S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/23/2016 - 21:17

సాధారణంగా రోడ్లమీద వాహనాలకి- గేదెల మందలు, గొర్రెల మందలూ అడ్డంగా వచ్చి పడిపోతూంటాయి. కొన్ని చోట్ల బాతుల బారులు రోడ్డును క్రాస్ చేస్తూ ట్రాఫిక్‌ని నిలిపివేస్తాయి. కాని విమానం గాలిలోకి లేచే ముందు రయ్‌న పరుగులు తీసే ‘చప్టామార్గం’- రన్‌వే అంటారు. హఠాత్తుగా వానర మూక వచ్చి దానిమీద పడి రాస్తారోకో చెయ్యడం అహమ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగింది.

11/23/2016 - 21:16

బిహార్‌లో కాలేజీ విద్యార్థులు, యువకులు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కి ‘జై’ అనడానికి బదులు ‘వై ఫై’ అంటున్నారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లమీద ‘వై ఫై’ సదుపాయం యిస్తూనే అనేక కష్టాలు పడుతున్నారు.

11/23/2016 - 21:16

ఉత్తర కొరియా ఉగ్రశాసన పాలకుడు ‘కిమ్ జాంగ్ ఉన్’- ఊబకాయం గుండె జబ్బు యింకా చక్కెర వ్యాధితో బాధపడుతున్నా- ద్రాక్ష సారాయం తాగి, జున్ను తినకుండా వుండలేడు. కుక్క మాంసం అంటే ఎనలేని ప్రీతి. అతణ్ని ఆరోగ్యంతో ఉంచడానికి 130 మంది వైద్యులు హమేషా సిద్ధంగా ఉంటారు. దేశంలో కుక్క మాంసం అందరూ తినాలి. అందులో గోమాంసంకన్నా, కోడి మాంసంకన్నా పోషక పదార్థాలు ఎక్కువ అంటూ జనాలకి ఆర్డర్ వేశాడు.

11/23/2016 - 21:14

చారిత్రాత్మకమైన బకింగ్ హామ్ ప్యాలెట్‌కి మరమ్మతులు, అలంకరణలు వగైరా చేయడానికి నిపుణులు, రాజ కుటుంబం కూడా అంగీకరించాయి. దీని పునరుద్ధరణ, సుందరీకరణ కార్యక్రమానికి మొత్తం అరవై తొమ్మిది మిలియన్ పౌండ్ల ఖర్చవుతుందని అంచనా. అంటే రూపాయిలో లెక్క కడితే 31 వందల కోట్ల రూపాయలు! పైగా దీన్ని పూర్తి చేయడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పది సంవత్సరాలు పట్టవచ్చును.

11/18/2016 - 22:05

బాలీవుడ్ నటి అలియాభట్‌కు చదువుకునే రోజుల్లో స్కూల్లో నిద్రపోయే అలవాటు ఉండేదట. క్లాస్ ఎగ్గొట్టి టీచర్‌కు కనపడకుండా వాష్‌రూమ్‌లో దూరి అక్కడ నిద్రపోయేదాన్నని 23 ఏళ్ల అలియాభట్ తెలిపింది. ప్రతి రోజు క్లాస్ టీచర్ అలియా కోసం స్కూలంతా వెతికేది. ఎక్కడ అదృశ్యమవుతుందో అర్ధమయ్యేది కాదు. చివరకు టీచర్ అలియాను బాత్‌రూమ్‌లో పట్టుకుంది. ఇలా నిద్రపోతున్నందుకు ఆమెకు టీచర్ శిక్ష వేసింది. అదేమిటో తెలుసా!

11/17/2016 - 21:58

ఇక్కడ పిల్లలతో కనిపిస్తున్న ఇతని పేరు ప్రవీణ్ కుమార్. బీహార్‌లోని గయా రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసుగా విధులు నిర్వహిస్తాడు. పోలీసు అంటే కరకు గుండె అని అనుకుంటారు. కాని ఈ యువ రైల్వే పోలీసు అలాంటి కోవకు చెందినవాడు కాదు. రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే అక్కడ ఫ్లాట్‌ఫామ్స్ మీద ప్లాస్టిక్ సీసాలు, చిత్తుకాగితాలు సేకరించే పిల్లలకు అక్షరాలు నేర్పిస్తూ టీచర్ అవతారమెత్తాడు.

11/17/2016 - 00:13

చెలామణీలో లేకుండా ‘పాతర’లలో మూలుగుతున్న కరెన్సీ కట్టల కోసం- చెలామణీలో వున్న కోట్లాది ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఉన్నపళాన చిత్తు కాయితాలుగా మార్చేయడంతో- పేదా, గొప్పా- అంతా సమానమైపోయారు. బాగుంది గాని నిత్యావసర ప్రపంచంలో అనవసరంగా వున్న పైకం అంతా కొత్త నోట్లలోకి మార్చుకోవాలీ అంటే ముప్పాతిక వంతు పనిచెయ్యని ఎ.టి.ఎమ్‌లు- లక్షా ఇరవై వేల లెక్కల వున్న ఖాళీ పోస్ట్ఫాస్ సేవింగ్స్ బ్యాంకులూ సరిపోతాయా?

11/17/2016 - 00:07

అమెరికాలో కాలిఫోర్నియాలో ‘వౌంటెన్ వ్యూ’ హైస్కూలు చాలా పెద్దది. అందులో చరిత్ర పాఠాలు చెప్పే అధ్యాపకుడు- అరవై అయిదు సంవత్సరాల అత్యంత అనుభవజ్ఞుడైన అధ్యాపకుడు ‘ఫ్రాంక్ నెవార్రో’ని క్లాసులో పాఠాలు చెబుతూండగానే బయటికి గెంటేసింది మ్యానేజిమెంట్. వెంటనే శెలవులో పొమ్మంది. ఇంతకీ అతను చేసిన నేరమల్లా కొత్త అధ్యక్షుడు ‘డోనాల్డ్ ట్రంప్’గారు ‘హిట్లర్‌లాంటివాడు’ అనడమే.

11/17/2016 - 00:03

చెన్నైలో హోటల్స్‌లో కొత్త ‘ట్రంప్ దోశలు’ అమ్మడం మొదలుపెట్టాయి. వాటిమీద మామూ లు టాక్సులు తప్పవు గానీ, కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దోశలమీద ‘‘అది ఎమ్.ఎల్.ఏ దోశ అయినా ఎమ్.పి. దోశ అయినా సరే- దానిమీద టా క్స్ లేదు- వెయ్యరాదు’’ అని ఆర్డర్లు పడ్డాయి.

11/12/2016 - 21:14

పళ్లు క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పాచి, మరకలు పోతాయి. అలా మరకలు పోయాక కూడా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో బ్లీచింగ్ లేక లేజర్‌తో పళ్లని తెల్లగా చేసే ప్రయత్నం చేస్తాం. వంశపారంపర్యత కారణంగా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో కూడా బ్లీచింగ్ లేక లేజర్ చికిత్స చేస్తారు. బాధితులు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే, ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే చికిత్సా విధానాలు.

Pages