S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

09/26/2019 - 19:05

బ్రహ్మ విష్ణు రుద్రులు శాశ్వతులు కారు. శాశ్వతుడు పరమేశ్వరుడు ఒక్కడే!
నందీశ్వరుడు సనత్కుమారునికే కాక ఒకసారి దేవతలకూ, మరోసారి మార్కండేయ మహర్షికీ కూడా శివపురాణాన్ని వినిపించినట్లు వ్యాస విరచిత శివపురాణం తెలుపుతోంది.
నందీశ్వరుడు సనత్కుమారునికి తెలిపిన ‘అరుణాచల’ లింగోద్భవాన్ని గురించి శౌనకాది మహర్షులకిలా తెలుపసాగాడు సూత మహాశయుడు.
‘‘శౌనకాది పుణ్య మహర్షులారా!

09/25/2019 - 18:53

మహేశ్వరుడు సౌమ్యంగా ‘‘నాయనా! కలవరపడకు. నింపాదిగా సృష్టించు. నీకు మేలు జరుగుతుంది.’’ అని నన్ను ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు.
నేను మళ్ళీ ప్రయత్నం చేసాను. కానీ ఫలితం కనిపించలేదు. అప్పుడు దుఃఖితుడనై ఉన్న నా కనుబొమ్మల మధ్యనుండి మహేశ్వరాంశతో రుద్రుడు ఉద్భవించాడు. ఆ రూపం ‘అర్ధనారీశ్వర’ రూపం. తన వామాంకాన ఉపస్థితయై ఉన్న ప్రకృతి స్వరూపిణిని వేరు చేసిన రుద్రుడు,

09/24/2019 - 19:11

మన ఇరువురికీ బేధము లేదు. బ్రహ్మదేవా! ముందు ముందు నీ వదనం నుండి నా అంశతో రుద్రుడు ప్రభవిస్తాడు. లోక సంహార నిర్వహణకై నేనే రుద్రుడిగా ప్రకటితవౌతాను కనుక అతను నేనే! గుణాల రీత్యా బ్రహ్మవైన నీవు లోపలా, వెలుపలా కూడా రజోగుణము కలిగి వుంటావు. రుద్రుడు అంతర్గతంగా సత్వ గుణం కలిగిన వాడుగానూ అయితే తన లయ అనే కృత్య నిర్వహణకై అతడు బహిర్గతంగా తమోగుణుడిగానూ అగుపిస్తాడు.

09/23/2019 - 18:59

అకారము సృష్టికర్త స్వరూపము, ఉకారము స్థితి కర్త స్వరూపము కాగా, మ కారము నిత్య అనుగ్రహ కర్త స్వరూపము. అనగా నారదా! సృష్టికర్తనైన నేను ‘అ’కార బీజ రూపుడను. నా తండ్రి ‘ఉ’ కార బీజ స్వరూప యోని రూపుడు. మా ఇరువురికీ స్వామి అయిన ఈశ్వరుడు బీజకము. అనగా బీజ, యోనులను తన ఇచ్ఛాశక్తితో సృజించిన వాడు. అనగా అకార రూప బీజమును, ‘ఉ’ కార రూప యోని లోనుండి ఉద్భవింపజేసిన మ కార రూప బీజకమైన ఈశ్వరుడు ఓం కార స్వరూపుడు.

09/22/2019 - 22:18

నీ తండ్రిని నీవు ఆశ్రయించి, వేదజ్ఞానం పొంది, సృష్టి కార్యం ప్రారంభించు’’ అని ఎంతో చక్కగా ఉపదేశించాడు.

09/19/2019 - 19:01

నీవు భూలోక సృష్టి కార్యము చేయవలసిన వాడివి. నీచే సృజించబడ జగత్తును రక్షించే కార్యక్రమము నాది.’’ అన్నాడు.
కానీ ఆ మాటలకి నా అహం దెబ్బ తిన్నది. ‘‘నేను నీ కుమారుడినని ఎలా నమ్మను?! నేను పుట్టినప్పుడు నీవు కనుపించలేదు. పద్మంలో స్వయం సంభవుడిగా జన్మించాను. కనుక ఆది పురుషుడిని నేనే! నీ అసత్యాలు నేను విశ్వసించను’ అని గర్వంగా పలికాను.

09/18/2019 - 19:35

నారదుడు ఆ ప్రకారంగానే నడుచుకుని పరిపూర్ణుడై, పరిశుద్ధ మనసుతో తన తండ్రిని ఆశ్రయించి శివతత్వాన్ని తనకు బోధించమని ప్రార్థించాడు. ఆ సందర్భాన బ్రహ్మ తన మానస పుత్రునికి ఇలా తెలిపాడు.’’ అని బ్రహ్మ నారద సంభాషణంగా శివ తత్వాన్ని శౌనకాదులకి వివరించసాగారు సూత మహర్షి.
బ్రహ్మ-నారద సంవాదం
(రుద్ర సంహిత)
‘‘నాయనా నారదా!

09/17/2019 - 19:00

కానీ నారద మహర్షి ఎంత మాత్రమూ చలించక, వారి నయగారాలకు లొంగక మరింత ఏకాగ్రతతో తన తపస్సు కొనసాగించాడు.

09/16/2019 - 19:12

పరమ శివుని ఆదేశంతో నందీశ్వరుడు అక్కడికి వచ్చి నాకు ముక్తి సాధనకు మూలమైన శివ చరిత్రాన్నీ, ఆయన విశిష్ట తత్వాన్నీ బోధించాడు. సత్య వస్తువు మహేశ్వరుడొక్కడేననీ, ఆయనను శ్రవణ మనన కీర్తనలతో ఆరాధించమనీ తెలిపి నన్ను తరింప జేసిన గురుతుల్యుడాయన. నీవు కూడా ఆ అనుష్ఠానానే్న చేసి తరించు’’ అని ఆదేశించి తన నివాసానికి మరలి వెళ్ళాడు.

09/12/2019 - 19:39

అటు పిమ్మట వ్యాసుల వారు నాకు వివరించినదీ, కలి కల్మషాలకు విరుగుడు అయినదీ అయిన శివ మహా పురాణాన్ని మీకు వినిపిస్తాను. మీ వంటి ఉత్తమ శిష్యులకి అంతటి మహత్తర పురాణాన్ని వినిపించ గలగటం నా భాగ్యంగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఎంతటి వక్తకైనా తాను ప్రవచించే విషయాలను పరిపూర్ణ భక్తితో ఆలకించే శ్రోతలు లభిస్తేనే కదా సంతృప్తి లభించేది!

Pages