S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/11/2019 - 22:21

వాక్కులందు సుధారసాన్ని చిప్పిల చేస్తూ సుధారస (అమృతరసం) నిలయమైన అమృతాబ్ధిలా రమణీయంగా ఉంది. ఉదరం మీద కెరటాల వలె ప్రకాశించే సుడులు కలిగి సుడులు సుడులుగా వచ్చే తరంగాలు గల సుధాసముద్రం వలె మనోజ్ఞంగా ఉంది. తెల్లని నురుగు వలె ధవళవర్ణమై మిరుమిట్లు గొలుపుతూ తెల్లని నురుగే దేహకాంతిగా ప్రకాశించే సుధాబ్ధిలా మనోహరంగా ఉంది.

12/04/2019 - 22:31

అంతే గాక వజ్రాయుధపు దెబ్బకు పెద్ద్ధ్వని చేస్తూ పెకిలిపడి కూలిపోయే కొండల నుండి జారిపడే బండరాళ్ల చప్పళ్లకు బెదరి నీటిపక్షులు రెక్కల నొక్కసారిగా విప్పి నింగిపైకెగిరాయి. వాని రెక్కల తాకిడికి అచట గల సెలయేర్లలోని నీరు తుంపరల లాగ పైకెగసి పడింది. అవి అచటనే రతిక్రీడలలో మునిగిపోయిన దేవతాస్ర్తిల ముఖాలు చెమటపట్టకుండ చల్లదనాన్ని కలిగించాయి.

12/02/2019 - 22:23

అటుపిమ్మట గణేశ్వరుడు - భైరవుడు మొదలయిన దేవతలందరిని సేవించి వెనె్నల లేని చంద్రుడిలా గంగానదిచే సుందరంగా లేని ఈ పుణ్యప్రదేశం నాకు మిక్కిలి దుఃఖం కలిగిస్తూ ఉంది. ఈ పరమేశ్వరుని నుద్దేశించి ఇక్కడనే తపస్సు చేసి ఒక పుణ్యనదిని ప్రవహింపచేయాలి. దానికి నన్ను అనుగ్రహించండి’ అని అగస్త్యుడు భార్యాసహితుడై మునులముందు నిలిచి అభ్యర్థించి వారి సంపూర్ణా- నుమతిని పొందాడు.

12/01/2019 - 22:26

ఆ జ్ఞానాన్ని తర్కించి తర్కించి చూచి నిస్సంశయచిత్తులై అరమోడ్పు కన్నులతో సమాధి నిష్ఠులై వారందరు ఆ దక్షిణకైలాసంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు.

11/28/2019 - 22:54

దాని వెంట తూర్పున ఉన్న మేరుపర్వతం దక్షిణ దిక్కుకే వచ్చింది. దాని వెంట ఉత్తరదిశయు మరియు ఉదయించుచున్న సూర్యచంద్రులు సహితం దక్షిణదిశకే వచ్చారు. ఈ చిత్రాన్ని చూచి లోకమంతా కాలమిట్లేల మారెనో అని నివ్వెరపోయింది. ఆ పార్వతీ పరమేశ్వరులకు తూర్పు దిక్కున విహారభూమియైన ఆ కైలాసపర్వతం దేవతలు సంతోషంతో సేవించు స్థలమై దక్షిణకైలాసంగా ప్రఖ్యాతి వహించింది.

11/27/2019 - 22:12

‘ఓ మహేశా! నీవు విశ్వానికి ప్రభుడివి. సర్వసృష్టి కర్తవు. విశ్వమంతట ఆత్మస్వరూపుడవై వ్యాపించి ఉన్నావు. ప్రపంచగమనాన్ని సాక్షీమాత్రంగా చూస్తూ ఉన్నావు. ఈ సమస్త పదునాల్గు భువనాల విశ్వాన్ని నీయందే నిలుపుకొని పోషిస్తూ ఉంటున్న వాడివి. విశ్వాన్ని నిర్వహిస్తూ ఉన్నది నీవొక్కడివే అని నీ ఘనతను గూర్చి నేను వినియున్నాను.

11/27/2019 - 01:34

ఆ వనం పేరు చెప్పినంతనే ఇతరవనాలు తాము దావానలం (అడవులలో వ్యాపించే అగ్ని) చేత దహింపబడి పోయినట్లుగా భయకంపితమైపోతాయి.
శబర స్ర్తిల కుచాలతో సామ్యం వహించామని గర్వంతో మదించిన కుంభస్థలాలతో ఆ అడవిలో విహరించే ఏనుగుల గర్వమంతా అణగిపోయిందని బుజ్జగించి చెబుతూ ఆ వనంలోని శబరులు వేటాడిన ఏనుగుల కుంభస్థలాల్ని పగుల గొట్టి అందులోని రక్తం చేత ఎర్రనయిన ముత్యాల్ని తెచ్చి తమ భార్యలస్తనాలపై అలంకరిస్తూ ఉంటారు.

11/26/2019 - 22:05

అదియును గాక కాముని ప్రతాపమనే దావాగ్ని (అడవులను కాల్చు అగ్ని) శిఖల నుండి వెలువడు దట్టమైన పొగయేమో!! అన్నట్లుగా ఆ దాసికి జంగమవిభుని మహిమచే వెనువెంటనే నల్లని కేశపాశమమరింది. దానిని చూచుకొని దాసి ఆనందసాగరంలో తేలిపోయి మాయా జంగమ మహేశ్వరుని పాదపద్మాలకు నమస్కరించింది. ఆయన ఆదేశానుసారం వస్త్ర-మాల్య-లేపన-్భషణాల రూపమైన నాలుగు విధాలుగా అలంకరించుకొంది. ఈశ్వరుడికి తిరిగి యథాప్రకారంగా అర్చనలు చేసింది.

11/24/2019 - 23:19

కానీ నీ చనుకొండల సందుల్లో దారి తెన్ను తెలియక తిరిగే నా మనస్సు అనే బాటసారి దాహాన్ని నీవు తీర్చగలవా?’’ అని అన్నాడు. ఆయన మాటల్ని విని ఆ కాంతామణి ‘ప్రభూ! నీ మనసునకు నచ్చిన విధంగా నీ కోరిక తీరుస్తాను. వేరుమాటలేల? మీ తలంపే నా భాగ్యం కదా!’ అని వినయపూర్వకంగా పలికి ముందు నడువ సాగింది. ఆమె వెంట లింగమూర్తి నడువసాగాడు. ఆ దృశ్యం చూచే వారికి వెనె్నల వెంట నడిచే చంద్రరేఖలా తోచి అమితాశ్చర్యాన్ని కలిగించింది.

11/21/2019 - 22:14

గుఱ్ఱాలు
ఏనుగులవలె ఆ కాళహస్తి పట్టణంలోని గుఱ్ఱాలు కూడ చాల విలక్షణమైనవి. వేగంగా పరుగిడటంలో అవి బహు శక్తివంతమైనవి. వాని వేగంతో తాము పోటీ పడజాలమని సిగ్గుపడి కాబోలు అచట గల మానవుల మనస్సు సహజమైన తమ చపలస్వభావాన్ని విడిచి నిశ్చలస్వభావాన్ని అలవరచుకొని ప్రశాంతతను వహించాయి.
శ్రీకాళహస్తిపురాధీశ వర్ణన

Pages