S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/12/2019 - 22:25

అలా, పైకీ, క్రిందికీ, ప్రక్కలకీ, మూలమూలలకీ, తాను చూడగలగినంత మేర తన కళ్ళని పయనింపజేశాడు. తన దృష్టిని ప్రసరింపజేశాడు. అన్నీ యజ్ఞ వాటికలే! యజ్ఞాలే! తపో దీక్షలే!
అతని ఆశ్చర్యానికి అంతే లేదు.

05/12/2019 - 22:15

శ్రీచక్రము, మానవ శరీరం
*
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
ఇటీవలి కాలంలో కొంత మంది సాధకులు చేసిన ప్రార్థనలను పరిశీలిద్దాం. శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతిముని (నాయనగా ప్రసిద్ధులు) శ్రీ మహాగణపతినిట్లు ప్రార్థించారు.
శ్లో॥ హస్తిముఖ యాచే గాఢరసభక్త్యా

05/10/2019 - 19:12

అప్పుడు క్రిందకు చూశాడు. దూరంగా ఒంటినిండా ప్రకృతి కోకని ధరించి, గాలికి కదలాడుతోన్న సాగర తరంగాల కుచ్చిళ్ళను సవరించుకొంటూ, తల నిండా మేఘాల మేలిముసుగును కప్పుకొన్న ధరిత్రి తనదారిని తాను తలవంచుకు వెళ్తోంది.
ఓహ్! ఏమందం?... కళ్ళు చెదిరే అందం!... ఎవరు సృష్టించారో గానీ, విశ్వ సౌందర్యమంతా ఒకేఒక్కచోట, ఆమెలోనే కేంద్రీకృతమైనట్లుగా ఉంది!
ఓ క్షణకాలం తన చూపుల్ని మరల్చుకోలేకపోయాడు.

05/09/2019 - 19:32

మృగములలో మృగములట్లు- సంచరించు చుంటిమి

పామువోలె పడగ విప్పి బాలుని కాటేసినావు
క్రూర మృగమ్ముల పోలిక క్రూరత్వం చూపినావు

మా పుత్రుని తోడ మేము మరణించిన యట్లు గాదె?
బ్రతుకే మరణవ్మౌనిక- చావే శరణవ్మౌ?

మా పుత్త్రుని బాపినావు- నీ పుత్త్రుల బాసెదవు
మా వలెనే అలమటించి- మా వలెనే చత్తువు

05/08/2019 - 19:46

ఆ శవమును దీసికొంచు- ఆ వృద్ధుల కడకేగెను
వౌనముగా రోదించుచు- శుశ్రూషల జేసెను

విషయమరసి వారలపుడు గొల్లుమంచు నేడ్చిరి
వెక్కివెక్కి వారితోడ దిక్కులు రోదించెను

‘‘గడ్డిపోచ నోట గఱచి- నీట నీదుచుంటిమి
గడ్డిపోచ లాగికొంచు కన్నీటను ముంచితి

గ్రుడ్డి దీపముల పోలిక ‘రెపరెప’మనుచుంటిమి
పెనుతుఫానువై వీచితి- ఇంకెక్కడి వెలుగు’’?

05/07/2019 - 19:35

నేను కాలిపోవునటుల నే బొదిగ మారునటుల
నా పాపం మాయునటుల శపియించుడి నన్ను’’

అని చేతుల జోడించెను
అశ్రువులను నించెను

‘‘విలపించకుమో రాజా! విలపించుకుమోరుూ!
విధి రాతను తప్పించగ ఏ విధి సాధ్యమ్ము?

శాపమాయె నా బ్రతుకే- శాపమిత్తు నెటుల?
బ్రహ్మ పాతకమ్ము లేదు- బాపడనే గాను

కాని యొక్కటే మిక్కిలి కలవరపరచును నన్ను
శరఘాతము కన్న మిన్న బాధించును నన్ను

05/06/2019 - 18:57

ఇదియయోధ్యయని వింటిమి!
యోధుల నెలవని వింటిమి!
కోసల రాజేంద్రుడిచట దశరథుడని వింటిమి!

వారిని దర్శించుకొనగ నిచట విడిచి చేసితిమి
అదిగో! ఆ మ్రాని క్రింద రాత్రి కునుకు దీసితిమి.

అర్థరాత్రి దాహమంచు అలమటించినారు వారు
అంత నేను ముంతగొంచు అరుదెంచితి నిటకు

ముంచినానొ లేదొ ముంత! వచ్చెనొక్క శరమ్మంత!
వచ్చెనొ లేదో గుండెను జొచ్చెను నొప్పించెనంత!

05/06/2019 - 18:53

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాసాలలో వైశాఖ మాసం ప్రశస్తమైనది. వైశాఖమాసంలోని శుక్లపక్షంలో వచ్చే మూడవ రోజును ‘అక్షయ తృతీయ’గా పిలుస్తారు. అక్షయ అంటే తరిగిపోనిది అని అర్థం.

05/05/2019 - 23:10

హిందువుల పర్వదినాలలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించకున్నది అక్షయ తృతీయ. ‘‘వైశాఖే మాసి రాజేంద్ర శుక్ల పక్షే తృతీయకా; అక్షయాసాతిథి: ప్రోక్తా కృత్తికా రోహిణీయుతా’’. అక్షయ తృతీయ సోమవారం నాడు కాని, బుధవారం నాడు కాని అయితే పవిత్రమైనదని, కృత్తికా రోహిణీ నక్షత్రములతో కూడిన పర్వం అతి శ్రేష్ఠమని శాస్త్ర ప్రమాణాలు. వైశాఖ శుక్ల తృతీయ అక్షయ తృతీయ అని, ఈ పర్వం పూర్వాహ్ణ వ్యాపిని అనీ వ్రత రాజము చెపుతున్నది.

05/05/2019 - 23:09

వచ్చెనంత నీటిలోన ‘బుడబుడ’మని ధ్వనులును
వచ్చెనంచు మృగమొక్కటి ఎత్తె రాజు ధనువును.

‘‘హరిహరి! మాధవ!’’
అనియెడి మాటలంత వినబడెను
హరివోలెను లేచె నృపుడు హరిణమట్లు దూకెను

ధ్వని వచ్చిన దిసలో బడి ఉరికెనంత నృపుడును
ఆ దృశ్యము చూడపోసె- ముచ్చెమటలు మేనను

మృగమెక్కడ? మనుజుండే! నిండు వనండు
షోడశ కళలను దేలెడు షోడశప్రాయుండు

Pages