S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2020 - 22:49

కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారానికి చింతకింది శ్రీనివాసరావు (విశాఖపట్నం) నవల ‘బుగతలనాటి చుక్కపల్లి’ ఎంపికయింది. న్యాయ నిర్ణయం చేసిన వారు ఆచార్య గల్లా చలపతి, ఆచార్య యన్. మునిరత్నమ్మ, ఆచార్య కె. దామోదర నాయుడు.

02/17/2020 - 22:48

సీ॥ ‘బావ! ఎప్పుడు వచ్చితీవ’న్న పద్యాన
మీరె జీవించి యున్నారుగాదె!
‘మనమ! వద్దిక నాదు మాటను వినుమ’న్న
సూక్తిలో మీరొప్పుచుంద్రుగాదె!
‘నేనెవచ్చెదను నేనే వత్తున’ను చమ
త్క్రియ మీకు తప్ప నేరికి వశంబు?
‘గణచతుర్థి దినాన ఫణి చతుర్థి’ సమస్య
చాకచక్యపుఁ బూర్తి మీకె అగును,
ఏ యమావాస్య తెలుగులో నెఱుగనట్టి
సాహితీ కౌముదిని పంచఁజాలు మిమ్ము

02/10/2020 - 23:48

ఒక బాలుడు
నల్ల మట్టి తెచ్చి
నీళ్ళతో ముద్దచేసి
బొమ్మచేశాడు
తల, మెడ, బొజ్జ
కాళ్ళూ, చేతులూ అన్నీ పెట్టాడు
ఇదే నా కవిత్వం- అన్నాడు కవి

02/10/2020 - 23:46

ప్రజాగొంతుకై నిలిచినోడి మీదికి విసిరిన
‘దేశద్రోహమనే బిరుదాస్త్రం’
అతడు గుండెనిండా
నింపుకున్న నిఖార్సైన
మార్క్సిజం కవచాన్ని ఛేదించలేకపోతుంది

ఖాకీల సంకెళ్ళు
అతని గుండె ధైర్యాన్ని తాకలేకున్నై
మొఖంపై చిరునవ్వుని బంధించలేకున్నై

02/10/2020 - 23:41

అవును కాలాల తరబడి
నేనెప్పడూ భోగవస్తువునే
ననే్నదో విధంగా నీభోగానికి
వాడుకునే బొమ్మనే నేను

ఒకసారి సంగీతమంటావు
మరొకసారి నాట్యమంటావు
ఒకమారు ఇంకో కళ అప్పగిస్తావు
మరోమారు సైరంధ్రని చేస్తావు

నీకు సురాపానమందించి
శయ్యాసుఖాన్ని ధారబోసి
నాలోని ఒక్కోరక్తపుబొట్టూ
నీ సేవలో తరించాలి మరి

02/03/2020 - 22:34

సమయం లేదు
ఇప్పుడెవ్వరికీ సమయం లేదు
అల్లరిచిల్లరగా అల్లుకుపోయిన
తీగల్ని సవరించి
వాటి మొదళ్ళల్లో కాసిన్ని నీళ్ళు పోసే
సమయం లేదు
ఆకాశం కప్పుకున్న
మంచు దుప్పట్టాను
కొద్దిగా ప్రక్కకు జరిపి
నక్షత్రాల కళ్ళలోకి
తనివితీరా చూసే
సమయం లేదు
చెరువు అరుగు మీద
కునుకు తీస్తున్న
చందమామను
చేతులతో కదిపి

02/03/2020 - 22:32

రణగొణ ధ్వనులు ఎక్కడో
నా ప్రక్కనే తవ్వుతున్నట్టు శబ్దం
సరిపోతుందా .. ఇంకా లోతుకెళ్లాలా?
ఏవేవో మంతనాలు
అది గొయ్యి అని అర్థమయ్యేలోపే
నన్నందులో పడేశారు
ఊపిరాడటం లేదు
నా కేకలు నాగొంతులోనే
ఉండిపోతున్నార గింజుకుంటున్నా
అయినా ఆపలేదు మట్టి చల్లటం
సొమ్మసిల్లి పడిపోయా
ఏం జరుగుతుందో? చీకట్లో దిగబడ్డా

01/27/2020 - 23:23

కోకిలను కాకి అంటారే
నరం లేని నరుల నాలుకలకు
నేనంటే ఎంత కపటప్రేమో కదా
కాలుజారితే సంబరంగా సంకలు కొడుతూ
ఎదిగిన క్షణం ఆత్రంగా ఎక్కిరిస్తూ
కోకిలను కాకిలా చిత్రించే
లోకులు పలుకాకులే సుమా
నేనూ ఓ బోడి కాకినేమో కదా!

సమాజమే ఎక్స్‌రే యంత్రమై
లోపాల్ని వేలెత్తి చూపే లోకం
మందివ్వలేని మరమనుషుల కాలం
ఇరుగు పొరుగును నిందించనేలా?

01/27/2020 - 23:22

వేదాలకు పుట్టిలైన ధరణి ఇది
ఓమ్ కారం ప్రతి ధ్వనించిన అవని ఇది
ఉపనిషత్తులకు జన్మనిచ్చినది
ప్రపంచానికి జ్ఞానజ్యోతియైనది
నా భారతావని
మల్లెల లాంటి తెల్లనైన అవనిపై
పరాయి దేశపు కిరాయి సంస్కృతి
శరవేగంతో దూసుకు వచ్చిందా?
కట్టుబొట్టును కాలరాస్తూ మారుస్తుందా?

01/27/2020 - 23:18

తన తల్లి అవస్థ జూసి కాలడి శంకరుడు
నదినే తన ఇంటి గడపని తాకినట్లు జేసె
అంత శక్తి నాకు లేదా గానీ అమ్మా
పుట్టిన రోజున నేను నీ పాదాల మీద ఆన
ఆకలితో, కోపంతో, అవివేకంతో
నీమీద ఆవేశపడినందుకు పశ్చాత్తాప పడుతూ
తల్లిని మించిన దైవం అన్న మాటను
నేడు నేను అనుభవంతో తెలుసుకుంటున్నానమ్మా
నీవు నేడు లేవు గానీ నా జ్ఞాపకాల్లో నీవున్నానమ్మా

Pages