S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
2
శివ పురాణాన్ని సూత శౌనక సంవాదంగా గ్రంథస్థం చేసిన వ్యాస మహర్షి అందులోని ప్రతి సంహితనూ తన పరమేశ్వర స్తుతితో ఆరంభించారు.
మొదటిదైన ‘విద్యేశ్వర’ సంహితను ప్రారంభిస్తూ ఆయన శంకరుడిని ఇలా వినుతించారు.
‘‘ఆద్యంత మంగళ మజాత
సమాన భావ
మార్యంత మీశమజరామర మాత్మదేవమ్
పంచాననమ్ ప్రబల
పంచ వినోద శీలమ్
సమ్భావయే మనసి శంకరమంబికేశమ్’’
మనం కీర్తించేది నిజానికి ఆ అద్వయ పరబ్రహ్మ అయిన పరమేశ్వరుడినే!
‘‘ఓంకార సూచితం దేవం, సర్వజ్ఞం సర్వ సాక్షిణం
అద్వయం పరమం వందే, పరబ్రహ్మాణ మీశ్వరం’’ అని పరబ్రహ్మ పంచరత్న మాలికలో కీర్తింపబడిన ఆ పరమేశ్వరుడే
‘‘ఓం నమశ్శివాయ గురవే, సచ్చిదానంద మూర్తయే
నిష్ప్రపంచాయ శాంతాయ, నిరాలంబాయ తేజసే’’
శివ పురాణం వ్యాసవిరచిత శివ మహాపురాణ సారం (వచనం)
అతడిని అరణ్యాలలో ఒంటెగా చరించమని అనాలో చితంగా శాప మిచ్చాడు. సాక్షాత్తూ రెండవ ఈశ్వరుడని పేరు పొందిన ఆ శివావతారుడి శాపం వెంటనే ఫలించింది. ఫలితం! ఒంటెగా మారాడు సనత్కుమారుడు.
తన కుమారుడి దుస్థితి బ్రహ్మ దేవుడికెంతో కష్టం కలిగించింది. తపస్సుతో పరమ శివుడిని మెప్పించి తన కుమారుడికి శాప విమోచనం కలిగించమని వేడుకున్నాడు.
లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయ. మంచివారు మంచిని గ్రహిస్తే చెడుతలంపులతో ఉన్న వారు చెడును గ్రహిస్తుంటారు. మంచివారు చెడ్డవాళ్లు అని రెండు రకాల వారు ప్రపంచంలో ఉండరు. కానీ ఒకే మనిషిలో మంచితనం, చెడుతనం రెండూ ఉంటాయ. మంచి ఆలోచన్లు ఉంటే చెడును అణగదొక్కి మంచిని పైకి తీసుకొని వస్తారు. అందరిచేత మంచివారుగా కీర్తించబడుతారు. అట్లానే ప్రకృతిలో కూడా మంచి చెడు రెండు ఉంటాయ.
మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడగలదు. మనుషులంతా ఒక్కటే అన్నది సనాతన ధర్మం భావం. ఈ విషయం అందరూ గమనించాలి.
హిందూ ధర్మము యొక్క సర్వతోముఖ వికాసానికి ఆలయాలు అత్యంత ముఖ్య సాధనాలు. సాధనాలు అని ఎందుకు అంటున్నాం అంటే కేవలం భగవంతుడు దేవా లయంలో మాత్రమే ఉన్నాడనికాక, సామా న్యులకు మనసు నిలవడానికి భక్తి పెరగడానికి విగ్రహారాధన అవసరం. అంతేకాక దేవాలయా ల ద్వారా మనిషి ఉన్నతిని చేరుకోవడానికి ఎన్నో విషయాలను ఎరుక పరుస్తారు. వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి దేవాలయా లు ఎంతో అవసరం.
లక్ష్మీదేవి కరుణలేనిదే ఏ ఒక్క పనిజరుగదు. ప్రతివారు లక్ష్మీదేవి కరుణ కావాలనే కోరుకుంటూ ఉంటారు. సరస్వతీ లక్ష్మీ దయ లేకపోతే మనిషిగా పుట్టినా కూడా ఏ ప్రయోజనాన్ని పొందలేరు. లక్ష్మీదేవి, సరస్వతీ వీరే కాదు ఏ దేవత అనుగ్రహం కలుగాలన్నా కూడా మనిషి ముందు జన్మలో మంచి పనులు చేసి ఉండాలి అంటారు. సుకృతమైన కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో వారు తప్పక సంపదలను అనుభవిస్తారని పెద్దలు చెబుతారు.
వేదమే అన్నింటికీ మూలమని హిందువులు భావిస్తారు. అందులో పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనవి. ఆర్షధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, వేద సంస్కృతిని సంరక్షించడానికి, జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్యసిద్ధికి వేదసూక్త పఠనం తప్పని సరి అని పెద్దలు చెబుతారు.
చీకటి వెలుగులు ఒకదాని తరువాత ఒకటి వచ్చినట్లే లాభనష్టాలు కూడా పక్కపక్కనే వస్తూ ఉంటాయి. ఆశావాదం నిరాశవాదం కూడా మనిషికి ఉంటూనే ఉంటాయి. అయితే ఆశావాదం చావుకు సిద్ధమయిన మనిషి బతికిస్తే నిరాశవాదం హాయిగా జీవించగలిగే స్థితిలో ఉన్న మనిషిని కూడా మృత్యువు దగ్గర చేస్తుంది.
కర్కటే పూర్వ పల్గున్యాంతులసీ కాననోద్భవామ్
పాణ్డ్య విశ్వంభరాం గోదాం వనే్ద శ్రీరంగనాయకమ్