S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/14/2019 - 22:38

కొన్నాళ్లు మాకు అనుమతివ్వండి. తిరిగి ఈసారి మీరు మెచ్చుకునేట్టుగా చేస్తాము’ అని చెప్పారు.

04/14/2019 - 22:37

యజ్ఞ్ధాకారాన్ని లాక్కున్నాడు. దేవతలకు అందవలసిన హవిస్సులను లాక్కుని భుజించసాగాడు.
లీలావతి హిరణ్యకశపులకు ప్రహ్లాదుడు జన్మించాడు. చిన్ననాటి నుంచి మాధవునిపై ప్రేమను పెంచుకున్నాడు. అందరి బాలకులవలె కాక నిరంతరమూ ఆ దేవదేవుని పై మమకారాన్ని పెంచుకుంటూ ప్రవర్ధమానమవసాగాడు ప్రహ్లాదుడు.

04/10/2019 - 19:18

చెడిపోయేరాత రాసిన వారిని మంచిదారిలో పెట్టడమూ, మంచిరాత రాసిన వారికి చెడు చేయబోవడమూ ఎంత మూర్ఖత్వమో ప్రతివారికి ఏదో ఒక సందర్భంలో అనుభవైకవేద్యమే అవుతుంది. వాడి రాత అంతే రాసి పెట్టి ఉంది - అన్న మాట మాట్లాడని వారు చాలా తక్కువగా ఉంటారు. ఏదైనా దక్కుతుందనుకొని అది దక్కక పోయిననాడు నాకు వ్రాసి లేదు అని అనుకొనేవారు ఉండనే ఉంటారు.

04/09/2019 - 19:37

సంపదలున్నపుడు భగవంతుని సేవ చేద్దామనుకుని,ముందు సంపాదించడం మొదలుపెడితే సేవ మొదలుపెట్టేంతలోనే జీవితం అయిపోతుంది. అంతేకాదు సంపాదించిన ధనం వల్ల దుఃఖమే కాని సుఖమనేది ఉండదు. నేను ఒక తేనెటీగను చూశాను. దానినే నేను గురువుగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే రోజంతా శ్రమించి పూవు పూవు తిరిగి తేనె కూడబెడుతుంది. తాను తినక తాను కష్టపడి సేకరించిందల్లా గదులు నిర్మించి మరీ దాస్తుంది.

04/08/2019 - 22:42

మరి ఇక ఈ అజామీళుని విషయంలో మీరు చేసిన పొరపాటు తెలిసిందికదా. ఇక వీనిని వదిలివేస్తే మేము మా పని చేసుకొంటాము’అన్నారు.
తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చినట్లుగానే హరినామం తెలిసి కానీ తెలియక కానీ పలికితే ఆ పుణ్యం ఊరకనే పోదుకదా.

04/08/2019 - 18:45

విష్ణ్భుక్తుడైన ప్రహ్లాదుడు అనునిత్యం విష్ణు సంకీర్తనలోనే కాలం గడిపేవాడు. తన కర్తవ్యాన్ని ఏమరక చేస్తుండేవాడు. తన రాజ్యంలో ఎక్కడా అన్యాయాకమ్రాలు జరగకుండా ఉండాలనే ఎన్నో చర్యలు తీసుకొనేవాడు. నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి కనులు మూసుకొని పడుకునేదాకా నిరంతరం ఏపని చేసినా ప్రహ్లాదుని మనసు మాత్రం ఆ దేవదేవుని పాదపద్మాలపైనే ఉండేది.

04/05/2019 - 18:53

ఇతడు మంచి పనులెన్నిటినో చేశాడు. ఇంద్రియాలను జయించి శాంత చిత్తుడై ధర్మమార్గాన నడుస్తూ వేదాలను చదువుకున్నాడు. సర్వదా గురువులనూ, పెద్దలనూ, అతిథులను ఆశ్రయించి సేవలు చేసేవాడు. సర్వ జీవులయందు సమబుద్ధి తో ప్రవర్తించేవాడు. సత్య సంధుడై నిత్యకృత్యాలను చేస్తుండేవాడు. కాని విధి వశాత్తు ఇతనిలో వనోద్రేకంలో కావోన్మాదం కలిగింది. అద్దాని వల్లే ఇతడు ఆ వెలయాలి కామోన్మాదం లో పడిపోయాడు.

04/04/2019 - 19:41

సాధారణ ప్రాణులు కామ క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరిషడ్వర్గాన్ని జయించలేక సంసార బద్ధులై ఉంటారు. సాలెపురుగు తన నోటి నుంచి వచ్చిన ద్రవంతోనే దారాలను అల్లి అందులోనే తిరిగి తాను బంధీ అయినట్లుగా ప్రాణులన్నీ పూర్వ జన్మ సంస్కారం కొద్దీ గుణాలను ఆశ్రయించి ఉంటూ ఆ గుణాల ప్రేరణ వల్ల తిరిగి సంసారంలోనే చిక్కుకుని పోతుంటాడు.

04/03/2019 - 19:38

హరిభక్తులకు ఆమడ దూరంలోనే నిల్చుని మేము వారికి నమస్కరించి వెళ్తాము. కానీ ఈ జీవి పాపాత్ముడు కనుక మేమీ జీవిని కొని పోవడానికి వచ్చాం’ మీరు ఎక్కడో పొరబడినట్టు ఉన్నారు అన్నారు యమభటులు.

04/02/2019 - 18:28

తెల్లతామర వంటి విశాల నేత్రాలు, చెక్కిళులపై నాట్యమాడే కుండలాలు ధరించినవారు, కిరీటాలతోప్రకాశించేవారు,సుకుమారులుగా కనిపించే మీరు ఎందుకింత ప్రయాస పడి మమ్ములను లాగి అవతల పారేసి మా పాశాలలో చిక్కుకున్న ఈ అధముడిని రక్షించడానికి పూనుకొంటున్నారు.

Pages