S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/17/2017 - 22:09

యుపి కొత్త ముఖ్యమంత్రివర్యుడు యోగి ఆదిత్యనాధ్‌గారికి అన్నీ కొత్త ఐడియాలే.. స్కూళ్లమీద ఆయన ఇంచుమించు నిత్య నిఘావేశాడు. టిపిన్ డబ్బాలలో నో నాన్‌వెజ్ అన్నాడు. పిల్లలకి బ్యాగుల మోత భయంకరమైన శిక్షన్నది ఆలిండియా జనవాక్కు.

05/17/2017 - 22:07

అమ్మంగ చిక్కిన మీ మేకలయితే పోనీ అమ్మేసేవారు- అప్పనంగా చిక్కిన మేకలయితే కోసుకుతినేసేవారు. కాని అక్రమ మాంసం దుకాణంమీద గొప్పగా రైడ్ చేసి కొట్టుకొచ్చిన సొమ్ములు కావడంతో జార్ఖండ్ రాష్ట్రంలోని నగరి పోలీసులు బాధ ఒకరికి చెప్పుకోలేక అల్లాడుతున్నారు. ఈమధ్య యుపిలోలాగే జార్ఖండ్ రాష్ట్రంలో పోలీసు దాడులలో మూడువేలమంది మాంసం దుకాణదారులు అడ్డంగా దొరికిపోయారు.

05/16/2017 - 21:57

దానం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్లు.. తీసుకునేవాళ్లు అదృష్టవంతులు. మధ్యలో తన గొప్పతనం ఏం లేదని తన నిరాడంబరతను చాటి చెప్పారు కలెక్టర్ కర్ణన్. ఆపన్నహస్తం పేరుతో కలెక్టర్ చేస్తున్న సేవా ప్రయత్నంపై జనం నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. పేదవారికి తోచిన సాయం చేయడమనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఒక పాత టీషర్టుని ఓ నిరుపేద కుర్రాడికిచ్చినా మంచిపని చేసినట్లే.

05/16/2017 - 21:46

శరణార్థిని తమ అక్కున చేర్చుకోవడం అన్నది మానవత్వం. తాము నివశిస్తున్న ప్రాంతంలో బ్రతుకు బండి నడపడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే ఎవరైనా వలస వెళతారు. వేరే దేశం నుంచి వలస వచ్చినవారిని శరణార్థి అంటారు. పాకిస్తాన్‌లో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. ఇక వారిని పెట్టే ఇబ్బందులు చెప్పనలవి కాదు.

05/12/2017 - 22:11

సహజ సిద్ధంగా మనుషులలో రజో, సాత్విక, తమో గుణాలు ఉంటాయి. రజోగుణం ఉన్నప్పుడు మనలో శారీరక జీవనక్రియలు జరగడంతోపాటు, మనలో సృజనాత్మక చైతన్యం వెల్లివిరుస్తుంది. సత్వ లేక సాత్విక గుణం వలన ప్రశాంతత కలుగుతుంది. ఈ సమయంలో మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ ప్రశాంతంగా ఉంటాయి. తమోగుణం సమయంలో మనోవికారాలతోపాటు, వికృత భావాలు, భయాందోళనలు కలుగుతాయి.

05/12/2017 - 22:09

మీ భుజం మీద వెచ్చటి సూర్యరశ్మి పడుతుంటే..గాలిలో తాజా పువ్వుల సువాసన వెదజల్లుతుంటే.. కన్ను చూడగలిగినంత మేరకు ఆకుపచ్చగా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఈ ఊహే ఆనందపరుస్తుంది కదా! అదే పచ్చటి ప్రకృతిలో ఉన్న మహ త్మ్యం. పచ్చటి ప్రపంచం మనిషి మనసును ఆహ్లాదం చేస్తుంది. ప్రతిరోజూ ఓ కొత్త ఉత్సాహాన్ని పొందాలంటే అది పచ్చ చీర చుట్టుకున్న ప్రకృతి వల్లనే సాధ్యం.

05/11/2017 - 22:14

అతను ప్రజలను రక్షించటమేకాదు పర్యావరణాన్ని పరిరక్షించాలనే తపన గల పత్య్రేక పోలీసు అధికారి. అయనే బాచుపల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి. హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసు స్టేషన్‌కు వెళితే అక్కడ పోలీసు స్టేషన్ భవనంపై పచ్చటి మొక్కలు గాలికి ఊగుతుంటాయి. పర్యావరణ ప్రేమికుడైన ఈ పోలీసు అధికారి ఏ పోలీసు స్టేషన్‌లోకి అడుగుపెడితే అక్కడ ఆ భవనం నందనవనమే.

05/11/2017 - 22:12

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

05/11/2017 - 22:11

అరిగిపోయిన టైర్లని పారేసే కాలానికి కాలం చెల్లింది. ఇప్పుడు వాటికి సరికొత్త అందాలను సంతరించుకునేలా చేసే సృజన కొంతమంది చేజిక్కించుకున్నారు. దాంతో టైర్లకు రిటైర్మెంటు లేదని చెప్పొచ్చు. చాలాకాలం వాహనాల బరువు మోసి రోడ్లపై తిరుగాడిన టైర్లు ఇప్పుడు వివిధాకృతులతో ఏసీ రూముల్లో ఠీవిగా బైఠాయిస్తున్నాయి.

05/10/2017 - 22:21

ఎండలు మండుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషినీ దాహం పీడిస్తుంది. చల్లని నీళ్ళు ఎన్ని తాగినా దాహం తీరదు సరికదా కడుపుబ్బరం అనే మరో అనారోగ్యం వెంటాడుతుంది. ఫ్రిజ్‌లలో ఉంచిన శీతల పానీయాలు సైతం తాత్కాలిక ఉపశమనం కలిగించేవే కాని, దాహానికి పూర్తిగా అడ్డుకట్ట వేయలేవు. చల్లగా ఉదరంలోకి జారటం మినహా దాహాన్ని తన్ని తరిమేయలేవు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దాహం మొదలవుతుంది.

Pages