S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/29/2019 - 22:48

రాజకీయ నాయకులకు ప్రజలంటే చులకన భావం (ఒక్క ఎన్నికల సమయంలో తప్ప) సహజం. ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనేది చాలామంది నాయకుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను ఆ తర్వాత తమతోపాటు జనం సైతం మరచిపోతారనేది నేతల గట్టి నమ్మకం. అందువల్లనే మన నాయకులు ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

03/29/2019 - 05:17

తాము వ్యవసాయం చేస్తున్నామని రైతులు గర్వంగా చెప్పుకొనే రోజులుపోయి చాలా కాలమైంది. సేద్యంతో జీవనం సాగిస్తున్నానని చెప్పుకోవటానికి కర్షకులు సిగ్గుపడే పరిస్థితి ఎదురైంది. అయిదు ఎకరాల భూమి ఉన్న రైతు కుమారునికి కంటే నెలకు 5వేలు సంపాదించే బడుగు జీవుల పిల్లలకు పెళ్ళిళ్ళు కుదురుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

03/27/2019 - 04:11

కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ‘కలియుగం’ ప్రారంభమైందని విజ్ఞులు అంటారు. ఒక్కో యుగానికి ఒక్కో లక్షణముంటుందన్న భావన ఉంది. త్రేతాయుగ లక్షణాలు ద్వాపరంలో కనిపించవు, ద్వాపర యుగ లక్షణాలు కలియుగంలో కనిపించవన్నది జ్ఞాన విశారదుల మాట. కలియుగంలో సత్యం, ధర్మం, నిజం, వాస్తవాలకు ‘గ్రహణం’ పడుతుందన్న మాట విస్తృత ప్రచారంలో ఉంది.

03/24/2019 - 02:02

భారతదేశం దాదాపు వేయి సంవత్సరాలు విదేశీయులైన విజాతీయుల పాలనలో మ్రగ్గినది. సామాజికంగా, సంస్కృతిపరంగా, ఆధ్యాత్మిక పరంగా, భాషాపరంగా, సాహిత్యపరంగా సనాతనమైన భారతీయతను విదేశీ పాలకులు అస్తవ్యస్తం చేసినారు. అఖండ భారతంలోని అనేక భూభాగాలు విజాతీయ భూభాగాలుగా మారినవి. మిగిలిన ఖండిత భారతదేశం 1947 ఆగస్టు 15న మత ప్రాతిపదికపై పాకిస్తాన్, హిందూస్తాన్‌లుగా రెండు ముక్కలుగా చీల్చబడినది.

03/22/2019 - 23:07

భారతదేశ చరిత్రలో మార్చి 23వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్ లోహియా 1910 మార్చి 23న జన్మించారు. విప్లవవీరులైన సర్దార్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరితీయబడిన రోజు 1931 మార్చి 23. ప్రత్యేక పాకిస్తాన్ కావాలని 1940లో తీర్మానించిన రోజు మార్చి 23. పాకిస్థాన్ ఇస్లామిక్ ప్రజాస్వామ్యమని 1956లో తీర్మానం చేసి అమలులోకి తెచ్చుకున్న రోజు మార్చి 23.

03/21/2019 - 01:02

ప్రపంచంలోని ప్రాణికోటికి మూలాధారం నీరు. నిజానికి మానవ జాతి మనుగడ, అభివృద్ధి, నాగరికత నీటితోనే ముడివడి ఉంది. పదివేల యేండ్ల క్రితం ఆవిర్భవించిన వ్యవసాయక సమాజాలు, నాగరిక సమాజాలుగా ఆవిర్భవించిన పారిశ్రామిక సమాజాలు నీటి లభ్యతపైనే ఆధారపడి కొనసాగాయి. అందుకే నీటిని పొదుపుగా వాడుకోవాలని శాస్తవ్రేత్తలు చెపుతుంటారు. కానీ నేటి కాలంలో నీటి కొరత సమస్య శరవేగంగా తరుముకొస్తుంది.

03/17/2019 - 02:05

భారతీయ జనసంఘ్ 1952లో పుట్టింది. శ్యామప్రసాద్ ముఖర్జీ పార్టీ అధ్యక్షుడు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండే పార్టీలు ఉండేవి. అందులో ఒకటి భూస్వాముల కాంగ్రెసు పార్టీ. 1955లో మొదటిసారి భారతీయ జనసంఘ్ ఐదు సీట్లల్లో పోటీచేసి ఐదు చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది. ఇది 2019వ సంవత్సరం. కాలగర్భంలో డెబ్బది సంవత్సరాలు గడిచిపోయాయి. ఐనా పార్టీ పరిస్థితిలో మార్పురాలేదు.

03/17/2019 - 02:02

వచ్చే రెండు మాసాలలో విడతలవారీగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ నెట్‌వర్క్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో వస్తున్న పలు విప్లవాత్మకమైన మార్పులను వివిధ రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు తమ మనుగడకై ఉపయోగించుకుంటూ సామాన్య మానవునికి అందుబాటులోకి వెళ్తున్నాయి.

03/15/2019 - 21:38

అమరజీవి బలిదానం పొట్టి శ్రీరాములు పోరాటగాథ’ అమూల్య చారిత్రక అంశాల సంకలనాన్ని డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ప్రచురించారు. ఇందులో చరిత్రలో మరుగున పడివున్న ఎందరో మేధావుల వ్యాసాలను, సందేశాలను, అభిప్రాయాలను వెలికితేవడంలో సంపాదకుడు కృతకృత్యుడయ్యాడనే చెప్పవచ్చు.

03/15/2019 - 21:30

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జితిన్‌దాస్ తరువాత అత్యంత సుదీర్ఘ కాలము ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన ఘనత అమరజీవి పొట్టిశ్రీరాములుకే దక్కింది. స్వాతంత్య్రోద్యమము కాలం నాడే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి పునాదులేర్పడ్డాయి. 1912లోనే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ప్రస్తావన వచ్చింది.

Pages