S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/24/2019 - 23:11

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ప్రశ్న వేయగానే సమాధానమిచ్చే విద్యార్థిని తెలివైన వాడిగా పరిగణిస్తారు. ప్రశ్నవేయగానే కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. పూర్వజ్ఞానంలో దాన్ని కలుపుకుంటారు. అదొక లెక్కయితే పాత లెక్కలను జ్ఞాపకం చేసుకుంటారు. అది వృథా శ్రమ కాదు. ఇచ్చిన లెక్కకు, అడిగిన ప్రశ్నకు ఏమైనా పోలికలున్నాయా? అని పరిశోధిస్తూ ఉంటారు. ఆ పరిశోధనలో సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తుంటారు.

01/23/2019 - 01:40

ఇప్పుడు ప్రపంచాన్ని విప్లవీకరిస్తున్న పరిజ్ఞానం ‘కృత్రిమ మేధ’ (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్సీ-ఏఐ) అని చెప్పాలి. అన్ని రంగాలలోకి దీన్ని తీసుకెళ్ళేందుకు, వివిధ సంస్థలకు, వ్యక్తులకు శిక్షణ ఇచ్చేందుకుగాను ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతోంది.

01/20/2019 - 02:25

‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అని ఒకప్పుడు తల్లులు తమ పిల్లల కోసం పిలిచేవారు. ఇప్పుడు ఆ చందమామే ఆసక్తిగల వారందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తోంది. కాలగతిలో ఇది గొప్ప పరిణామం. ఆ ‘పిలుపు’ను అందుకుని ఇటీవల చైనా చాంగే-4 పేరుతో ల్యాండర్‌ను, రోవర్‌ను అక్కడికి పంపింది. చందమామకు మరోపక్క గల స్థితిగతులపై పరిశోధనలు చేసేందుకు చైనా సన్నద్ధమైంది.

01/13/2019 - 01:38

హైదరాబాద్‌కు చెందిద సంహిత అనే అమ్మాయి 16 సంవత్సరాలకే బీటెక్ పూర్తిచేసి ఇటీవల ‘క్యాట్’ పరీక్షలో మంచి స్కోర్ సాధించి వార్తల్లోకెక్కింది. ఈ అమ్మాయి పదేళ్ళకే పదవ తరగతి ప్యాసయింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్‌తో చిన్నప్పుడే కలసి ముచ్చటించింది. తనకున్న జ్ఞాపకశక్తిని నమ్ముకుని ముందుకు దూసుకుపోతోంది. భవిష్యత్‌లో గొప్ప ఆర్థికవేత్త కావాలన్నదే తన లక్ష్యమని సంహిత అంటోంది.

01/11/2019 - 21:42

ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం నిజంగానే ఒక విప్లవాన్ని సృష్టించింది. పాశ్చాత్య దేశాలలో జాతీయ భావాలు బలపడి జాతీయ రాజ్యాలు ఏర్పడుతున్న సమయమది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ చైతన్యం బలం పుంజుకుంటున్న సమయమది. ఆ సమయంలో ప్రపంచంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు జన్మించారు.. 1818లో కారల్ మార్క్స్ జన్మించాడు. భారత్‌లో 1863లో వివేకానందుడిగా ప్రసిద్ధి పొందిన నరేంద్రుడు జన్మించాడు.

01/09/2019 - 22:48

‘ప్రపంచ హిందూ కాంగ్రెస్’ మూడవ సమ్మేళనం 2022లో థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్‌లో జరగనుంది. ఈ సంస్థ తొలి సదస్సు నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సదస్సు అమెరికాలోని చికాగో నగరంలో 2018 సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ‘సమష్టిగా ఆలోచించు, సాహసోపేతంగా లక్ష్యాన్ని సాధించు’ అనే ఆశయంతో ఈ సదస్సు జరిగింది.

01/09/2019 - 02:42

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి బాల్యం బలవుతోందని తరచూ వార్తలు వెలువడుతున్నాయి. 14-15 సంవత్సరాల పిల్లలను మతోన్మాద ఉగ్రవాదులు ఆకర్షిస్తూ వారిని పావులుగా వాడుకుంటున్నారు. భద్రతా బలగాలతో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో దారితప్పిన ఈ పిల్లలు సైతం మరణించడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

01/06/2019 - 05:43

పాతికేళ్లకో కొత్తతరం తమ సత్తా చాటుతుంది. నూతన ఆలోచనలతో ప్రపంచాన్ని తమతో తీసుకెళుతోంది. తరాల మధ్య అనేక అంశాలలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వందేళ్ల క్రితపు ‘డైనమిక్స్’ అంతే శక్తిమంతంగా పనిచేస్తాయని అనుకోవడం అమాయకత్వం. ఈ ప్రాథమిక సత్యం జీవితంలోని అన్ని పార్శ్వాలకు అన్వయమవుతుంది. దీన్ని విస్మరించి పాత పద్ధతులను అనుసరిస్తే ప్రాసంగికతను కోల్పోవడం తప్ప ఇంకేమీ జరగదు.

01/04/2019 - 21:50

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు నగారా మోగింది. అనాదిగా వర్గ రాజకీయాలతో ముడిపడినందున ఒక్కసారిగా పల్లెల్లో రాజకీయ పరిస్థితి మారిపోతోంది. ఎన్నికలకు తెర లేవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా వేడి పుట్టించే వాతావరణం ఏర్పడిందని పేర్కొనవచ్చు.

01/02/2019 - 01:42

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఎన్నో చట్టాలను, బిల్లులను తీసుకువచ్చినా- పటిష్టమైన బిల్లు ఏదైనా ఉందంటే అది వినియోగదారుల పరిరక్షణ బిల్లు మాత్రమే. స్పష్టమైన విధి విధానాలతో పాటు తీవ్ర శిక్షలతో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్రం పూనుకుంది. 1962 లోనే అమెరికా ప్రభుత్వం వినియోగదారుల హక్కుల రక్షణకు నడుం బిగించగా, భారత్ ఆ స్థాయిలో చట్టాలను తీసుకురావడానికి 56 ఏళ్లు పట్టింది.

Pages