నిధులతో అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించడానికి మూడంచెల ఆరోగ్య సేవా కేంద్రాలను నెలకొల్పారు.

05/11/2019 - 00:15

సాంకేతికత అండతో మన దేశం వివిధ రంగాల్లో ఇప్పటికే తిరుగులేని అభివృద్ధిని సాధించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణల వల్ల నేడు అగ్రరాజ్యాల సరసన భారత్ నిలిచింది. 1998 మే 11వ తేదీన భారత ప్రభుత్వం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వద్ద అణుబాంబు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ కారణంగా 1999 నుంచి ప్రతి సంవత్సరం మే 11న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ పాటించడం ఆనవాయితీగా మారింది.

05/08/2019 - 01:32

మానవతా విలువల్ని పెంపొందిస్తూ, శాంతి సందేశం అందించే అతి పెద్ద సేవా సంస్థ ‘రెడ్‌క్రాస్’. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు ఆసరాగా ఉండేందుకు ఏర్పాటైన సంస్థే ‘రెడ్‌క్రాస్ సొసైటీ’. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవాసంస్థల్లో అతి పెద్దది. ఈ సంస్థను జీన్‌హెన్రీ డ్యూనాంట్ స్థాపించారు.

05/07/2019 - 01:24

దేశవ్యాప్తంగా ‘తెల్ల బంగారం’ (పత్తి) పంట విస్తీర్ణం పెరుగుతోంది. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కారణమైన ఈ పంట ఇలా విస్తరించటం వ్యవసాయ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక పక్క దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులున్నా ఈ ఏడాది పత్తి దిగుబడుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రథమ స్థానం పొందనుంది.

05/05/2019 - 01:53

(ముదురుభాష, మురికి భాష; సంస్కార భాష కాదు, వికార భాష)
*
ఒక భాష ఉద్భవిస్తోంది, నయాభాష, నయాదౌర్ భాష
ఇంకా.. మరింకా ఎదుగుతోందది, దినదినం.. ప్రతిదినం
రణరంగ భాషలాంటి రాజకీయ భాష
రక్షణ భాష కాదు, భక్షణ భాష,
ఒక కొత్త నిఘంటువుకది పునాది వేస్తోంది,
ఒక ‘అనాది’ భాషనది తిరగ తోడుతోంది.

Pages