S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/10/2018 - 19:46

గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ పాటకు విరామం లేదు. పాటే ఆ ఇంట తొలి ప్రాధాన్యం. శ్రాస్తీయ సంగీతానికి చిరునామాగా మారిన ఆ ఇల్లే కె. కోదండపాణి గానామృతంతో ఓలలాడిన సంగీత కళానిధి. స్వర రాగ ఝురి వలే అఖండంగా.. అనంతంగా సాగే ఆ స్వర ధారాలను ఈనాటకీ తెలుగు ప్రజలు దోసిలి పడుతున్నారు.

01/09/2018 - 20:17

కూచిపూడికి అంకితమైన నాట్యగురువు. దశాబ్దాలుగా కళకు సేవ చేస్తున్న నృత్యరత్నం. ఒకవైపు ప్రదర్శనలిస్తూ, ఇంకొకవైపు శిష్యులు, ప్రశిష్యులను తీర్చిదిద్దిన గొప్ప కళాకారిణి. తల్లిగా, గృహిణిగా, గురువుగా, నర్తకిగా, పరిశోధకురాలిగా, రచయిత్రిగా ఎన్నో బాధ్యతలు అవలీలగా నిర్వహిస్తున్నారు. కళలకు సేవ చేసే కినె్నర రఘురాం ఆమె జీవిత భాగస్వామి. భార్యాభర్తలిద్దరూ కళకే అంకితమైయ్యారు.

01/06/2018 - 19:23

సంక్రాంతి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. చిన్న పిల్లల నుంచి పెద్దలవరకూ గాలిపటాలు ఎగరేస్తూ మురిసిపోతుంటారు. గాలిపటానే్న ‘పతంగి’ అని అంటారు. గాలిపటాలను స్వేచ్ఛాయుత వాతావరణ జీవితానికి సూచికగా అన్ని వయసులవారు ఆనందోత్సాహాల మధ్య ఎగురవేస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతిక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇమిడి వుంటాయి.

01/05/2018 - 19:22

ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుంది’ అనేది నానుడి. కానీ నేడు ప్రతి మహిళ అధికారం వెనుక పురుషుడి పెత్తనం ప్రస్ఫుటిస్తోంది. మహిళా సాధికారత పురుషుడికి వరంగా మారింది. ‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, స్వతంత్రంగా ఎదగాలి, నిర్ణయాత్మకంగా తయారుకావాలి’.. అంటూనే మహిళల రాజ్యాంగబద్ధ పదవులను అడ్డం పెట్టుకుని పురుషులే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మహిళల నిర్వహణ సామర్థ్యం మరుగున పడుతోంది.

01/04/2018 - 20:26

అది లాల్ బహదూర్ శాస్ర్తీ దేశ ప్రధానిగా పాలిస్తున్న రోజులు. భోపాల్‌లో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లారు. ఓ ఉర్దూకవి ఆయనను చూసి మీ వేషం (్ధవతి, కుర్తా) ప్రస్తుత ప్రధాన మంత్రి హోదాకు తగ్గట్లుగా లేదు. ప్రతిరోజూ ఎంతోమంది విదేశీయులను మీరు కలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా లేదు అని అన్నారు. దానికి ఆ నిరాడంబర ప్రధాని ఇలా అన్నారు. ‘‘చేసే పనులను బట్టి ఓ వ్యక్తి శీలాన్ని నిర్ణయించాలి.

01/03/2018 - 20:13

చరిత్రలో కనుమరుగైన ప్రదేశాలు, కట్టడాలు మన ముందు బొమ్మల రూపంలో ఆవిష్కృతమైతే ఎలా ఉంటుంది. ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. ఆనాటి జీవన విధానం ఇలా ఉండేదా అని కళ్లు ఇంత చేసుకుని చూస్తాం. కనుమరుగవుతున్న చారిత్రక ప్రదేశాల ఆనవాళ్లను తన కుంచెలో బంధిస్తున్నారు హేమలత వెంకటరామన్. జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉన్న చరిత్ర ఆనవాళ్లు చెదిరి పోకుండా..

01/02/2018 - 20:26

కళారత్న డా. వనజా ఉదయ్ అత్యుత్తమ నర్తకీమణి. కూచిపూడి, భరతనాట్యం రెండు సంప్రదాయ నృత్యాలు అద్భుతంగా చేయగల కళాజ్యోతి. కొన్ని దశాబ్దాలుగా నాట్యానికే అంకితమైన ఈ నాట్య మయూరి. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, నృత్య శాఖలో పనిచేస్తున్నారు. నర్తకిగా, గురువుగా, తల్లిగా, గృహిణిగా, పరిశోధకురాలిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న లలిత కళాభారతి ఈవిడ.

12/30/2017 - 18:23

ఆశ సహజం. ఆలోచన అవసరం. ఆచరణతో అది సుసాధ్యం. లక్ష్య సాధన మన చేతుల్లోనే ఉంటుంది. మనసుంటే మార్గం అదే దొరుకుతుందనేదేగా నానుడి. మహిళలు నిజంగానే పని రాక్షసులు. అయితే కాంక్షని వీడకుండా పరిశ్రమిస్తే.. లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చు. కాలం కదిలిపోతుంది. ఆగదు. దాంతోపాటే మన జీవన గమనమూ సాగిపోతుంది. 2017 సంవత్సరం వెళ్లిపోతోంది. కొత్త సంవత్సరానికి కొత్తకొత్త ఆలోచనలతో స్వాగతిద్దాం. కష్టాలు అందరికీ ఉంటాయి.

12/28/2017 - 19:40

పదమూడేళ్ల పిల్లాడు ఇంద్ర భవనం వంటి ఇంటిలో కమ్మగా నిద్రపోతున్నాడు. ఆ నిశిరాత్రి తన జీవితంలో పెను విషాదం ముంచుకువస్తుందని తెలియదు. అందుకే ఆ పసిమనసు ఆదమరచి హాయిగా నిద్రపోతుంది. ఇంతలో ఆ ఇంటిలో పనిచేసే వృద్ధురాలైన పనిమనిషి వచ్చి బాబూ! అంటూ తట్టిలేపింది. నిద్రలేచిన ఆ పిల్లాడిని పట్టుకుని భోరున విలపించింది.

12/27/2017 - 19:36

ఆమెకు చిన్నప్పటి నుంచి వీణ అంటే ప్రాణం. మూడేళ్ల వయసులోనే వీణ తంత్రులను మీటితే కలిగిన అనుభూతే ఆమెను సంగీత సరస్వతిగా తీర్చిదిద్దింది. సంగీతంలో తొలి అడుగులు తల్లి వద్ద వేసినా.. సంగీత శిక్షణలో రాటుదేలింది మాత్రం అత్త పద్మావతి అనంతగోపాలన్ వద్దే. జాతీయ వాయిద్య పరికరమైన సరస్వతి వీణను వాయిద్యంగా చేసుకుని అంతర్జాతీయ వేదికలపై ఆమె చేసే కచ్చేరీలు శాస్ర్తియ సంగీతానికి జీవం పోస్తాయి.

Pages