S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/28/2019 - 19:49

దశముదాటి, శతముదాటి, శతసహస్రమును దాటెను
ఆపైనను ఆగెనేమి? పెరుగుసాగె నింకను.

ఆకాశమ్మంట శిరము- శివుని కంటి మంటలంట
శ్రీకుచ సౌరభము సోక- బ్రహ్మఘోష విన్పింపను.

సూర్యచంద్రులను దాటెను. చుక్కలనే దాటెను
పెరుగుటొక్కటే యెరిగిన పెరుమాళ్ళన పెరిగెను.

ఆగ్రహమున ఆ గ్రహముల మ్రింగిన పెనుగ్రహమట్టుల
గజమట్టుల గగనమ్ముల మ్రింగె వెలగ పండ్లట్టుల.

06/28/2019 - 19:47

విదర్భ దేశము.
ముఖ్యపట్టణం ‘‘కుండిన నగరము’’. అయినా విదర్భ అనే పిలుస్తారు.
నిషధ దేశాన్ని ‘నలమహారాజు’పాలిస్తున్న సమయంలో విదర్భ దేశాన్ని ‘‘్భమమహారాజు’’ పాలిస్తున్నాడు (్భముడు)
ఆ భీమమహారాజు కూడా గొప్ప పరాక్రమవంతుడు. సద్గుణ సంపన్నుడు. సంతానం కావాలని కోరిక కలవాడు. అయినా సంతానం కలుగలేదు.

06/27/2019 - 22:12

ఆ హంస నడకకు, అందానికి ముగ్ధుడై నలుడు ఆ హంసను పట్టుకొన ప్రయత్నించాడు. ఆ హంస కావాలనే ‘నలుని’చేతికి చిక్కింది.
(పరమశివుడే నల దమయంతులను కూర్చుటకొరకై హంస రూపంలో వచ్చాడని మహాకవి పుంగవుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు కొండొకచోట వ్రాసినారు.)

06/27/2019 - 22:10

పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం
*
డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*

06/27/2019 - 22:09

అనుమాటలు స్వష్టాస్వష్టమ్ముగ విననాయెను
అపుడు రాజు గురువుతోడ బదులిట్టుల పలికెను.

‘‘అయిననేమి? కానిండు! ఐనను సమ్మతమే!
ముల్లోకములైననేమి? ముదమున నిచ్చేను.

వాని చేయి క్రిందగుచును- వాడే నన్నడిగెను
వానికి దానమ్మిచ్చుట- నాకది వరవౌను.’’

అనుచు దానమిచ్చుటకే నిర్ణయించె రేడు!
మొండిఘటము వాడు! మొండి ఘటము వీడడు!

06/26/2019 - 22:13

‘‘ఈ మాత్రమ్మిచ్చు కొరకునింకను యోచనలే?
మూడడుగులనే యడిగితి- ముల్లోకములడిగితే?

తలనడిగిన యిచ్చువాడ తలపించుక వలదు!
బలికైనను సమ్మతమే - బలియే నా పేరు!

మీ స్వాముల దయతోడనె నే స్వామిని గాదే?
తలలోతుల లోతలలో- తల మీరే కాదే?

నాకేటికి వగవు స్వామి? అర్పింపగ మీకు మీది?
నేనను భావమ్ము తక్క- నాదన్నది ఏమున్నది?’’

06/26/2019 - 22:12

అప్పుడున్న జన పదాలలో నల మహారాజుఒక అక్షౌహిణి సేన గలిగి ఆనాటి మహారాజులలో ఇంద్రునివలె వెలుగొందాడు. తన పరాక్రమంచేత రాజులందరినీ జయించి సార్వభౌముడై ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు.
సూర్యతేజస్వి అయిన నలుడు వేదవిదుడైన బ్రాహ్మణ్యమూర్తిగా ఉండేవాడు. అయితే నలుడు పాచికలాడటంలో అపరిమితమైన ప్రీతికలవాడు.

06/26/2019 - 22:10

‘‘మేలుకో! ఉదయించు, నీ లక్ష్యం నీవు చేరేవరకు విశ్రమించకు.’’ అని స్వామి శ్రీ వివేకానందులు చెప్పేవారు. ఎందుకు ఇలా చెప్పారని ఆలోచిస్తే మనలో చాలామంది జడత్వానికి అంటే అకర్మకు అలవాటు పడ్డారు. జీవితానికి ఏ లక్ష్యం లేకుండానే యాంత్రికంగా ధనార్జనే ధ్యేయంగా పాటుపడుతూ బుద్ధిని అచేతనావస్థలోనే ఉంచేశారు..

06/25/2019 - 22:15

తన ఆసనమిచ్చి తాను తలవంచుకు నిలిచెను
వటువు ఎదుట ఆకసమ్మె తలవంచుకు నిలిచెననగ.

‘‘ఏమియాజ్ఞ యోమహాత్మ? ఏమి సేయగలను?
భూదానమ? గోదానమ? స్వర్ణతులాభారమ?

ఏమి స్వీకరింతురయ్య? ఏమి కోరుకొందురొ?
పుడమినొక్క పుష్పమట్లు చేత నుంచమందురొ?’’

అనగా విని వటుడు నవ్వె- నవ్వెనంతరిక్షము
ఆ నవ్వుల కెరటాలను మునిగి తేలె విశ్వము

06/25/2019 - 22:14

చోళ, పుళింద, పుండ్ర, పాండ్య, అభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ధ్రవిళ(డ), దశార్ణ, కర్ణాటక, గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, మహుదాన, కిరాట, కేకయ, అశ్మంతక, కాశ్మీర, గాంధార, కాంభోజ,కేరళ, మాళవ, నేపాళ, ఘూర్జర, కుంతల, అవంతి, కామరూప, నిషధ మరియు కళింగ మొదలగు జనపదాలతో వర్థిల్లింది.

Pages