S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/14/2019 - 22:12

ఒకడు
మైళ్ళ పొడుగునా
భుజం మీదో
సైకిల్ మీదో
తల్లి శవాన్నో, తండ్రి శవాన్నో
మోసుకెళ్తాడు

మరొకడు
చేతులూ కాళ్ళూ విరిచి గోనెసంచిలో
మూటకట్టుకొని పరుగెడతాడు

10/14/2019 - 22:10

దుఃఖపు మూట చిట్లి
ఆనందం తెరలు తెరలుగా
గుండె శిఖరం మీద వాలుతుందేమోనని
కనుచూపుల్ని భవిష్యత్ కాలానికి
తగిలించేసి ఎదురుచూస్తున్నా
విషాదం గరళమై ఘనీభవిస్తూ
కనుపాపల మధ్య వేలాడుతోంది
బతుకు నిత్య కన్నీటి దృశ్యమై
అష్టకష్టాల కాన్వాసుపై
వెలసిన రంగులద్దుకుంటోంది
వేదనలు ఆవేదనలు
జన్మజన్మల బంధమన్నట్లు
మనోఫలకంపై

10/14/2019 - 22:08

మహాత్మాగాంధీ మహాభినిష్క్రమణంతోపాటే ఆయన మనుషులందరూ మాయమైపోయినట్లు వర్తమాన రాజకీయ భారతదేశ చిత్రపటాన్ని చూస్తే విచారం కలుగుతుంది. కర్మణా, మనసా, వాచా గాంధీజీని అనుసరించినవారు శ్రీ టి.వి.ఎస్.చలపతిరావు (1911-1979). నిష్కలంకోజ్జ్వల జీవితం వీరిది. గాంధీజీ ఆదర్శాల, ఆశయాల సాచరణ కార్యరూపం శ్రీ టి.వి.ఎస్.దైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, దేశ పునర్నిర్మాణ, సత్యాహింసాచరిత, త్యాగ సంభృతమూర్తిమత్వం.

10/14/2019 - 22:07

కవిత
ఒక ఆదిమ శబ్దం
బహు పాతది
నిషాదుడు ధర్మం తప్పినప్పుడు
శోకం శ్లోకమయ్యంది
తన మాటకు తానే విస్మితుడైతే
ఆ కవికి అది సార్థకత

శబ్దార్థాలు సరే
భావార్థమే కష్టం.
సంగీతాన్ని కన్నది వెదురు కాదు
దానిలో నిండిన ఊపిరి.

10/14/2019 - 22:05

సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి సాహిత్య సాంస్కృతిక సంస్థ కవిసంధ్య ఇచ్చే శిఖామణి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ రచయత్రి ఓల్గా ఎంపికయ్యారు. అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం యానాంలో జరిగే కార్యక్రమంలో ఓల్గాకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కవిసంధ్య కార్యదర్శి దాట్ల దేవదానంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శిఖామణి కవితా సంపుటి ‘యానాం కవితలు’ ఆవిష్కరణ జరుగుతుంది.

10/07/2019 - 00:57

జనం జనం
గుంపులు గుంపులు
వస్తున్నారు
కదిలిపోతున్నారు
నవ్వారు.. ఏడ్చారు
ఏమయంది నిన్నటిదంతా?
ప్రేమించారు.
ఒక్కటనుకున్నాను
రెండని వేరయనప్పుడు
దిగంతాల దుఃఖం
ఆలోచనా తరంగాలు
వేలకి వేలు.. వస్తూ పోతూ
మనసు నిండా జ్ఞాపకాల ముద్రలు
కలలు.. కలలు
తియ్యనివి కమ్మనివి
మరొక్క కొత్త జ్ఞాపకం
నిన్నటిదయపోయంది

10/07/2019 - 00:56

నేనో అక్షరాన్ని
సమాజానికి సమస్యలకు
మధ్య ఊగిపోతుంటాను
సమాజాన్ని బ్రతికించాలని
సమస్యలను చంపాలని

నేనో పదాన్ని
పదవికి పెదవికి మధ్య ఊగిపోతుంటాను
పెదవిలో పదమై నిలవాలని
పదవిలో ప్రగతిబాటై సాగాలని

నేనో వాక్యాన్ని
వేదనకు వాదనకు మధ్య ఊగిపోతుంటాను
వేదనను వెలివేయాలని
వాదనను జయించి
వెలుగుకు వేకువవ్వాలని

10/07/2019 - 00:55

ఇన్ని నాళ్లు దేన్నుంచైతే
తప్పించుకోవాలని చూసానో
అదే ముట్టడించి నన్ను కట్టడి చేస్తుంది

ఇటీవల మా మనుమరాలు
ఏడ్చేడ్చి వాళ్ల అమ్మతో
ఆండ్రాయడ్ ఫోన్ కొనిపిచ్చి
ముసిముసిగా నవ్వుతూ
నాకు కానుకగా ఇచ్చింది

ఎలా వాడాలో తెలువదు
మనుమరాలును ఎంత బతిమిలాడినా
చెప్పదు కాక చెప్పదు
ఇక మొదలైంది నాకు తిప్పలు

10/01/2019 - 22:10

కాలం
పరుగెత్తుతూనే ఉంటుంది
కాలంతోపాటు
కదలిపోవడమే
మనిషి చేయవలసింది
మనిషి అంటేనే
మానవమూర్తి
మానవత్వం పంచుతుంటేనే
మనిషికి కీర్తి

10/01/2019 - 22:09

దేహం గాయపడ్డప్పుడల్లా
కట్టుకట్టిన స్నేహం..!
ఉడుకెత్తిన జ్వరమానికి
చల్లదనాన్నిచ్చిన చేయి-
వేకువ ఉదయానికి
మెలకువనిచ్చిన కదలిక
పేగు కదిలిన చప్పుడుకు
అల్లాడిన హృదయం..!
కళ్ళల్లో తొణకిన స్వప్నాల్ని
జారనీయని దోసిల్ల సోపతి;
రగిలిన బాధల్లో
కరిగిన కాలం కొవ్వొత్తి-
వాలిన మబ్బుల మధ్య
కోరిన దృశ్యాలు అస్పష్టం

Pages